BigTV English

Motorola Edge 50 Neo: మోటోరోలా కొత్త ఫోన్ స్పెసిఫికేషన్లు లీక్.. ఫీచర్లు మామూలుగా లేవు బ్రదర్..!

Motorola Edge 50 Neo: మోటోరోలా కొత్త ఫోన్ స్పెసిఫికేషన్లు లీక్.. ఫీచర్లు మామూలుగా లేవు బ్రదర్..!

Motorola Edge 50 Neo: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటో దేశీయ మార్కెట్‌లో తన హవా చూపిస్తోంది. ఫోన్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని వారి టేస్ట్‌కు తగ్గట్టుగా కొత్త కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇక Motorola త్వరలో Motorola Edge 50 Neoని పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మోడల్‌ను త్వరలో విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే అధికారికంగా ఇంకా ప్రకటించబడలేదు. అయినప్పటికీ ఇటీవల ఎడ్జ్ 50 నియో డిజైన్, స్పెసిఫికేషన్‌లు లీక్ అయి బాగా రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు దాని హార్డ్‌వేర్‌తో పాటు, కలర్ ఆప్షన్‌లు కూడా లీక్ అయ్యాయి. Motorola Edge 50 Neo గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ Motorola Edge 50 Neo స్పెసిఫికేషన్‌లను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాని ప్రకారం.. Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ 6.4-అంగుళాల pOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది పూర్తి HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో MediaTek Dimensity 7300 ప్రాసెసర్ ఉంటుందని చెప్పబడింది. కెమెరా సెటప్ విషయానికొస్తే.. ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ సెకండ్ కెమెరా, 10 మెగాపిక్సెల్ థర్డ్ కెమెరా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఫోన్ ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

Also Read: మోటో నుంచి కొత్త ఫోన్.. ఫీచర్లు ఓకే.. లాంచ్ ఎప్పుడంటే?


ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4,310mAh బ్యాటరీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 OSలో రన్ అవుతుంది. ఇందులో 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంటుంది. అలాగే దీని మందం 8.1 మిమీ, బరువు 171 గ్రాములుగా తెలుపబడింది. కాగా ఈ కొత్త నివేదికలో ఎడ్జ్ 50 నియోకి సంబంధించిన ఫోటోలు కూడా షేర్ చేయబడ్డాయి.

కాగా Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉన్నట్లు టిప్‌స్టర్ తెలిపాడు. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ పోయిన్సియానా కలర్ ఆప్షన్లను కలిగి ఉంటుందని చెప్పబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో వేగన్ లెదర్ ఫినిషింగ్ అందించబడింది. కానీ అది ఇప్పటికీ స్పష్టంగా లేదు. వెనుక భాగంలో Pantone లేబుల్‌ను చూడవచ్చు. ఇక దీని లాంచ్ విషయానికొస్తే.. Motorola సెప్టెంబర్ 2023లో Edge 40 Neoని పరిచయం చేసింది. కాబట్టి రాబోయే మోడల్ కూడా అదే లాంచ్ టైమ్‌లైన్‌లో అంటే సెప్టెంబర్ 2024లో వస్తుందని భావిస్తున్నారు.

Tags

Related News

Tesla Model Z: ఎలక్ట్రిక్ కార్లలో సంచలనం.. టెస్లా మోడల్ జెడ్ పూర్తి వివరాలు..

Amazon vs Flipkart Laptops: అమెజాన్ vs ఫ్లిప్‌కార్ట్.. ల్యాప్‌టాప్స్‌పై డిస్కౌంట్లలో ఏది బెటర్?

Aprilia Tuono 457: గుండె ధైర్యం ఉన్నవాళ్లకే ఈ బైక్!.. అబ్బాయిలు రెడీనా?

iPhone 17 Connectivity issues: ఐఫోన్ 17, ఆపిల్ వాచ్‌లో వైఫై, బ్లూటూత్ సమస్యలు.. అసలు కారణం ఇదే..

Best Waterproof Phones: అమెజాన్ ఫెస్టివల్ సేల్ 2025.. వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు

Wi-Fi at Night: రాత్రిపూట వైఫై ఆన్ చేసి ఉంచితే ఇంత డేంజరా? ఊహిస్తేనే భయంగా ఉంది!

Amazon OnePlus: అమెజాన్ హాట్ డీల్.. 7100mAh బ్యాటరీ, 50MP కెమెరా గల వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ తగ్గింపు..

Flipkart Scam: ఫ్లిప్‌కార్ట్‌ సేల్ అంతా స్కామ్.. సోషల్ మీడియాలో నెటిజెన్ల ఆగ్రహం

Big Stories

×