Triptii Dimri : ‘యానిమల్’ సినిమా తర్వాత బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ (Triptii Dimri) క్రేజ్ అమాంతం పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఆమె ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకొని మేకర్స్ అద్భుతమైన సినిమాలో అవకాశాలు ఇస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మోస్ట్ అవైటింగ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఆషికి 3’ (Aashiqui 3) మూవీలో త్రిప్తి దిమ్రీని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ బ్యూటీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో సినిమా ఆగిపోయినట్టుగా తెలుస్తోంది.
‘ఆషీకీ’ మూవీ ఎవర్ గ్రీన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. 1990లో ‘ఆషికి’ మూవీ రిలీజ్ కాగా, అందులో హీరో హీరోయిన్లుగా నటించిన రాహుల్ రాయ్, అను అగర్వాల్ ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు. T-సిరీస్ – విశేష్ ఫిల్మ్స్ బ్యానర్లపై దానికి సీక్వెల్ గా ‘ఆషికి 2’ వచ్చింది. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ లీడ్ రోల్స్ చేశారు. ఈ మూవీ 2013లో రిలీజై, సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో మూడవ భాగానికి శ్రీకారం చుట్టారు. అందులో త్రిప్తి (Triptii Dimri) – కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan)ను హీరో హీరోయిన్లుగా అనుకున్నారు. అయితే ఈ మూవీని ఏ ముహూర్తాన అనుకున్నారో గానీ వరుసగా అడ్డంకులు ఎదురవుతున్నాయి.
అనురాగ్ బసు దర్శకత్వంలో ‘ఆషికి 3’ పట్టాలు ఎక్కాల్సి ఉంది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టును ఎవరు నిర్మించాలి అనే విషయంలో వివాదం మొదలైంది. T-సిరీస్ – విశేష్ ఫిల్మ్స్ ఇద్దరూ ఓ మాట మీదకు రాకపోవడంతో… T-సిరీస్ సింగిల్ గా ఈ మూవీని నిర్మించాలని డిసైడ్ అయ్యింది. పైగా ఈ మూవీని ‘ఆషికి’ ఫ్రాంచైజీ నుంచి తీసేశారు కూడా. అయితే సినిమాకు “తు హీ ఆషికీ” లేదా “తు హీ ఆషికీ హై” అనే టైటిల్స్ అనుకున్నారు. ఇక్కడ కూడా సినిమాకు ఎదురు దెబ్బ తప్పలేదు. ‘ఆషికీ’ అనే టైటిల్ తో 1990 నుంచి ఇప్పటిదాకా వచ్చిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి, ఆ టైటిల్ ను / లేదా ఆషికీ అనే పదం ఉన్న టైటిల్ ను మేము తప్ప ఇంకెవ్వరూ వాడుకోవడానికి వీల్లేదు అంటూ విశేష్ ఫిల్మ్స్ నిర్మాతలు కోర్టుకు ఎక్కారు.
ఈ వివాదం ఇలా నడుస్తున్న తరుణంలోనే హీరోయిన్ కూడా హ్యాండ్ ఇచ్చింది. సినిమా లేట్ అయ్యే అవకాశాలు ఉండడంతో త్రిప్తి (Triptii Dimri) ఈ ప్రాజెక్ట్ కు గుడ్ బై చెప్పేసిందట. దీంతో ఈ సినిమా ఆగిపోయిందని తెలుస్తోంది. ప్రస్తుతం మేకర్స్ ఈ మూవీ కోసం కొత్త హీరోయిన్ వేటలో పడ్డారట. అయితే ఈ విషయంపై ఇంకా చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఈ సీక్వెల్ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న త్రిప్తి అభిమానులకు ఇది బాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. కాగా ప్రస్తుతం త్రిప్తి ఖాతాలో ‘అర్జున్ ఉస్తారా’ అనే ప్రాజెక్టు ఉంది. ఈ సినిమాలో షాహిద్ కపూర్ తో కలిసి ఆమె రొమాన్స్ చేయబోతోంది.