Gundeninda GudiGantalu Today episode November 10th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు బామ్మ పుట్టినరోజుకి ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాను కానీ అది జరగలేదు. నాకు ఇంట్లో ఉంటే కచ్చితంగా ఆ నగల విషయమే గుర్తొస్తూ ఉంటుంది అని బయటికి వెళ్లిపోతాడు. పుట్టినరోజు వేడుకలు జరిగే జరిగే టైం కి నేను మళ్లీ ఇంటికి వస్తానని అంటారు. సుశీల సత్యం ఒద్దురా అని చెప్పిన సరే నాకు కొన్ని గుర్తొస్తుంటాయి నేను వెళ్లాల్సిందేనని బాలు బయటికి వెళ్లిపోతాడు. ప్రభావతి వాళ్ళ అత్తకి ఎలాగైనా మంచి గిఫ్ట్ ఇచ్చి అత్త దగ్గర నుంచి బహుమతి పొందాలని అనుకుంటుంది..
అయితే కామాక్షి కి ఫోన్ చేస్తుంది ప్రభావతి. మా అత్తయ్య గారు పుట్టినరోజు వేడుకలు చేయాలనుకుంటున్నాం మేము అని అనగానే కామాక్షి సెటైర్లు వేస్తుంది.. అయితే నేనేం చేయమంటావు వచ్చి చప్పట్లు కొట్టాలా ఏంటి అంటూ కామాక్షి అంటుంది. అది కాదు వదిన మా అత్తయ్య ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తుందట. అయితే ఆ గిఫ్ట్ నేనే తీసుకోవాలని అనుకుంటున్నాను. కానీ మా అత్తయ్య ఒక మెలిక పెట్టింది.. ఆమె మనసుకి తగిన గిఫ్ట్ ఇస్తే సర్ప్రైజ్ ఏటో వాళ్ళకి ఇస్తదంట అని ప్రభావతి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రభావతి అత్త గిఫ్ట్ ను కొట్టేయాలని అనుకుంటుంది.. మీ ఇంట్లో పాత సామాన్లు చాలానే ఉన్నాయి కదా.. అందులో ఓ పాత టీవీ ఉంది కదా దాని అట్ట కూడా అలానే ఉంది అని కామాక్షి అంటుంది. అయితే ఆ టీవీ నాకు ఇవ్వు ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏదో ఇస్తే దాంట్లో నీకు కూడా ఇస్తాను అని ప్రభావతి అంటుంది. కామాక్షి మొదటి షాక్ అయిన కూడా ఆ తర్వాత ప్రభావతికి టీవీ ఇవ్వడానికి ఒప్పుకుంటుంది.. మొత్తానికి ప్రభావతి తన అత్తగారిని బుట్టలో వేసుకొని ఎందుకు టీవీని ఇవ్వాలని అనుకుంటుంది.
సుమతి మీనా కోసం వచ్చి బయటే ఉంటుంది.. ఏంటి లోపలకు రాలేదు అని మీనా అడుగుతుంది. మీ అత్తతో ఎందుకు గొడవలు అని సుమతి అంటుంది. ఫోన్ అడిగావు కదా ఇదిగో అని అంటుంది. అసలు ఈ ఫోన్ నీకెందుకు అని సుమతి అడుగుతుంది. బామ్మ పుట్టినరోజు వీడియో తీద్దామని అని అంటుంది. అక్కడ మీ నగల గురించి ఏదేదో మాట్లాడుతున్నారు నిజమేనా అని అడుగుతుంది. కానీ దానికి ఇప్పుడు అవన్నీ ఎందుకు నువ్వు వెళ్లి సాయంత్రం రా అని అంటుంది.
మీనా బామ్మ పుట్టినరోజు వేడుకలను వీడియో తీస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఏం చేస్తున్నావు అని సత్యం అడుగుతాడు. బామ్మ పుట్టినరోజు వేడుకలు ఈ వీడియో తీసి ఆయనకు పంపిస్తున్నాను మామయ్య అని అనగానే సుశీల సత్యం ఇద్దరూ షాక్ అవుతారు. ఏంటి వాడు పుట్టినరోజు వేడుకకు రావట్లేదా ఏంటి అని సత్యం అడుగుతాడు. అదేం లేదు మావయ్య వస్తాడు. వాడు రాకుంటే ఎవరికీ ఏం నష్టం లేదులే అని ప్రభావతి అంటుంది. ఆ మాట విన్న సుశీల నోరుమూస్తావా అని అడుగుతుంది. వాడికి ఏదో అనుకుంటున్నాడు అత్తయ్య గారు అందుకే రావట్లేదు అని ప్రభావతి అంటుంది. ఇంట్లో కొందరు మనుషులు వాళ్ళ దుర్బుద్ధి తెలిసింది. అందుకే ఆయన ఇంట్లో ఉంటే ఎక్కడ గొడవలు అవుతాయి అని బయటికి వెళ్లిపోయారు అని నేను అంటుంది.
