PS5 Big Discount| గేమింగ్ ప్రపంచంలో అతిపెద్ద బ్రాండ్ అయిన సోనీ.. భారతదేశంలో దీపావళి సందర్భంగా పండుగ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో ప్లే స్టేషన్ గేమర్స్‌కు గుడ్ న్యూస్. ఈ దిపావళి సేల్ లో ప్లేస్టేషన్ 5 (PS5)ని తక్కువ ధరలో కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది. ఈ ఆఫర్‌లో PS5 డిజిటల్, డిస్క్ ఎడిషన్‌లపై సోనీ కంపెనీ రూ. 5,000 తగ్గింపు ప్రకటించింది. ఈ సేల్ ఇప్పటికే ప్రారంభమైంది. అక్టోబర్ 19, 2025 వరకు లేదా స్టాక్ అయిపోయే వరకు ఈ పండుగ ఆఫర్ కొనసాగుతుంది.
PS5 డిస్కౌంట్ వివరాలు
ఈ ఆఫర్‌లో PS5 డిజిటల్ ఎడిషన్ (CFI-2008B01X) ధర రూ. 49,990 నుంచి రూ. 44,990కి తగ్గింది. అదే విధంగా.. PS5 డిస్క్ ఎడిషన్ (CFI-2008A01X) అసలు ధర రూ. 54,990. కానీ డిస్కౌంట్ తరువాత రూ. 49,990 కి తగ్గిపోయింది. ఈ తగ్గింపు గేమర్స్‌కు తమకు ఇష్టమైన కన్సోల్‌ను అందుబాటు ధరలో కొనుగోలు చేయడానికి అద్భుతమైన అవకాశం.
తగ్గింపు ధరతో PS5 ఎక్కడ కొనుగోలు చేయవచ్చు?
PS5 డిస్కౌంట్ మోడల్స్ ఆన్‌లైన్ ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో లభిస్తాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బ్లింకిట్, జెప్టో, క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్, సోనీ సెంటర్ ఇతర అధీకృత ప్లేస్టేషన్ రిటైలర్ల వద్ద ఈ ఆఫర్‌ను పొందవచ్చు. దీపావళి సీజన్‌లో షాపింగ్ జోరుగా సాగుతున్న సమయంలో.. ఈ ధర తగ్గింపు గేమర్స్‌కు తాజా ప్లేస్టేషన్ కన్సోల్‌కు అప్‌గ్రేడ్ చేయడానికి సరైన సమయం.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సేల్స్‌తో సమానంగా
సోనీ ఈ ఆఫర్‌ను అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ సమయంలోనే ప్రకటించడం గమనార్హం. ఈ సేల్స్‌లో ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్‌పై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. దీపావళి సీజన్‌లో భారీ కొనుగోళ్లు చేయాలనుకునే భారతీయ కొనుగోలుదారులను ఆకర్షించడానికి సోనీ ఈ సేల్‌ను వినియోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
PS5 ధర పెంపు
ఆసక్తికరంగా, ఈ ఆఫర్‌కు ముందు జులై 2025లో సోనీ PS5 డిజిటల్ ఎడిషన్ ధరను పెంచింది. రూ. 44,990 నుంచి రూ. 49,990కి పెంచింది. భారత మార్కెట్‌లో PS5 డిజిటల్ ఎడిషన్ మొదట రూ. 39,990కి లాంచ్ అయింది. డిస్క్ ఎడిషన్ ధర ఇప్పటి వరకు మారలేదు. ప్రపంచవ్యాప్తంగా.. అమెరికా, యూకే, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో కూడా సోనీ PS5 ధరలను సవరించింది. దీనికి కారణంగా పెరుగుతున్న సుంకాలు, ఆర్థిక సవాళ్లను పేర్కొంది.
ఇప్పుడే ఎందుకు కొనాలి?
దీపావళి సీజన్‌లో PS5పై ఈ తగ్గింపు గేమర్స్‌కు అద్భుతమైన అవకాశం. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. స్టాక్ త్వరగా అయిపోయే అవకాశం ఉన్నందున.. త్వరగా కొనుగోలు చేయడం మంచిది. సూపర్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం PS5ని ఇప్పుడే సొంతం చేసుకోండి!
Also Read: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే ఐఫోన్ మోడల్ ఇదే