Samsung Wallet App Digital Key| కొరియా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్, భారత కార్ల తయారీ కంపెనీ మహీంద్రా,, ఈ రెండు కలిసి ఒక అద్భుతమైన కొత్త ఆవిష్కరణను తీసుకొచ్చాయి. కారు స్టార్ట్, లాక్, అన్ లాక్ చేయడానికి ఇకపై కీ (తాళం చెవి) అవసరం లేదు. శాంసంగ్ ఫోన్ తోనే కారు స్టార్ట్ అయిపోతుంది. భారతీయ కస్టమర్ల కోసమే ఈ డిజిటల్ కారు కీ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు.
ఈ డిజిటల్ కారు కీ ప్రస్తుతానికి మహీంద్రా ఎలక్ట్రిక్ SUV మోడల్స్ కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే ఇకపై ఒక రియల్ కీ అవసరం లేకుండా మీ ఫోన్‌నే కారు కీగా ఉపయోగించవచ్చు. ఈ టెక్నాలజీ అందించిన మొదటి భారతీయ ఆటోమోటివ్ బ్రాండ్ మహీంద్రానే.
ఈ డిజిటల్ కీ గెలాక్సీ డివైస్ అంటే గెలాక్సీ ఫోన్ లేదా ట్యాబ్ ద్వారా పనిచేస్తుంది. అంటే గెలాక్సీ డివైస్ తో మీరు కారుని కంట్రోల్ చేయొచ్చు. అయితే దీని కోసం ఫోన్ లో శాంసంగ్ వాలెట్ యాప్ ఉండాలి. వాలెట్ యాప్ ద్వారా కారును లాక్ చేయడం, అన్‌లాక్ చేయడం లేదా ఇంజన్ స్టార్ట్ చేయడం చేయవచ్చు. ఈ డిజిటల్ కీ ఫీచర్ మహీంద్రా యొక్క XUV 9e, BE 6 మోడల్స్‌కు అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్.. డ్రైవర్లకు గొప్ప సౌలభ్యాన్ని అందిస్తుంది.
శాంసంగ్ వాలెట్ యాప్ ద్వారా డిజిటల్ కీని మల్టీ యూజర్లతో షేర్ చేయవచ్చు. మీరు ఇతరులకు మీ కారు డ్రైవ్ చేయడానికి యాక్సెస్ ఇవ్వవచ్చు. పైగా ఈ యాక్సెస్‌కు టైమ్ లిమిట్ కూడా సెట్ చేయవచ్చు, ఈ
వాలెట్ సర్వీస్‌తో స్నేహితులు, కుటుంబ సభ్యులకు మీ కారు ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది. ఈ డిజిటల్ కీ ఫీచర్ ప్రామాణిక భద్రతా చర్యలను ఉపయోగిస్తుంది. ఫింగర్‌ప్రింట్ లేదా పిన్ ఆధారిత బయోమెట్రిక్ గుర్తింపు ద్వారా మీ కారు సెక్యూర్‌గా ఉంటుంది.
ఒకవేళ మీ ఫోన్ పోగొట్టుకున్నట్లైతే మీరు డిజిటల్ కీని రిమోట్‌గా నిర్వహించవచ్చు. శాంసంగ్ ఫైండ్ సర్వీస్ ద్వారా పోయిన మీ ఫోన్ ని లాక్ చేయవచ్చు. అలాగే, NFC క్రెడెన్షియల్స్ లేదా డిజిటల్ కీ డేటాను రిమోట్‌గా తొలగించవచ్చు, ఇది మీ కారుకు అనధికార యాక్సెస్‌ను నిరోధిస్తుంది. ఈ ఫీచర్స్‌తో మీ కారు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండేలా చేస్తుంది.
ఈ రెండు ప్రముఖ కంపెనీల భాగస్వామ్యం ఆటోమోటివ్ పరిశ్రమలో ఒక ముఖ్యమైన మైలురాయి. వాహన యాక్సెస్‌తో స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీ సులభంగా అనుసంధానం చేయవచ్చునని ఈ భాగస్వామ్యం నిరూపించింది. ఈ పవర్‌ఫుల్ కొత్త ఫీచర్ యూజర్లకు అద్భుతమైన సౌలభ్యాన్ని, అడ్వాన్స్ సెక్యూరిటీ కంట్రోల్‌నిస్తుంది. ఈ ఫీచర్.. ఫిజికల్ కీలను మోసుకెళ్లే అవసరాన్ని తొలగిస్తుంది. భారతదేశంలో స్మార్ట్ వాహనాలు, కనెక్టివిటీ భవిష్యత్తును ఈ డిజిటల్ కీ ఫీచర్ సూచిస్తుంది.
Also Read: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లు.. వీటి ధర కోట్లలోనే