BigTV English

Bigg Boss 9 Day 39 Highlights: కంటెండర్ కోసం అడుక్కున్న రీతూ.. నువ్వు నాకోద్దు, ఆయెషా ఝలక్, పవన్ కి రీతూ హగ్

Bigg Boss 9 Day 39 Highlights: కంటెండర్ కోసం అడుక్కున్న రీతూ.. నువ్వు నాకోద్దు, ఆయెషా ఝలక్, పవన్ కి రీతూ హగ్
Advertisement

Bigg Boss 9 Day 39 Highlights: గొడవలు, లవ్ ట్రాక్స్, ఎమోషన్స్ నేటి ఏపిసోడ్ ఆసక్తిగా సాగింది. 39వ రోజు మాధురి అరుపులతో మొదలైంది. రాత్రి లైట్స్ ఆఫ్ అయ్యాక ఎవరూ మాట్లాడోద్దని, నా నిద్రకు డిస్ట్రబెన్స్ అవుతుందని ఆడర్ వేసింది. ఒకవేళ మాట్లాడుకుంటే గార్డెన్ ఎరియాకి వెళ్లి మాట్లాడుకోవాలని రూల్ పాస్ చేసింది. దీనిని రీతూ ఖండించింది. ఇది మీ ఒక్కరి హౌజ్ కాదని, అందరిది అంటూ మాధురి చురక వేసింది. కానీ, మాధురి మాత్రం తగ్గేదే లే అంటూ రీతూపై గట్టి గట్టిగా అరిచింది. ఆ తర్వాత టెనెంట్స్ కి బిగ్ బాస్ బ్రేక్ ఫాస్ట్ పంపాడు. రుచి రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ రావడం అంత ఆనందంలో మునిగిపోయారు.


ఏడ్చిన భరణి, దివ్య

బెడ్ రూంలో భరణి, దివ్యల మధ్య ఎమోషన్ డ్రామా నడించింది. ఇక హౌజంతా మాధురి తీరు గురించే మాట్లాడుకుంటున్నారు. ఓవైపు కళ్యాణ్, దివ్య ఆమె కుక్కింగ్ నుంచి మాట్లాడుకున్నారు. ఆవిడా రూల్స్ పెడ్తది కానీ, పాటించదు అంటూ సాయి, ఇమ్మాన్యుయేల్ మాధురి తీరు గురించి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత నువ్వు రీతూతో మాట్లాడటం నాకు నచ్చలేదు అని దివ్యతో అంటాడు భరణి. ఇమ్మ్యునిటీ టాస్క్ లో నడుముపోయేలా ఆడి దివ్య రీతూకి సపోర్టు చేసింది. కానీ, అంత కష్టపడ్డ దివ్యని రీతూ నామినేట్ చేసంది. అలాంటి ఆమె దివ్య క్లోజ్ ఉంటుందని అది తనకు నచ్చలేదు అంటాడు భరణి.

ఇలాంటివి ఉంటే చెప్పండి కానీ, మీలో మీలో పెట్టుకుంటే ఎలా అంటూ దివ్య కుళాయి విప్పింది. తాను కొంతమందితోనే ఉంటానని, అక్కడ అందరు కూర్చుని ఉన్నప్పుడు అందరిలాగే రీతూ కూడా ఉన్నానని, తనని ఇలా తప్పుగా అర్థం చేసుకున్నారంటూ దివ్య కన్నీరు పెట్టుకుంది. ఆమె ఏడుస్తుంటే భరణి కూడా ఏడ్చాడు.ఆఖరి దివ్య వెనక్కి తగ్గి భరణికి సారీ చెబుతూ కన్నీరు తూడ్చింది. ఆ తర్వాత రమ్య కోసం ఆమె అడిగిన రొయ్యల వేపుడు, బిర్యానీ పంపించాడు బిగ్ బాస్.
ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ టైం వచ్చేసింది. వైల్డ్ కార్డ్ ద్వారా ఫైర్ స్ట్రోమ్స్ ని నేరుగా కంటెండర్స్ గా ఎంపిక చేశాడు బిగ్ బాస్.


