E-Paper
Advertisement

Study Rains:- వర్షం గురించి కనిపెట్టడానికి మల్టీ టాస్కింగ్ టెక్నాలజీ..

Study Rains:- వర్షం గురించి కనిపెట్టడానికి మల్టీ టాస్కింగ్ టెక్నాలజీ..
Advertisement

Study Rains:- మామూలుగా శాస్త్రవేత్తలు ఒకే సమయంలో ఒకే పరిశోధనపై పూర్తిగా శ్రద్ధ పెడితే.. దాని రిజల్డ్ తొందరగా వచ్చే అవకాశం ఉందని భావిస్తారు. అలా కాకుండా ఒకే సమయంలో రెండు పరిశోధనలపై కూడా శ్రద్ధ పెట్టవచ్చని మరికొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టోక్యో శాస్త్రవేత్తల అభిప్రాయం కూడా ఇదే. ఒకేసారి రెండు టాస్క్‌లలో పాల్గొనడం వల్ల దాని ఔట్‌కమ్ మెరుగ్గా ఉంటుందని వారు చెప్తున్నారు. వారి తరువాత పరిశోధనకు ఇదే స్ట్రాటజీని ఉపయోగించనున్నారు.

వాతావరణ మార్పుల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఎండ, వర్షం వంటి వాటిపై క్షుణ్ణంగా పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యం వర్షం అనేది ప్రపంచవ్యాప్తంగా ఏఏ ప్రాంతాల్లో పడుతుంది, ఎంత మోతాదులో పడుతుంది అనే విషయాలు స్టడీ చేయడం వల్ల వాతావరణంలో వచ్చే మార్పులతో పాటు నీటి కొరత గురించి కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. లియో శాటిలైట్స్ ద్వారా ఈ సమాచారాన్ని తెలుసుకోవడం సులభం అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

Advertisement

ఇప్పటివరకు వర్షం అనేది ఏఏ ప్రాంతాల్లో పడుతుంది, ఎంత మోతాదులో పడుతుంది అనే విషయాలను విడివిడిగా స్టడీ చేసేవారు. కానీ ఇప్పుడు వీటి గురించి కలిపి స్టడీ చేయడం ద్వారా రిజల్ట్స్ మరింత మెరుగ్గా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ మల్టీ టాస్క్ పద్ధతి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. అయితే ఈ మల్టీ టాస్కింగ్ కోసం టాస్క్ అనేది రెండు స్టేజీలుగా విభజిస్తారు. ముందుగా ఒక నెట్‌వర్క్ ద్వారా ఒక ప్రాంతంలో వర్షం పడుతుందా లేదా అన్న విషయాన్ని తెలుసుకుంటారు. ఆ తర్వాత ఎంత మోతాదులో వర్షం పడుతుంది అనేదాన్ని గమనిస్తారు. నెంబర్ల రూపంలో ఒక నెట్‌వర్క్.. వర్షపాతాన్ని నమోదు చేస్తుంది.

క్లాసిఫికేషన్, రిగ్రెషన్.. అనే పేర్లతో ఈ మల్టీ టాస్కింగ్‌కు సంబంధించిన టాస్క్‌లు విభజించబడతాయి. ప్రస్తుతం వర్షాల గురించి స్టడీ చేయడానికి మాత్రమే ఈ మల్టీ టాస్కింగ్ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. త్వరలో మరెన్నో విషయాలలో పరిశోధనలు చేపట్టడానికి ఈ పద్ధతిని ఉపయోగించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. క్లౌడ్ మైక్రోఫిజిక్స్‌ను స్టడీ చేయడానికి ఈ మల్టీ టాస్కింగ్ పద్ధతి ఉపయోగపడుతుందని, త్వరలోనే ఆ కోణంలో కూడా పరిశోధణలు ప్రారంభం కానున్నాయని అన్నారు.

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×