మీనా మీ గురించి చెప్పండి అమ్మమ్మ అని అడుగుతుంది.. సుశీల తన గురించి తన ఒక్కదాని ఒక కొడుకు సత్యం గురించి గొప్పగా చెప్తుంది.. పక్కనే ఉన్న ప్రభావతి ఇక్కడ నేను కూడా ఉన్నాను అని అంటుంది నువ్వు అవసరం లేదు పక్కకెళ్ళి అని సుశీల అంటుంది.. ఆ తర్వాత మళ్లీ మాట్లాడుతూ ఉంటే రోహిణి మధ్యలో వచ్చే డిస్టర్బ్ చేస్తుంది.. ఇక్కడ ఉంటే ఎవరో ఒకరు వస్తారు మనం పైకి వెళ్దాం పదండి బామ్మ అని మీనా అంటుంది. సత్యం తీసుకెళ్ళమ్మ మెల్లగా మెట్లు ఎక్కించు అని పంపిస్తాడు.
ఇక సుశీల నీ గురించి చెప్పు అనగానే ఇప్పటి రోజులు ఏమున్నాయి బాల్యం గుర్తుకొస్తుంటేనే కన్నీళ్లు వస్తున్నాయి అని అంటుంది. బాల్యంలో తన ముగ్గురు స్నేహితుల గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటుంది. తన స్నేహితులతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుని సుశీల ఎమోషనల్ అవుతుంది. అది చూసిన మీనా అమ్మమ్మ గారు మీరు బాధపడకండి మళ్లీ మీ ఫ్రెండ్స్ ని మీరు కలుస్తారు లేండి అని అంటుంది.. ఎందుకు రాగానే సత్యం బాలుకి ఎన్ని సార్లు ఫోన్ చేసినా తీయట్లేదు అమ్మ ఏమైంది అని అడుగుతాడు.
ఇది నా ట్రిప్ లో ఉన్నాడేమో మావయ్య మళ్ళీ కాల్ చేస్తాడులే అని అంటుంది.. వాడు ట్రిప్ లో ఉన్న సరే కారు పక్కన ఆపీ నాకు ఫోన్ చేస్తాడు.. కానీ ఇప్పుడు నా ఫోన్ తీయట్లేదు అంటే ఏదో జరిగింది ఏమైనా గొడవ పడ్డారని అడుగుతాడు.. అదేం లేదు మామయ్య అలాంటిదేమీ జరగలేదు మీరేమీ కంగారు పడకండి నేను ఒకసారి ఫోన్ చేసి చూస్తాను అని నేను అంటుంది. బాలుకి ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు మావయ్య అని అనగానే వాడు ఏమైనా తాగుతున్నాడు అని సత్యం కంగారు పడతాడు. ఏం లేదు మావయ్య వస్తాడు లెండి అని మీనా అంటుంది. అక్కడికి వచ్చిన ప్రభావతి వాడికి సంతోషం వచ్చినా బాధ వచ్చినా తాగేసి వస్తాడు మీరే చూస్తారు గా రేపు పొద్దున్నే తాగేసి తూగుతూ వస్తాడు అని మాట్లాడుతుంది.. ఇవన్నీ నీకు అవసరం లేదు నువ్వు లోపలికి వెళ్లి నీ పని చూసుకో పో అని సత్యం అంటాడు.
Also Read :పవన్ సాయి కాపురంలో చిచ్చు పెట్టింది ఆమెనే.. ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం..
మీ అత్తయ్య అన్నట్టు వాడు తాగుతున్నాడు ఏంటి అని సత్యం అంటాడు. అదేం లేదులే మామయ్య అని మీనా అంటుంది. కానీ మీద మాత్రం మళ్లీ కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో నిజంగానే ఆయన తాగుతున్నాడా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది. బాలు ఎవరికోసమో రాజేష్ తో కలిసి వెతుకుతూ ఉంటాడు. రవి శృతి ఇద్దరూ గుడి దగ్గర మౌనికను చూసి ఆగి మాట్లాడతారు. ఈరోజు బామ్మ పుట్టినరోజు కదా.. నువ్వు కూడా రావాలి నానమ్మ ఇంత దూరం వచ్చింది కదా నువ్వు రాకుండా ఉంటే ఏం బాగుంటుంది అని రవి శృతి ఇద్దరు పిలుస్తారు. దానికి వాళ్ళ అత్తయ్య ఒప్పుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…