రీతూకి ఆయెషా షాక్

అయితే ఈ గేమ్ లో వారితో కలిసి పోరాడేందుకు టెనెంట్స్ నుంచి ఎవరు ఉండాలనేది ఫైర్ స్ట్రోమ్స్ చేతిలోనే పెట్టాడు. అంత చర్చించుకుని తనూజ, సుమన్ శెట్టి, దివ్య, భరణి, సంజనని ఎంపిక చేసుకున్నారు. కంటెండర్ పవర్ ఉండటం వల్ల నిఖిల్ ఇందులో పాల్గొనలేదు. దీంతో ఐదుగురు ఫైర్ స్ట్రోమ్స్ ఒక్కొక్కరు ఒక్కో హౌజ్ మేట్స్ నుంచి ఐదుగురు సెలక్ట్ చేశారు. ఫైర్ స్ట్రొమ్స్ ఒక టీం, పాత హౌజ్ మేట్స్ ఒక టీంగా ఏర్పడి కంటెండర్ టాస్క్ తొలి లెవల్ ఆడారు. అయితే కంటెండర్స్ జాబితాలో తను లేకపోవడంతో ఆయెషా దగ్గరి వెళ్లి నన్ను తీసుకోమని రీక్వెస్ట్ చేసుకుంది రీతూ. కానీ, ఆయెషా నువ్వు అన్ని ఫౌల్ గేమ్స్ ఆడతావు, ఆటలో అరోగెన్సీ చూపిస్తావు.. అది నా వల్ల కాదు.. నీన్ను నేను భరించలేను నువ్వు నాకు వద్దు అంటూ ఆయెషా రీతూ మొఖం కొట్టినట్టు చెప్పేసింది.

డిమోన్ రీతూ హగ్

కెప్టెన్సీ కంటెండర్ కోసం పెట్టిన ఫస్ట్ లెవల్ లో బాల్ గోల్ వేసే ఆటలో నాలుగు రౌండ్ లోనూ ఫైర్ స్ట్రోమ్స్ గెలిచి భరణి, దివ్య, తనూజ, సంజను కంటెండర్ నుంచి తొలగించారు. ఆ తర్వాత రమ్య, డిమోన్ పక్కకు వెళ్లి గుసగుసలాడుకున్నారు. వారిద్దరు మాట్లాడుకోవడం చూసి ఏంటి ట్రాక్స్ తప్పుతున్నాయి. ఇంట్రెస్టా అంటూ రమ్యను ఆటపట్టించింది. మాధురి. ఇక హౌజ్ లో నీకు ఎవరంటే ఇష్టమని అడగ్గా.. ఇంకేవరు అమాయకంగా కనిపించే డిమోన్ అంటేనే ఇష్టం మనసులో మాట బయటపెట్టింది పిక్కిల్స్ పాప. బాత్ రూం ఏరియా దగ్గర.. రీతూ, పవన్ ని హగ్ చేసుకుంది. ఏంటీ మాధురి వచ్చి ఈ వారంతో రీతూతో మాట్లాడకుంటే నిన్ను సేవ్ చేస్తా అన్నదా అని అడిగితే.. అవును చెప్పింది. కానీ, నాకు వద్దు అని చెప్పాను అనడంతో మురిసిపోతూ పరుగెత్తుకువెళ్లి డిమోన్ కి హగ్ ఇచ్చింది రీతూ.

Related News

Bigg Boss 9: డిమోన్ అంటే ఇష్టం.. ఒపెన్ అయిన రమ్య, మాధురి ఫుల్ సపోర్టు.. ఎక్కడో సుడుంది పవన్..

Anchor Lasya: యాంకర్‌ లాస్య కొత్తింటి గృహప్రవేశం.. ఇల్లు చూసి కుళ్లుకున్న నోయెల్‌!

Bigg Boss 9 Promo: పచ్చళ్ళ పాప కోరిక తీర్చిన బిగ్ బాస్.. అడుక్కుంటా అంటున్న ఇమ్మూ

Bigg Boss 9: అశ్లీల కుంపటి… బిగ్‌బాస్‌ను బ్యాన్ చేయండంటూ ఫిర్యాదు

Bigg Boss 9 Promo: కెప్టెన్సీ టాస్క్.. గేమ్ కాదు ఫిజికల్ వయోలెన్స్.. అరె ఏంట్రా ఇది!

Bigg Boss 9: డేంజర్ జోన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్.. ఎలిమినేషన్ తప్పదా?

Bigg Boss 9: అతడేమో నాన్న.. ఈమేమో అమ్మ.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అవుట్!

Big Stories

×