Big Stories

Amir Sarfaraz Tamba Died: పాకిస్తాన్‌లో సరబ్‌జీత్ సింగ్‌ను చంపిన హంతకుడు దారుణ హత్య

Amir Sarfaraz Tamba died who killed Sarabjit Singh in Pakistan: భారతదేశానికి చెందిన సరబ్ జిత్ సింగ్ ను జైలులో చంపిన పాక్ మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ అమిర్ సర్ఫరాజ్‌ని గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం కాల్చి చంపారు.

- Advertisement -

అమిర్ సర్ఫరాజ్‌ని లాహోర్‌లో ఇద్దరు వ్యక్తులు దగ్గర నుంచి తుపాకీతో కాల్చి చంపారు. జైల్లో ఉన్న సరబ్‌జీత్ సింగ్ పై దాడి చేసినందుకు అమీర్‌ను సర్ఫరాజ్‌పై కేసు నమోదైంది. అయితే అమీర్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం లేకపోవడంతో 2018లో పాకిస్తాన్ కోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ అతన్ని విడిచిపెట్టింది. లాహోర్‌లోని ఇస్లాంపుర ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపి అమిర్ సర్ఫరాజ్ ను హత్య చేశారు.

- Advertisement -

పంజాబ్ కు చెందిన సరబ్‌జీత్ సింగ్ అనుకోకుండా భారత్-పాక్ సరిహద్దును దాటి పాకిస్తాన్‌లోకి ప్రవేశించాడు. వెంటనే సరబ్‌జీత్‌ను అదుపులోకి తీసుకున్న పాక్ సైన్యం.. అతనిపై గూఢచారి ముద్రవేసి 1990లో జైల్లో పెట్టింది. అయితే అప్పట్లో సరబ్‌జీత్ సింగ్ అరెస్ట్ ను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.

సరబ్‌జీత్ ను విడిచిపెట్టాలని అతని సోదరి దల్భీర్ కౌర్‌తోపాటుగా.. కుటుంబం పలుమార్లు పాకిస్తాన్ ను కోరినా సరే ఫలితం లేకపోయింది. సరబ్‌జీత్ ను పాక్ ప్రభుత్వం లాహోర్ లోని లఖ్‌పత్ జైల్లో పెట్టింది. అయితే భారత పార్లమెంట్ దాడికి పాల్పడిన అప్జల్ గురిని ఉరితీసిన కొన్ని రోజుల తర్వాత అమీర్ సర్ఫరాజ్ సహా ఇతర ఖైదీలు సరబ్‌జీత్ పై దాడి చేశారు.

Also Read: ఇజ్రాయెల్ పై ఇరాన్ డ్రోన్ల దాడి.. ఖండించిన ఐరాస సెక్రటరీ జనరల్

వారు జరిపిన దాడిలో సరబ్‌జీత్ తీవ్రంగా గాయపడ్డారు. ఇటుకలతో సరబ్‌జీత్ పై దాడి చేయడంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే సరబ్‌జీత్ పాకిస్తాన్ జైలులో 23 ఏళ్లు గడిపి.. 2013లో 49 ఏళ్ల వయస్సులో లాహోర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దల్భీర్ కౌర్ జీవితం ఆధారంగా రణదీప్ హూడా, ఐశ్వర్యరాయ్ లు కలిసి నటించిన సరబ్ జిత్ అనే సినిమా హిందీలో 2016లో విడుదలైంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News