Ranga Marthaanda: రంగమార్తాండ. మంచి టాక్ తెచ్చుకున్న సినిమా. ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ.. పోటాపోటీగా నటించారు. నట విశ్వరూపం ప్రదర్శించారు. కృష్ణవంశీ చాలాకాలం తర్వాత మళ్లీ శెభాష్ అనిపించుకున్నారు. హిట్ టాక్‌తో.. థియేటర్లలో సందడి చేసింది. ఈలోగా దసరా, బలగం రావడంతో.. ప్రేక్షకులు అటువైపు మళ్లారు.
కట్ చేస్తే.. రంగమార్తాండ ఓటీటీలో రిలీజ్ అయిపోయింది. అరే, అప్పుడే వచ్చేసిందే అంటూ సబ్‌స్క్రైబర్స్ పండగ చేసుకుంటున్నారు. మార్చి 22న థియేటర్లలో విడుదలైంది రంగమార్తాండ. అంటే రెండు వారాల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమైంది.
చిన్నసినిమా అయినా మంచి సినిమా. ఇలాంటి మూవీ వారం, రెండు వారాలు ఆడినా చాలనుకుంటారు నిర్మాత. మంచి టాక్, చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రావడంతో ఖుషీగా ఉన్నారు. అందుకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. ఓటీటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
అయితే, ఎలాంటి ప్రచార ఆర్బాటం లేకుండా సైలెంట్‌గా ఓటీటీలో రిలీజ్ కావడం ఆసక్తికరం. ఇంతకీ రంగమార్తాండ ఎందులో స్ట్రీమింగ్ అవుతోందంటే.. అమెజాన్ ప్రైమ్ వీడియో.