Big Stories

ChatGPT:- లా ప్రొఫెసర్‌పై చాట్ జీపీటీ తప్పుడు ఆరోపణలు..

ChatGPT:- ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించడానికి కేవలం ప్రైవేట్ రంగ సంస్థలు మాత్రమే కాదు.. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. కానీ ఆ రంగాలలో ఏఐ సామర్థ్యాన్ని వినియోగించుకోవడం కంటే ముందు వాటికి కొన్ని పరీక్షలు పెడుతున్నారు నిపుణులు. తాజాగా అలాంటి ఒక పరీక్షలో ఓపెన్ ఏఐకు చెందిన చాట్ జీపీటీ ఘోరంగా విఫలం అయ్యింది. ఒక లా ప్రొఫెసర్‌పై తప్పుడు ఆరోపణలు చేసింది.

- Advertisement -

తాజాగా అమెరికాలో ఒక రీసెర్చ్ స్టడీ కోసం నిపుణులు చాట్ జీపీటీ సాయాన్ని తీసుకున్నారు. ఇందులో చాట్ జీపీటీ ఒక పేరున్న లా ప్రొఫెసర్‌.. తన విద్యార్థులను లైంగికంగా వేధించాడంటూ తప్పుడు ఆరోపణలు చేసింది. బాగా చదువుకొని, లీగల్ రంగంలో పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నవారు ఇదివరకు ఎవరినైనా లైంగికంగా వేధించారా అన్న టాపిక్‌పై చాట్ జీపీటీ రీసెర్చ్ స్టడీ చేస్తోంది. ఆ లిస్ట్‌లో తన పేరు ఉండడం చూసి జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో పనిచేసే జోనాథన్ టర్లీ ఆశ్చర్యానికి గురయ్యాడు.

- Advertisement -

‘నా విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నానని చాట్ జీపీటీ నాపై తప్పుడు ఆరోపణలు చేస్తోంది’ అని టర్లీ ట్విటర్ ద్వారా బయటపెట్టాడు. ఈ విషయం తన స్నేహితుడు చెప్పేవరకు తనకు తెలియదని అన్నారు. 2018లో అలాస్కాకు ట్రిప్‌కు వెళ్లిన సమయంలో లా స్టూడెంట్స్‌ను వేధించానని చాట్ జీపీటీ తప్పుగా ప్రచారం చేస్తుందని తెలిపారు. అయితే తను తన విద్యార్థులతో ఎప్పుడూ అలాస్కా వెళ్లలేదని వెల్లడించారు. తనపై ఎప్పుడూ ఎవరూ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయలేదన్నారు.

కేవలం చాట్ జీపీటీ మాత్రమే తన పేరును లైంగిక వేధింపుల నిందితుల లిస్ట్‌లో చేర్చలేదని, ఇదంతా ఒక తప్పుడు పోస్ట్ వల్ల జరిగిందని టర్లీ తెలిపారు. చాట్ జీపీటీ ఒక వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇప్పటికే ఆస్ట్రేలియాకు చెందిన బ్రయన్ హుడ్ అనే మేయర్ కూడా తన గురించి చాట్ జీపీటీ తప్పుడు సమాచారం అందిస్తుందని, మైక్రోసాఫ్ట్‌పై కేసు వేస్తానని హెచ్చరించారు. ఒక బ్యాంకు స్కామ్‌లో బ్రయన్ నిందితుడని చాట్ జీపీటీ ప్రచారం చేయడమే దీనికి కారణం. ఇలాంటివి జరగడం చాలా బాధాకరం అని టర్లీ వాపోయారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News