BigTV English

Nothing Phone 2 Big Offer: గోట్ సేల్ అదిరిపోయింది.. నథింగ్ ఫోన్‌పై ఏకంగా రూ.15000 డిస్కౌంట్..!

Nothing Phone 2 Big Offer: గోట్ సేల్ అదిరిపోయింది.. నథింగ్ ఫోన్‌పై ఏకంగా రూ.15000 డిస్కౌంట్..!

Nothing Phone 2 Big Offer: ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తమ వినియోగదారులకు తాజాగా అదిరిపోయే డీల్స్‌ను తీసుకొచ్చాయి. ఇందులో భాగంగానే ఫ్లిప్‌కార్ట్‌లో ‘గోట్ సేల్’ మొదలైంది. ఇది జూలై 20 నుంచి 25 వరకు ఉంటుంది. అలాగే అమెజాన్‌లో ‘ప్రైమ్ డే సేల్’ నిన్నటితో అంటే ఆదివారంతో ముగిసిపోయింది. ఇక ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ సేల్ మాత్రమే అందుబాటులో ఉంది. అందువల్ల అదిరిపోయే డిస్కౌంట్లతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నవారికి ఈ గోట్ సేల్ చాలా యూజ్ అవుతుంది.


ఎందుకంటే ఈ సేల్‌లో వివిధ రకాల బ్రాండ్‌ల కొత్త ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ డిస్కౌంట్లతో చాలా తక్కువ ధరకే ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సేల్‌లో OnePlus ప్యాడ్‌పై సూపర్ డూపర్ ఆఫర్ ఉంది. దీని 12 GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 27,499కి కొనుగోలు చేయవచ్చు.

ఇది కాకుండా ఈ సేల్ సమయంలో మరో గొప్ప డీల్ అందుబాటులో ఉంది. ఈ డీల్‌లో నథింగ్ ఫోన్ (2)పై ఊహించని డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. అందువల్ల మీరు నథింగ్ ఫోన్ (2)ని అత్యంత చౌక ధరలో కొనుగోలు చేయాలనుకుంటే.. Flipkart GOAT సేల్‌లో మంచి అవకాశం ఉంది. ఈ సేల్ ప్రకారం.. nothing phone 2.. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీతో కూడిన స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.49,999 అసలు ధరతో ఉంది.


Also Read: కేవలం రూ.20 వేలలోపే బెస్ట్ ఫీచర్ల స్మార్ట్‌ఫోన్స్.. మీకు నచ్చినవి.. మీరు మెచ్చినవి..!

అయితే ఇప్పుడు ఈ సేల్‌లో భాగంగా భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఏకంగా 40 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్‌తో నథింగ్ ఫోన్ 2 కేవలం రూ.29,999లకే లిస్ట్ అయింది. అంటే దాదాపు రూ.15000 తగ్గింపు లభించిందన్నమాట. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందొచ్చు. అందువల్ల మంచి డిస్కౌంట్‌ కోసం చూసే వారికి ఇది బెస్ట్ అని చెప్పొవచ్చు.

నథింగ్ ఫోన్ 2 ఫీచర్ల విషయానికొస్తే.. ఇది ఆండ్రాయిడ్ 13 అవుట్-ఆఫ్-ది-బాక్స్ ఆధారంగా నథింగ్ OS 2.0పై రన్ అవుతుంది. హ్యాండ్‌సెట్ 6.7-అంగుళాల పూర్తి-HD+ (1,080×2,412 పిక్సెల్‌లు) LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఇది Adreno 730 GPUతో Qualcomm 4nm స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 512GB వరకు స్టోరేజ్, 12GB వరకు RAMతో జత చేయబడింది. నథింగ్ ఫోన్ 2 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ సోనీ IMX890 ప్రైమరీ సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) ఉన్నాయి. ఫోన్ 45W PPS వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4,700mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది దుమ్ము, స్ప్లాష్ నుండి రక్షణ కోసం IP54 రేటింగ్‌ను పొందింది.

Related News

Smartphone Tips: మీ ఫోన్ హ్యాంగ్ అవుతుందా ? ఇలా చేస్తే.. ప్రాబ్లమ్ సాల్వ్

Prepaid Cards: ప్రీపెయిడ్ క్రెడిట్ కార్డు.. క్రెడిట్ స్కోర్ అవసరం లేకుండా సులభ లావాదేవీలు

Google App Changes: ఫోన్‌లో డయలర్‌ ఎందుకు మారింది? పాత పద్దతి కావాలంటే జస్ట్ ఇలా చేయండి

Pixel 10 vs Galaxy S25: రెండు టాప్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్ షిప్ ఫోన్ల మధ్య పోటీ.. విన్నర్ ఎవరంటే?

Realme 15 vs Redmi 15: ఏ 5G ఫోన్ కొనాలి?

Best Gaming Moblies: 2025లో బెస్ట్ గేమింగ్ మొబైల్స్.. రూ.65000 లోపు బడ్జెట్‌లో అదిరిపోయే ఫోన్లు

Big Stories

×