Apple Foldable iPhone| టెక్ దిగ్గజం ఆపిల్ ఇటీవలే విడుదల చేసిన ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లు చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ఈ తాజా సిరీస్ లో ప్రో మాక్స్ మోడల్స్ తో పాటు బేస్ మోడల్స్ కూడా అందరి దృష్టిని ఆకర్షించాయి. అందుకే సేల్స్ ప్రారంభం కాగానే భారతదేశంలో ఐఫోన్ 17 సిరీస్ కోసం అభిమానులు క్యూ కట్టారు. ఈ ఉత్సాహంతోనే వచ్చే ఏడాది విడుదల కానున్న ఐఫోన్ ఫోల్డ్ గురించి చర్చలు ఊపందుకున్నాయి. బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ లో ఐఫోన్ ఫోల్డ్ డిజైన్, ధర వివరాలు లీక్ అయ్యాయి. రిపోర్ట్ ప్రకారం.. ఈ ఫోల్డెబుల్ ఐఫోన్ రూపం చూస్తే.. రెండు ఐఫోన్ ఎయిర్‌లను పక్క పక్కనే కలిపినట్లు ఉంటుంది, ఇది సన్నగా, ప్రీమియం లుక్‌తో ఒక పుస్తకం శైలిలో మడత వేసేలా ఉంటుంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఐఫోన్ ఎయిర్‌తో పోలీక
ఐఫోన్ ఎయిర్.. యాపిల్ బ్రాండ్ లో అత్యంత సన్నని ఫోన్. కేవలం 5.6 మిమీ మందంతో ఉంటుంది. ఐఫోన్ ఫోల్డ్ కూడా ఈ సన్నని డిజైన్ తో రూపొందించబడింది. టైటానియం ఫ్రేమ్‌తో ఎక్కువ మన్నిక ఇస్తుంది. మడిచినప్పుడు దీని మందం 9-9.5 మిమీ ఉంటుంది, ఇది గెలాక్సీ Z ఫోల్డ్ 7 (8.9 మిమీ) కంటే కొద్దిగా ఎక్కువ. పూర్తిగా తెరిచినప్పుడు విశాలమైన, ఫ్లాట్ స్క్రీన్ మల్టీటాస్కింగ్‌కు అనువైన అనుభవాన్ని అందిస్తుంది.
డిస్‌ప్లే, స్క్రీన్‌ల పోలిక
ఐఫోన్ ఫోల్డ్‌లో 7.8-అంగుళాల ప్రధాన ఇన్నర్ డిస్‌ప్లే, 5.5-అంగుళాల సెకండరీ ఔటర్ డిస్‌ప్లే ఉంటాయి. ఇవి త్వరిత పనులకు ఉపయోగపడతాయి. రెండు డిస్‌ప్లేలు విశాలమైన, చిన్న ఫార్మాట్‌లో ఉంటాయి. శామ్‌సంగ్ ఈ ఫోల్డింగ్ ప్యానెల్స్‌ను సరఫరా చేస్తోంది. మడత వల్ల కనిపించే క్రీజ్‌ను దాచడానికి యాపిల్ డిజైన్ రూపొందించింది. లిక్విడ్ మెటల్ హింజ్ సన్నని చట్రంతో ఎక్కువ మన్నికను అందిస్తుంది. ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాలు అండర్-స్క్రీన్ కాన్ఫిగరేషన్‌తో దాచబడి ఉంటాయి.
టెక్నాలజీ, ఫీచర్లు
ఐఫోన్ ఫోల్డ్ లో అడ్వాన్స్ A20 ప్రో చిప్‌సెట్‌తో పవర్‌ఫుల్ గా పనితీరు ఉంటుంది. 16GB RAMతో మల్టీటాస్కింగ్ సమర్థవంతంగా ఉంటుంది. 2TB స్టోరేజ్ ఆప్షన్, కార్బన్ లిథియం బ్యాటరీతో సన్నని డిజైన్‌ను కొనసాగిస్తుంది. కెమెరా సిస్టమ్‌లో వెనుకవైపు డ్యూయల్ కెమెరాలు ఉంటాయి. వైడ్, అల్ట్రా-వైడ్ లెన్స్‌లతో స్పష్టమైన ఫోటోలు తీయడానికి వీలుంటుంది. ముందు కెమెరాలు ఓపెన్, క్లోజ్ చేసిన సమయంలో కూడా సెల్ఫీలకు అనుకూలంగా ఉంటాయి.
డిజైన్
ఫోల్డబుల్ ఫోన్ టైటానియం మెటీరియల్‌తో ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. బుక్ శైలిలో నోట్‌బుక్‌లా విప్పబడుతుంది. హింజ్ సిస్టమ్ ఫ్లెక్సిబుల్ స్క్రీన్‌ను రక్షిస్తుంది. ఈ ఫోల్డెబుల్ ఐఫోన్ పై చైనాలో ప్రోటోటైప్ టెస్టింగ్ జరుగుతోంది. కొన్ని టెస్టులు భారతదేశంలో కూడా జరిగే అవకాశం ఉంది. కొత్త iOS 27లో ఫోల్డబుల్ డివైస్ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఫీచర్లు ఉంటాయి.
ధర, విడుదల సమయం
ఐఫోన్ ఫోల్డ్ ధర అమెరికాలో $1,800 నుంచి ప్రారంభమవుతుంది. ప్రో స్పెసిఫికేషన్‌లు ఉన్న ఐఫోన్ ఫోల్డ్ ధర $2,300 వరకు ఉంటుంది. భారతదేశంలో రూ. 1,50,000 దాటవచ్చు, ఇది యాపిల్ అత్యంత ఖరీదైన ఫోన్ కావచ్చు. 2026 వేసవిలో ఐఫోన్ ఫోల్డ్ ఉత్పత్తి ప్రారంభమవుతుంది, సెప్టెంబర్ 2026లో ఐఫోన్ 18తో పాటు దీని లాంచ్ ఉంటుంది. అక్టోబర్ లేదా నవంబర్ 2026లో విడుదల కానుంది. ఈ ఫోన్ అసెంబ్లీని ఫాక్స్‌కాన్ నిర్వహిస్తుంది.
ఇది ఎందుకు ముఖ్యం?
ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శామ్‌సంగ్, గూగుల్ ఆధిపత్యం కొనుసాగుతోంది. అయితే, యాపిల్ సన్నని డిజైన్, క్రీజ్ లేని స్క్రీన్‌పై దృష్టి సారిస్తోంది. మల్టీటాస్కింగ్, టెక్ ఔత్సాహికులను ఆకర్షించడం లక్ష్యం. 2027 చివరి నాటికి 20 మిలియన్ యూనిట్లు సేల్ అవుతాయని అంచనా. ఐఫోన్ ఫోల్డ్ సన్నని డిజైన్, స్పెషల్ ఫీచర్స్‌తో మార్కెట్ లో విప్లవం తీసుకురానుంది.
Also Read: ఒప్పో F31 ప్రో ప్లస్ vs నథింగ్ ఫోన్ 3ఏ ప్రో.. ఏది కొనుగోలు చేయాలి?