Jayam Ravi: కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి విడాకుల కేసు ఇప్పుడప్పుడే ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఈ మధ్యనే జయం రవి.. తన భార్య ఆర్తికి విడాకులు ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 15 ఏళ్ల కాపురం తరువాత జయం రవి, ఆర్తి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఈ విడాకుల విషయం తనకు తెలియదని, తన అనుమతి లేకుండా విడాకులు ప్రకటించడాని భర్త జయం రవిపై ఆర్తి ఫైర్ అయ్యింది.
తన పుట్టినరోజున అతను ఆర్తి నుండి విడాకుల కోసం కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. గత కొన్నిరోజులుగా వీరిద్దరూ.. తమ భాగస్వాముల గురించి సంచలన ఆరోపణలు చేస్తూనే వస్తున్నారు. విడాకులపై తన భర్తతో మాట్లాడటానికి , తనను కలవడానికి చాలా ప్రయత్నాలు చేసానని, కానీ రవి తనను దగ్గరకు రానివ్వడం లేదని ఆరోపించింది.
Singer Anurag Kulakarni: సీక్రెట్ గా ఆ సింగర్ ను పెళ్లి చేసుకున్న అనురాగ్ కులకర్ణి.. ?
ఇంకోపక్క రవి సైతం,.. విడాకుల విషయం ఆర్తి తండ్రికి తెలుసనీ, లాయర్ ద్వారానే ఆర్తికి తాను లీగల్ నోటీసులు పంపినట్లు తెలిపాడు. అంతేకాకుండా ఆర్తి వాళ్ల కుటుంబం.. తన కుటుంబం కలిసి కూర్చొని మాట్లాడుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇప్పుడు అసలు తన ప్రమేయం లేకుండా విడాకులు ఏంటి అని ఎలా అడుగుతున్నారు.. ? అని రవి చెప్పుకొచ్చాడు.
ఇక ఈ గొడవల మధ్యనే వీరి సిడాకుల కేసు కోర్టుకు వచ్చింది. తాజాగా కోర్టు జయం రవికి షాక్ ఇచ్చింది. చెన్నై ఫ్యామిలీ కోర్టు ఈ పిటిషన్ ను మొత్తం పరిశీలించి.. షాకింగ్ తీర్పును ఇచ్చింది. కొన్నిరోజులు ఈ జంటను కలిసి ఉండమని, రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నించమని చెప్పింది.
Thandel First Single: సాయిపల్లవి బిగి కౌగిలిలో నాగచైతన్య.. బుజ్జితల్లి ఎంత అందంగా ఉందో
కోర్టుకు జయం రవి హాజరుకాగా.. ఆర్తి వీడియో కాల్ లో మాట్లాడింది. ఇక ఈ తీర్పుతో జయం రవి నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. అయితే ఈ హీరో విడాకులకు ఇవ్వడానికి కారణం ఒక సింగర్ అని, ఆమె ప్రేమలో పడి.. రవి భార్యకు విడాకులు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.