Vehicle Motion Cues App : చాలాసార్లు కారు, బస్సు లేదా ఇతర వాహనాలపై ప్రయాణం చేయడం కొంతమందికి సమస్యగా మారుతుంటుంది. ఎక్కువ సేపు ప్రయాణించే క్రమంలో వారు అసౌకర్యానికి గురవ్వడం, వాంతులు చేసుకోవడం చేస్తుంటారు. ముఖ్యంగా తేలికపాటి ఆహారాన్ని తినే బదులు ఎక్కువ ఆహారం తిన్న తర్వాత ప్రయాణించేటప్పుడే చాలా మందికి వాంతులు అవుతుంటాయి. అందుకే కారు లేదా ఇతర వాహనాల్లో లాంగ్ జర్నీకి వెళ్లాడానికి భయపడుతుంటారు. ఎందుకంటే తమ వళ్ల ఇతరులు కూడా అసౌకర్యానికి గురవ్వాల్సివస్తుందని. అందుకే కారులో ప్రయాణించేటప్పుడు మోషన్ సిక్నెస్కు గురవ్వకుండా ఉండేందుకు, లేదంటే వాంతులు అయ్యే అవకాశాలను తగ్గించేందుకు ఓ నయా ఫీచర్‌ను ఐఫోన్ ఆ మధ్య తీసుకొచ్చింది.
ప్రయాణంలో వాంతులు అవ్వడాన్ని వైద్య పరిభాషలో మోషన్ సిక్ నెస్ అంటారు. అయితే ఇంతకీ ఆ ఫీచర్ పేరు ఏంటంటే వెహికల్ మోషన్ క్యూస్ (Vehicle Motion Cues). ఇది ఐఫోన్ iOS 18లో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్‌లో లేదు. కానీ వాస్తవానికి ఐఫోన్ కన్నా ఎక్కువ మంది ఆండ్రాయిడ్ యూజర్సే ఉంటారు. కాబట్టి ఆండ్రాయిడ్‌లో ఈ ఫీచర్ అందుబాటులో లేనప్పటికీ, దాని ఉపయోగించుకునేందుకు ఓ అవకాశం ఉంది. అదెలానో ఇక్కడ తెలుసుకుందాం.
ఆండ్రాయిండ్లో ఎలా ఈ వెహికల్ మోషన్ క్యూస్ ఫీచర్ ఉపయోగించొచ్చంటే?
ప్రయాణించేటప్పుడు మోషన్ సిక్‌నెస్‌ను తగ్గించేందుకు, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లో వెహికల్ మోషన్ క్యూస్ ఫీచర్‌ను ఉపయోగించుకునేందుకు వీలుగా ఓ యాప్ అందుబాటులో ఉంది. దాని పేరు కైన్స్టాప్ ( KineStop).
మీ ఫోన్‌లో ఈ యాప్‌ను ఇలా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు
మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ KineStop యాప్‌ను Google Play Store నుంచి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో మంచి రేటింగ్ ను కలిగి ఉంది. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి లాగిన్ అయితే తర్వాత, మీరు మొబైల్ డిస్‌ప్లేలో కొన్ని చుక్కలు కనిపిస్తాయి. వాహనాల మోషన్ డిటెక్షన్‌తో అవి వస్తాయి. అంటే కారు లేదా ఇతర వాహనం కదులుతున్నప్పుడు అవి కూడా అవే దిశలో పయనిస్తుంటాయి. తద్వారా మీ దృష్టి ఎక్కువగా ఈ చుక్కలపైనే పడుతుంది! ఈ చుక్కలు మోషన్ సిక్‌నెస్, వాంతులు వస్తాయేమో అనే ఆలోచన దృష్టిని దారీ మళ్లీస్తుంది. అలా మీకు మోషన్ సిక్‌నెస్, వాంతులు వచ్చే అవకాశాన్ని ఈ యాప్ తగ్గిస్తుంది.
Google Play Store నుంచి KineStopని ఇన్‌స్టాల్ చేయాలి.
యాప్‌లోకి వెళ్లి అలో డిస్‌ప్లే ఓవర్ అదర్ యాప్స్‌పై క్లిక్ చేసి ఓకే అనాలి.
ఇది టర్న్ ఆన్ అవ్వగానే, యాప్‌లో నుంచి వెనక్కి వెళ్లి, ప్లే బటన్‌పై ట్యాప్ చేయాలి.
అప్పుడు యాప్, మీ డిస్‌ప్లే పై బబుల్స్(చుక్కలు)ను చూపించడం ప్రారంభిస్తుంది. అక్కడే మీకు నచ్చిన థిమ్‌ను, కలర్స్‌ను ఎంచుకోవచ్చు.
ఈ యాప్ మీ ఫిజికల్ యాక్టివిటీని కూడా ట్రాక్ చేస్తుంటుంది.
అలానే యాప్‌లోని కాగ్వీల్ ఐకాన్‌పై క్లిక్ చేస్తే మీరు వెహికల్లో ఉన్నప్పుడు ఆటోమెటిక్‌గా యాప్ ఆటోస్టార్ట్ అయిపోతుంది.
ఇంకా మరెన్నో ఆప్షన్స్, ఫీచర్స్ ఈ యాప్‌లో ఉన్నాయి.
ఐఫోన్లో ఎలా అంటే?
ఐఫోన్ యూజర్స్‌కు ఈ KineStop యాప్‌ను యాపిల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే పైన పేర్కొన్న Vehicle Motion Cues ఫీచర్ iOS 18లో ఆటోటెటిక్గా ఉంటుంది. ఐఫోన్ సెట్టింగ్స్, యాక్సెసిబిలిటీకి వెళ్లి మోషన్‌పై క్లిక్ చేయాలి. దీని తర్వాత షో వెహికల్ మోషన్ క్యూస్‌ను ఎంపిక చేయాలి. సో మీరు మోషన్ సిక్‌నెస్ బాధితులైతే ఎంచక్కా ఈ యాప్‌ను ఉపయోగించుకుని మీ ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేసుకోండి.