MLA Mallareddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి అంటే ఆ హవా వేరే లెవల్‌లో ఉంటది.. ఎక్కడకి వెళ్లినా ఆయన చురుకుదనంతో ఇట్టే నవ్వులు పూయిస్తాడు.. 24/7 ఆన్ ఫుల్ జోష్‌లో ఉంటారు. మల్లారెడ్డి తెర మీద కనిపించినా.. ఆయన నోరు విప్పి మాట్లాడిన ఎదురుగా ఉన్నవారు నవ్వక తప్పదు. కాలేజ్ ఫంక్షన్‌లో డ్యాన్స్‌లు ఇలా సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపిన మల్లారెడ్డి.. ఈ మధ్య కాలంలో పొలిటికిల్ సీన్‌లో పెద్దగా కనిపించడం లేదు. ఆయన అసెంబ్లీలో మాట్లాడిన ప్రసంగాలు అయితే యూట్యూబ్‌లో ఒక్కప్పుడు ట్రెండింగ్‌లో ఉండేవి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆయన గురించి తెలియని వారు ఉండరు. అంటే ఆయనకు ఎంత ఫాల్లోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో డీజే టిల్లు పాటకు స్టెప్పులేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి pic.twitter.com/Gf1nfULEQ6
— BIG TV Breaking News (@bigtvtelugu) October 16, 2025
ఈయనను కొందరు మాస్ మల్లన్నగా పిలుస్తారు. ఆయన పెద్ద సోషల్ మీడియా స్టార్. పబ్లిక్‌లో చిన్నా, పెద్దా తేడా లేకుండా ఆయనకు భలే క్రేజ్ ఉంది. హైదరాబాద్‌లో ఏ చిన్న పిల్లాడిని అడిగినా మల్లన్న గురించి చెబుతారు. మల్లారెడ్డి ఎక్కడికి వెళ్లినా ఆయనతో ఫోటోలు, సెల్ఫీలు దిగడానికి ఎగబడుతారు. ఓ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సైతం సోషల్ మీడియాలో మల్లన్నకు నాకంటే ఎక్కువ క్రేజ్ ఉందని చెప్పారు. అయితే తాజాగా ఆయన కాలేజీ ఈవెంట్ లో మరో కాలు కదిపారు. స్టూడెంట్స్ తో కలిసి ఆయన డీజీ టిల్లు సాంగ్ డ్యాన్స్ వేశారు. అయితే ఈ సారి ఆయన కోడలు కూడా డ్యాన్స్ వేస్తూ కనిపించింది.
ALSO READ: Afghan Pak Clash: పాకీ సైనికుడి ప్యాంటును వీధుల్లో ఊరేగించిన తాలిబన్లు, ఇదెక్కడి మాస్ రా!
మల్లారెడ్డి కొడలు డాక్టర్ ప్రీతిరెడ్డి కూడా మామకు తగ్గ కోడలు అని ప్రూఫ్ చేసుకున్నారు. మామకు ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించారు. ఆమె స్టూడెంట్స్ తో స్టేజీ పైన డ్యాన్స్ వేశారు. కాలేజ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో ఆమె కాలా చష్మా పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేశారు.. చాలా సులభంగా ఆకట్టుకునే పాటకు కాలు కదిపారు. ప్రస్తుతం వీరు వేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రీతిరెడ్డి మామ మల్లారెడ్డికి తగ్గ కోడలు అని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.