RCB For Sale: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bengaluru) అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. 2025 టోర్నమెంట్ గెలిచిన సంతోషం ఏడాది కూడా మిగిలికుండానే చేస్తోంది బెంగళూరు యాజమాన్యం. త్వరలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును అమ్మేసేందుకు డియాగో ( Diageo) సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే చాలా వార్తలు వైరల్ గా మారాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనుగోలు చేసేందుకు పలు కంపెనీలు ఎగబడుతున్నాయి. అయితే లేటెస్ట్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును కొనుగోలు చేసేందుకు జీరోధా కంపెనీ ( Zerodha ) ముందుకు వచ్చిందట.
Also Read: IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్, ఐపీఎల్ 2026 రిటెన్షన్ ఎప్పుడంటే?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును అమ్మేసేందుకు డియాగో ముందుకు వచ్చిన నేపథ్యంలో అదానీ అలాగే అంబానీ లాంటి కంపెనీలు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. Jsw కంపెనీతోపాటు అమెరికాకు సంబంధించిన మరో రెండు కంపెనీలు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో జీరోధా అనే కంపెనీ సీఈవో నిఖిల్ కామత్ ( Nikhil Kamath) బెంగళూరు జట్టును కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారట. ఇందులో భాగంగానే అందరికంటే ఓ 100 కోట్లు ఎక్కువ ఇచ్చైనా బెంగళూరులో సొంతం చేసుకునేందుకు సిద్ధమయ్యారట. రూ.17,720 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనుగోలు చేసేందుకు నిఖిల్ కామత్ నిర్ణయం తీసుకున్నారట.
మిగిలిన అన్ని కంపెనీలు 17, 600 కోట్లు మాత్రమే పెడతామని ముందుకు వచ్చాయట. కానీ నిఖిల్ కామత్ మాత్రం రూ. 17,720 కోట్లు ఇస్తానని ప్రకటన చేశారట. ఈ ధర డియాగో కంపెనీకి చాలా నచ్చినట్లు తెలుస్తోంది. డీల్ ఓకే అయితే మార్చి 2026 నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు నిఖిల్ కామత్ ఓనర్ అవుతాడు. అయితే రాయల్ ఛాలెంజెస్ బెంగళూరు జట్టును కొనుగోలు చేసిన తర్వాత పేరు మార్చేందుకు జీరోధా కంపెనీ నిర్ణయం తీసుకుందట. రాయల్ ఛాలెంజెస్ బెంగళూరు ( RCB ) పేరును కాస్త జీరోధా ఛాలెంజర్స్ బెంగళూరుగా ( ZCB) మార్చబోతున్నారట. దీంతో అభిమానులందరూ ఉలిక్కిపడుతున్నారు. జట్టు పేరులోనే బెంగళూరు తొలగిస్తే, ఆ జట్టుకు ఆదరణ తగ్గుతుందని కూడా చర్చ జరుగుతోంది.
ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కంటే ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bengaluru) జట్టును అమ్మేసేందుకు డియాగో కంపెనీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ ( Virat Kohli RCB ) కూడా అభిమానులకు షాక్ ఇవ్వనున్నాడట. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విక్రయించబడుతున్న నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాడట. ఈ ఒక్క సీజన్ ఆడేసి రిటైర్మెంట్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడట విరాట్ కోహ్లీ.