BigTV English

Smartphone Buying Guide: కొత్త ఫోన్లు కొనుగోలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ చేసే తప్పులు ఇవే, మీరు మాత్రం అలా చేయొద్దు!

Smartphone Buying Guide: కొత్త ఫోన్లు కొనుగోలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ చేసే తప్పులు ఇవే, మీరు మాత్రం అలా చేయొద్దు!

New Smartphone Buying: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. మార్కెట్లోకి ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే, స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు చేసే కామన్ పొరపాట్లు ఏంటి? ఎలాంటి మెరుగులు చూసి మోసపోతున్నారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం..


⦿ఎక్కువ మెగాపిక్సెల్ అని మోసపోకండి  

ఈ రోజుల్లో చాలా మంది మంచి కెమెరా క్వాలిటీ ఉందా? లేదా? అనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. 108 మెగాఫిక్సెల్.. 200 మెగాఫిక్సెల్ ఉందంటూ కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఎక్కువ మెగా పిక్సెల్ వల్ల మంచి ఫోటోలు వస్తాయనేది నిజం కాదు. ఎక్కువ మెగాపిక్సెల్‌ అనేది ఫోటోలో మరిన్ని వివరాలను క్యాప్చర్ చేస్తుందని అర్థం. ఫోటో క్వాలిటీ అనేది ఎక్కువ లైట్ మీద ఆధారపడి ఉంటుంది. లెన్స్‌ లోని మెగాపిక్సెల్స్ మీద ఆధారపడి ఉండదు. ఇకపై మీరు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే టైమ్ లో మెగా పిక్సెల్స్ కు బదులుగా ఎపర్చరు సామర్ధ్యాన్ని బట్టి కొనుగోలు చేయండి.


⦿వ్యాపర్ కూలింగ్ ఛాంబర్

ఈ రోజుల్లో చాలా మంది స్మార్ట్ ఫోన్ ను ఎంతసేపు వాడినా హ్యాంగ్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో  పెద్ద వ్యాపర్ కూలింగ్ ఛాంబర్ ఉందా? లేదా? అని చూస్తున్నారు. కానీ, వ్యాపర్ కూలింగ్ ఛాంబర్ మాత్రమే స్మార్ట్ ఫోన్ పనితీరుకు గీటురాయి కాదు.  స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే సమయంలో వ్యాపర్ కూలింగ్ ఛాంబర్ తో పాటు ఇతర అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి.

⦿ఎక్కువ బ్రైట్ నెస్

సెల్ ఫోన్ తయారీ కంపెనీలు తరచుగా చెప్పేమాట పీక్ బ్రైట్ నెస్. దీని ద్వారా ఫోన్ కు సంబంధించిన పనితీరు గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే, పీక్ బ్రైట్ నెస్ పేరు చెప్పి కొన్ని కంపెనీలు వినియోగదారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో చాలా ఫ్లాగ్‌ షిప్ ఫోన్లు 1500 నిట్స్ పీక్ బ్రైట్‌ నెస్ అందిస్తున్నాయి. ప్యానెల్ విండోలో 1 శాతం పిక్సెల్స్ లైటింగ్ తో ఈ బ్రైట్ నెస్ వస్తుంది. ఎక్కువ బ్రైట్ నెస్ ను చూసి ఫోన్ కొనుగోలు చేయకూడదు.

⦿రే ట్రేసింగ్

రీసెంట్ గా క్వాల్కమ్ స్మార్ట్‌ ఫోన్లలో హార్డ్‌ వేర్ స్థాయి రే ట్రేసింగ్‌ కు సపోర్టు చేసే తొలి చిప్‌ సెట్‌ ను ప్రారంభించింది. ఇవి వీడియో గేమ్‌ల కోసం లేటెస్ట్ లైట్ హ్యాండ్లింగ్ టెక్నాలజీకి సపోర్టు చేసే పవర్ ఫుల్ SoCలను కలిగి ఉన్నాయి. ఈ టెక్నాలజీ ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలోగ్రాఫికల్ ఎఫెక్ట్‌ కు దారి తీస్తుందని గుర్తించాలి.

⦿కర్వ్ డ్ డిస్ ప్లే

స్మార్ట్ ఫోన్ లో చాలా వివాదాస్పదమైన అంశం కర్వ్ డ్ డిస్ ప్లే. నిజానికి ఈ డిస్ ప్లే అనేది చూడ్డానికి మెరుగ్గా కనిపించడంతో పాటు ఫోన్ మంచి విలువను జోడిస్తుంది. అయితే, ఈ డిస్ ప్లే అనేది ఉపయోగించడం, పట్టుకోవడం కాస్త కష్టంగా అనిపిస్తుంది. అంతేకాదు, చేతిలో నుంచి ఈజీగా జారిపోయే అవకాశం ఉంటుంది. ఇక ఈ డిస్ ప్లే ఉన్న స్మార్ట్ ఫోన్లు గేమింగ్ కు అస్సలు అనుకూలంగా ఉండవు.

⦿చిప్ సెట్, కోర్  

చాలా మంది ఎక్కువ కోర్ సీపీయూ ఫోన్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతారు. ఎక్కువ కోర్స్ అనేది వేగవంతమైన ప్రాసెసర్ అని భావించకూడదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని కోర్లను సమర్థవంతంగా ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ సామర్థ్యం ముఖ్యం. ఏడు ఎఫిషియెన్సీ కోర్లతో కూడిన చిప్‌సెట్ కాకుండా.. రెండు పెర్ఫార్మెన్స్ కోర్లు, ఆరు ఎఫిషియెన్సీ కోర్లతో కూడిన చిప్‌ సెట్‌ ఉన్న స్మార్ట్ ఫోన్ ను కొనడం మంచిది.

Read Also: 2025లో యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చెయ్యాలనుకుంటున్నారా? ఇలా చేస్తేనే మీరు సక్సెస్!

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×