New Google TVs with Gemini AI: టెగ్ దిగ్గజం గూగుల్ గురించి ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో ఏ సమాచారం కావాలన్నా.. సింఫుల్ గా గూగుల్ ను అడగేస్తున్నారు. అటు స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలను కూడా ఎప్పటికప్పుడు సరికొత్తగా అందుబాటులోకి తీసుకొస్తున్నది గూగుల్. ఇప్పటి పలు గూగుల్ స్మార్ట్ టీవీలు మార్కెట్ లోకి రాగా, త్వరలో మరో అదరిపోయే స్మార్ట్ టీవీ వినియోగదారుల ముందుకు రాబోతోంది. ఇప్పటి వరకు రిమోట్ తో టీవీలను ఆపరేట్ చేయగా, ఇకపై రిమోట్ అవసరం లేకుండా నోటి మాటలతో అపరేట్ చేసే స్మార్ట్ టీవీని అందుబాటులోకి తీసుకురాబోతున్నది.
జెమిని ఎరాలోకి గూగుల్ టీవీ ఎంట్రీ
వాయిస్ కమాండ్ తో ఆపేట్ అయ్యే స్మార్ట్ టీవీ ఈ ఏడాది చివరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. వాయిస్ తో ఆపరేట్ అయ్యేందుకు కొత్త హార్డ్ వేర్ ను ఈ స్మార్ట్ టీవీల్లో ఇంటిగ్రేట్ చేయనున్నట్లు గూగుల్ వెల్లడించింది. ఇవి జెమిని పవర్డ్ వాయిస్ ఎక్స్ పీరియెన్స్ తో అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది.
గూగుల్ టీవీలో సరికొత్త హార్డ్ వేర్ ఫీచర్లు
ఇప్పటికే అందుబాటులో ఉన్న గూగుల్ టీవీ రిమోట్లలో ఇన్ బిల్ట్ మైక్రో ఫోన్ ఫీచర్ ఉంది. దీని సాయంతో గూగుల్ అసిస్టెంట్ తో మాట్లాడవచ్చు. అయితే, మీ చేతిలో రిమోట్ కచ్చితంగా ఉండాలి. కానీ, ఇకపై రాబోయే గూగుల్ టీవీల్లో ఆ సమస్య ఉండదు. వాటిలో నేరుగా ఇన్ బిల్ట్ మైక్రోఫోన్లు ఉంటాయి. ఈ ఫార్ ఫీల్డ్ మైక్రో ఫోన్లు దూరం నుంచి ఆడియోను క్చాప్చర్ చేస్తాయి. రిమోట్ ను పట్టుకోకుండానే టీవీ వాయిస్ అసిస్టెంట్ తో మాట్లాడేందుకు అనుమతిస్తుంది. ఇందుకోసం రానున్న గూగుల్ టీవీల్లో ప్రాక్సిమెటీ సెన్సార్ అనే హార్డ్ వేర్ ను ఉపయోగించనున్నారు.
జెమిని వాయిస్ అసిస్టెంట్ తో పని చేయనున్న గూగుల్ టీవీ
గూగుల్ టీవీలో జెమిని వాయిస్ అసిస్టెంట్ ను ఉపయోగించనున్నట్లు గూగుల్ వెల్లడించింది. దీని ద్వారా ఈజీగా వాయిస్ కమాండ్స్ తో టీవీని ఆపరేట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ కొత్త ఫీచర్ల కోసం లాంచ్ పార్టనర్లుగా Hisense, TCL ఉన్నట్లు Google తెలిపింది. ఈ ఏడాది చివరలోగా జెమిని అసిస్టెంట్ ఆపరేటెడ్ స్మార్ట్ టీవీలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
రీసెంట్ గా జెమినీ 2.0 వెర్షన్ ను విడుదల చేసిన గూగుల్
టెక్ దిగ్గజం గూగుల్ గత డిసెంబర్ లో తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ జెమినీ సెకెండ్ జెనరేషన్ అయిన జెమినీ 2.0ను లాంచ్ చేసింది. ఇది టెక్నాలజీలో సరికొత్త కొత్త ఏజెంట్ యుగమని సీఈఓ సుందర్ పిచాయ్ అభిప్రాయపడ్డారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పోటీదారులకు దీటుగా జెమిని 2.0ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గూగుల్ నెక్ట్స్ జెనరేషన్ స్మార్ట్ టీవీలో జెమిని 2.0 వెర్షన్ ను వినియోగించనున్నట్లు తెలుస్తున్నది.
Read Also: కొత్త ఫోన్లు కొనుగోలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ చేసే తప్పులు ఇవే, మీరు మాత్రం అలా చేయొద్దు!