OTT Movie : హాలీవుడ్ నుంచి వచ్చిన ఒక ఫ్యాంటసీ సినిమా డిఫరెంట్ స్టోరీతో ఆకట్టుకుంటోంది. చంద్రుడు మీద నుంచి పడ్డ ఒక పాదార్థంతో, ఒక ఫ్యామిలీకి సూపర్ పవర్స్ వస్తాయి. దీంతో వీళ్ళు బ్యాంకు దొంగతనం చేయడానికి ప్రయత్నించే సన్నివేశాలు, ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా పిల్లలతో పాటు, ఫ్యామిలీతో కలసి చూసే విధంగా ఉంటుంది. దీని పేరు ఏమిటి ? ఎక్కడ ఉంది ? కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘సూపర్ బాబ్రోవ్స్’ (Super Bobrovs) 2016లో వచ్చిన రష్యన్ కామెడీ ఫ్యాంటసీ సినిమా. ద్మిత్రీ ద్యాచెంకో దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో పవెల్, ఓక్సానా, రోమా, స్వెట్లానా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2016 మార్చి 17న రష్యాలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
ఒక రష్యన్ ఫ్యామిలీలో టాలిక్ అనే తండ్రి, ఓక్సానా అనే భార్య, రోమా అనే కొడుకు, స్వెటా అనే కూతురు ఉంటారు. వీళ్లకు ఆర్థిక సమస్యలు ఎక్కువగానే ఉంటాయి. దీంతో రోజూ చిన్న చిన్న గొడవలతో వీళ్ళ జీవితం మొదలవుతుంటుంది. ఒక రోజు వాళ్ల ఇంటి దగ్గర ఆకాశం నుంచి ఒక వస్తువు పడుతుంది. దీని వల్ల ఆశ్చర్యంగా కుటుంబంలో అందరికీ సూపర్ పవర్స్ వస్తాయి. మొదట వీళ్లు ఈ పవర్స్‌తో పిచ్చి పనులు చేస్తారు. ఆ తరువాత వాటితో వీళ్ళు సరదాగా ఆడుకుంటారు. వాళ్ళకు ఇప్పుడు ఒక ఆలోచన వస్తుంది. ఈ కుటుంబం డబ్బు కష్టాలు తీర్చడానికి తమ సూపర్ పవర్స్‌ను ఉపయోగించాలని అనుకుంటుంది.
Read Also : 20 ఏళ్ళు పగతో రగిలిపోయే బిచ్చగాడు… క్లైమాక్స్ నెవర్ బిఫోర్… పిచ్చెక్కించే ట్విస్టులు