Big Stories

Tulasi Plant Placement @Home: తులసి మొక్క.. ఏ దిక్కులో పెడితే లక్ష్మీ దేవి కటాక్షం ఉంటుందో తెలుసా..?

Tulasi Plant Placement in Home: ఇంట్లో తులసి మొక్కను ఉంచుకోవడం హిందూ సంప్రదాయం. అది తరతరాలుగా వస్తున్న ఆచారమనే చెప్పాలి. తులసి మొక్క ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్లే అని భావిస్తుంటారు. తులసి మొక్కను ప్రతి రోజు పూజించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం వరిస్తుందని అంటారు. అందుకోసం ప్రతీ ఒక్కరి ఇంట్లో తులసి మొక్కను ఆరాధిస్తుంటారు. అయితే తులసి మొక్కను ఇంట్లో ఏదో ఒక్క చోట పెట్టి పూజిస్తే సరిపోతుంది అనుకుంటుంటారు. కానీ తులసి మొక్కను ప్రత్యేకమైన స్థలంలో ఉంచాలని అంటారు. అయితే ఏ దిక్కులో తులసి మొక్కను పెడితే లక్ష్మీ కటాక్షం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

సాధారణంగా పూర్వీకులు మన ఇళ్లలో తులసి చెట్టును ఇంటి గుమ్మానికి ఎదురుగా పెడుతుంటారు. లేదంటే పెరడు ఉంటే పెరట్లోని తులసి మొక్క ఇంటి గుమ్మానికి ఎదురుగా కనిపించేలా నాటుతారు. అలా ఇంటి గుమ్మానికి ఎదురుగా పెట్టడం మూలంగా లక్ష్మీ కటాక్షం ఉంటుందని భావిస్తుంటారు. అయితే ఇప్పుడు సిటీలో బ్రతికే జీవితాలకు అపార్ట్మెంట్లలో ఉండే వారు తులసి మొక్కను ఎక్కడ పెట్టాలో అని అర్థం కాక ఏదో ఒక చోట ఉంచుతారు. అయితే లక్ష్మీ కటాక్షం రావాలంటే ఇంట్లోని వెలుతురు ఎక్కువగా వచ్చే ప్రదేశంలో తులసి మొక్కను ఉంచాలట. అలా ఉంచిన తులసి చెట్టును ఇంటి ఇల్లాలు ప్రతి రోజు స్నానం చేసి తులసి కోటను ఆరాధించాలట. ప్రతి రోజూ దీపారాధన చేసి తులసి మొక్కను పూజించడం వల్ల లక్ష్మీ దేవి వరిస్తుంది.

- Advertisement -

Also Read: Sri RamaNavami: రామ నవమికి బాలరాముడి భక్తులకు మహా ప్రసాదం.. లక్ష మఠాడీల నైవేద్యం

ప్రతి రోజూ ఇంటి యజమాని తులసి మొక్కకు నీరు పోయాలి. శ్రీ మహావిష్ణువు తులసి ప్రియుడు అంటారు. అందువల్ల తులసిని ప్రతిరోజూ పూజించడం వల్ల ఇంట్లో మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతుంది. మంగళ, శుక్రవారాల్లో తులసి ఆకులను కోయకూడదని శాస్త్రంలో రాసి ఉంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి, రామ తులసి, విష్ణు తులసి అనే మూడు రకాలు ఉంటాయట. అయితే తులసి కోటలో విష్ణు రూపంగా కూడా చాలా మంది కుటుంబాలలో రాతి ప్రతిమను ఉంచుతారట. తులసి మొక్కను ఇంట్లో ఆరాధించడానికే కాకుండా.. ఔషధాలలోను ఉపయోగిస్తారు. తలనొప్పి, గొంతు నొప్పికి తులసి మొక్క బాగా పనిచేస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News