WhatsApp Secert Chat QR Code | ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్. వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, టెక్స్ట్ మెసేజ్‌లను ఈ యాప్ ద్వారా సులభంగా చేయవచ్చు. ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్‌లను షేర్ చేయవచ్చు. అలాగే ఎక్కువ మందికి తెలియని ఒక ఫీచర్ కూడా ఉంది. అదే మీరు చాటింగ్ చేసిన విషయాన్ని రహస్యంగా ఉంచడం. ఇది వాట్సాప్ QR కోడ్ ఫీచర్ ద్వారా సాధ్యం. ఈ ఫీచర్ ఫోన్ నంబర్ సేవ్, షేర్ చేయకుండా చాట్‌లు ప్రారంభించేలా చేస్తుంది. కొత్త వ్యక్తులతో సులభంగా కనెక్ట్ చేయవచ్చు. మీరూ సీక్రెట్ గా చాటింగ్ చేయాలనుకుంటున్నా.. అయితే ఈ ఫీచర్ గురించి వివరాలు మీ కోసం.
నంబర్ సేవ్ చేయకుండా కనెక్ట్ అవ్వండి
ఈ ఫీచర్ ఉపయోగించి కాంటాక్ట్ లేని వారితో చాట్ చేయవచ్చు. సోషల్ మీడియాలో ఎవరితోనైనా కొత్తగా స్నేహం చేశారా? వారితో వాట్సాప్ లో చాటింగ్ చేయాలంటే.. మీ QR కోడ్‌ను వారితో షేర్ చేయండి. వారు స్కాన్ చేసి వెంటనే చాట్ ప్రారంభిస్తారు. నంబర్ సేవ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే గ్రూప్ చాట్ కోసం కూడా స్నేహితులు, కుటుంబ సభ్యులు మీ కోడ్ స్కాన్ చేసి కొత్త గ్రూప్ లలో కూడా చాటింగ్ లేదా కాల్ చేయవచ్చే. వారు మిమ్మల్ని వాట్సాప్ కాంటాక్ట్‌గా జోడించవచ్చు. అయితే ఇదంతా తాత్కాలిక ఉపయోగం కోసమే. QR కోడ్ రీసెట్ చేసే వరకు లేదా అకౌంట్ డిలీట్ చేసే వరకు చెల్లుతుంది.
విశ్వసనీయ వ్యక్తులతోనే షేర్ చేయండి
మీ వాట్సాప్ QR కోడ్‌ను విశ్వసనీయ వ్యక్తులతో మాత్రమే షేర్ చేయండి. ఇతరులు దాన్ని సులభంగా ఫార్వార్డ్ చేయవచ్చు. స్కాన్ చేసి ఎవరైనా మిమ్మల్ని జోడించి చాట్ చేయవచ్చు. మీ ప్రైవెసీని ఈ విధంగా కాపాడండి. అవాంఛిత కాంటాక్ట్‌లను నివారించండి. ఇది మీ చాటింగ్, కాల్స్ ను సురక్షితంగా ఉంచుతుంది. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండటం మంచిది.
QR కోడ్ చాట్ ఎలా ఉపయోగించాలి
మీ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌లో వాట్సాప్ ఓపెన్ చేయండి. కుడి వైపున ఉన్న సెట్టింగ్స్ ఐకాన్‌పై ట్యాప్ చేయండి. మీ పేరు పక్కన QR ఆప్షన్‌ను చూడండి. దానిపై క్లిక్ చేస్తే పూర్తి QR కోడ్ కనిపిస్తుంది. ఈ కోడ్ డైరెక్ట్ చాట్ బాక్స్‌ను ఓపెన్ చేస్తుంది. దీన్ని ఎవరితోనైనా షేర్ చేసి చాటింగ్ ప్రారంభించండి.
యాప్‌ల ద్వారా QR కోడ్ షేర్ చేయండి
మీ QR కోడ్‌ను ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి. మెసేజెస్ లేదా X ప్లాట్‌ఫామ్ ద్వారా కూడా పంపవచ్చు. ఇతర యాప్‌లతో కూడా ఇది పనిచేస్తుంది. నంబర్ లేకుండా రహస్య చాట్‌లు ప్రారంభించండి. ఈ ఫీచర్ ఈజీగా కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. విభిన్న ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సులభంగా షేర్ చేయండి.
QR కోడ్‌ను ఎప్పుడైనా రీసెట్ చేయండి
మీ కోడ్‌ను ఎక్కువ మందితో షేర్ చేశారా? అవసరమైతే దాన్ని రీసెట్ చేయండి. కోడ్ కింద “Reset QR code” బటన్‌ను కనుగొనండి. దానిపై క్లిక్ చేసి కొత్త కోడ్ జనరేట్ చేయండి. పాత కోడ్ ఇక వెంటనే నిరుపయోగంగా మారుతుంది. ఇది మీ కంట్రోల్ లో ఉంచుతుంది. ఎక్కువ కాలం ఉపయోగించిన తర్వాత రిఫ్రెష్ చేయండి.
Also Read: అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్విగ్గీలో ఎక్కువ డిస్కౌంట్ కావాలా? ఈ క్రెడిట్ కార్డ్స్ ఉంటే సరి