October 2024 Best Smart Phones : అక్టోబర్ లో స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఫాస్టెస్ట్ ప్రాసెసర్, బెస్ట్ కెమెరా సిస్టమ్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ క్వాలిటీతో టాప్ బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్స్ కొనాలనుకుంటే మరి ఓ లుక్కేయాల్సిందే.
టాప్ నోచ్ ఫీచర్స్ తో హై ఎండ్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీ కోసమే అక్టోబర్ నెలలో అదిరిపోయే ఫీచర్స్ తో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ రాబోతున్నాయి. సెప్టెంబర్ టాప్ అవైటింగ్ స్మార్ట్ ఫోన్స్… iPhone 16, Galaxy S24 FE విడుదలై యూజర్స్ ను ఆకట్టుకున్నాయి. ఇక ఈ నెలలో Vivo X200 Series, Xiaomi 15, Lava, OnePlus, iQOO నుంచి బెస్ట్ మెుబైల్స్ రానున్నాయి. అందుబాటు ధరల్లోనే ఈ గ్యాడ్జెట్స్ యూజర్స్ ను ఆకట్టుకునే డిజైన్స్ లో మార్కెట్లోకి విడుదలకానున్నాయి.
Lava Agni 3 5G
రూ. 30,000 కంటే తక్కువకే బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి ఈ ఫోన్ బెస్ట్ ఆఫ్షన్. భారతీయ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ లావా.. అగ్ని 3 5G మెుబైల్ను అక్టోబర్ 4న మార్కెట్ లోకి రిలీజ్ చేయనుంది. 6.78 అంగుళాల FULL HD+ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, మీడియో టెక్ డైమెన్సీటీ 7300 ప్రాసెసర్, 8GB RAM, 256GB స్టోరీజీతో ఈ స్మార్ట్ ఫోన్ రానుంది. 5,000mAh బ్యాటరీతో 6W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
Xiaomi Mix Flip 5G
షియోమా మిక్స్ ఫ్లిప్ 5G.. షియోమీ నుంచి వచ్చిన మొదటి క్లామ్‌షెల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఇదే. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా దీనిని లాంఛ్ చేసిన షియోమీ కంపెనీ అక్టోబర్‌లో భారతీయ మార్కెట్లోకి తీసుకురానుంది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్ సెట్, 3,500mm వేపర్ ఛాంబర్, 16GB LPDDR5x RAM, 512GB UFS 4.0 స్టోరేజ్‌తో ఈ ఫోన్ రాబోతుంది. AI ఫీచర్స్ తో Android 14 HyperOSను సపోర్ట్ చేస్తుంది. 4,780 mAh బ్యాటరీతో 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. 50 MP బ్యాక్ కెమెరా, 32 MP సెల్ఫీ కెమెరాతో బ్లాక్, పర్పుల్ షేడ్స్‌లో అందుబాటులోకి రానుంది.
Tecno Phantom V Flip 2 5G, Phantom V Fold 2 5G
రూ. 60,000లోపే బెస్ట్ స్మార్ట్ ఫోన్ కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్. దీని ధర రూ. 55,000 నుంచి రూ.60,000లో ఉండనుంది. ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే.. Tecno Phantom V ఫ్లిప్ 5Gలో ఉన్నట్లే 8GB RAM+256GB స్టోరేజ్ తో రానున్నట్లు తెలుస్తుంది. ఇక 6.9 అంగుళాల AMOLED ప్రైమరీ డిస్‌ప్లే, 1.32 అంగుళాల కవర్ డిస్‌ప్లే, ఆక్టా కోర్ MediaTek డైమెన్సిటీ 8,020 చిప్‌సెట్ తో రానుంది. ఆండ్రాయిడ్ 14 OSను సపోర్ట్ చేయనుంది.
ALSO READ : గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త టైమ్ ట్రావెల్ ఫీచర్ – ఇకపై గతంలోకి వెళ్లొచ్చు!
Infinix Zero Flip 5G
రూ.50,000లో స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆఫ్షన్. దీని ధర రూ. 50,127. ఫీచర్స్ విషయానికి వస్తే.. 8020 మీడియా టెక్ డైమెన్సిటీ, 120Hz డిస్‌ప్లే, 512GBతో అక్టోబర్లో భారతీయ మార్కెట్లోకి రానుంది. 6.9-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 3.4 అంగుళాల AMOLED కవర్ స్క్రీన్‌తో రాబోతుంది. 50MP మెయిన్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా రానుంది. 4,720mAh బ్యాటరీతో 70W ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. 7.64mm మందంతో కేవలం 195 గ్రాముల బరువుతో స్టైలిష్ లుక్ తో రాబోతుంది.
Vivo X200 Series
Vivo X200 సిరీస్ అక్టోబర్ 14న చైనాలో విడుదల చేయనున్నట్లు ప్రకటించగా.. ప్రపంచవ్యాప్తంగా అదే రోజు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ సిరీస్లో Vivo X200, X200 Pro, Vivo X200 Mini ఉన్నాయి. Vivo X100తో పోలిస్తే పలు అప్డేట్స్ తీసుకొస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. Vivo X200 ఫ్లాట్ ఎడ్జ్ కెమెరాతో రెండు ప్రైమరీ కలర్స్ లో అందుబాటులోకి రానుంది. 6.3 అంగుళాల డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేటుతో రానుంది.