Plants: సాధారణంగా కుటుంబం అంటేనే.. సంతోషకరమైన వాతావరణం. అలాంటి ఫ్యామిలీలో మరింత ప్రశాంతతను నింపడానికి చాలామంది పాజిటివిటీని కలిగించే మొక్కలను పెంచుకుంటుంటారు. ఆ మొక్కలు పచ్చటి వాతావరణంతో పాటు నాణ్యమైన గాలిని కూడా అందిస్తుంటాయి. అంతేకాదు.. ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుకోవడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యమూ మెరుగ్గా ఉంటుంది. కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆర్థికంగానూ అదృష్టం వరిస్తుందని వాస్తునిపుణులు చెబుతుంటారు. అయితే, కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకుంటే.. లాభం కంటే నష్టమే ఎక్కువట. మరి ఆ మొక్కలేవో ఇప్పుడు తెలుసుకుందామా..
ఆకారంలో, అందంలో చాలా ముద్దుగా ఉండే బొన్సాయ్ మొక్కను ఇంట్లో పెంచుకోకూడదట. ఇది చూడటానికి కుంగిపోయినట్లుగా ఉంటుంది. అలాగే చాలా నెమ్మదిగా పెరుగుతుంది. కాబట్టి దీన్ని ఉంచుకోవడం వల్ల ఇంట్లో వ్యక్తుల కెరీర్ కూడా కుంగిపోయినట్లుగా ఉంటుందని, పురోగతి నెమ్మదిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇంటి ఆవరణలో పెంచుకునే పత్తి మొక్కలు, మొగ్గలు చాలా ప్రమాదకరమైనవి. వీటిని కోసేటప్పుడు కోతలు, గాట్లను కలిగిస్తాయి. పెద్ద పరిమాణం కారణంగా వీటిని ఇంట్లో పెంచుకుంటే శక్తి ప్రవాహానికి అంతరాయం కలుగుతుందని, ఇంట్లో అయోమయ వాతావరణం ఏర్పడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ప్రశాంతమైన ఇంట్లో కాక్టస్ మొక్క ప్రతికూల శక్తిని విడుదల చేస్తుందట. అలాగే ఇంట్లోని సానుకూల ప్రవాహానికి అడ్డంకులు సృష్టిస్తుంది. అదనంగా సామర్థ్యానికి భంగం కలిగిస్తుంది. అందుకే చూడటానికి ఈ మొక్క ఎంతో అందంగా ఉన్నప్పటికి ఇంట్లో కాక్టస్ మొక్కను పెంచుకోవద్దంటారు వాస్తు నిపుణులు.
ఇక చింతచెట్టు కూడా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తుందని వాస్తుశాస్త్ర నిపుణులు నమ్ముతారు. ఈ చెట్టు పెద్ద పరిమాణం శక్తి ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుందట. అలాగే చింతపండులోని పుల్లటి స్వభావం ఇంట్లోని వ్యక్తుల మధ్య సంబంధాలను పాడు చేస్తుందట.
ఒత్తిడికి గురైనప్పుడు వీపింగ్ ఫిగ్ మొక్క తన ఆకులను వదిలేస్తుంది. అస్థిరత, అనూహ్యతను వీపింగ్ ఫిగ్ మొక్క ప్రోత్సహిస్తుందని చెబుతుంటారు. వాస్తు ప్రకారంగా ప్రతికూల శక్తిని ఆకర్షించే సామర్థ్యం కలిగి ఉంటుంది అందుకే దీన్ని ఇంట్లో అస్సలు పెంచుకోకూడదని వాస్తు నిపుణలు సూచిస్తున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంగ్లీష్ ఐవీ మొక్క దాని చొరబాటు కారణంగా ఇంట్లో పెంచుకునేందుకు సరైనది కాదట. ఇది అన్ని చోట్ల వ్యాపించడం, నేలమీద పడిపోయి ఉంటుంది. అలాగే శక్తిని స్తబ్దంగా ఉంచుతుంది కాబట్టి.. ఈ మొక్కను అస్సలు పెంచొద్దని సూచిస్తున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు.