Keerthy Suresh: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ( Keerthy Suresh ) గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటించి విపరీతంగా అభిమానులను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు కీర్తి సురేష్ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల సరసన హీరోయిన్ గా నటించింది. ఈ బ్యూటీ గత సంవత్సరం డిసెంబర్ నెలలో తన స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది.
Also Read: IND VS AUS: గంభీర్ కు చెప్పకుండానే ఆస్ట్రేలియాకు బయలుదేరిన రోహిత్, కోహ్లీ…సిరీస్ షెడ్యూల్ ఇదే
15 సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం జరుపుకున్నారు. కీర్తి ( Keerthy Suresh), ఆంటోనీ హిందూ క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతులలో వారి వివాహం జరుపుకున్నారు. వివాహం తర్వాత ఎంతో అన్యోన్యంగా వారి వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇక కీర్తి సురేష్ ఎప్పటిలానే వరుసగా సినిమాలలో నటిస్తూ మంచి విజయాలను అందుకుంటుంది. ఓవైపు సినిమాలలో బిజీగా ఉంటూనే పలు షోలలో ఈ బ్యూటీ పాల్గొంటుంది. తాజాగా ఓ షోలో పాల్గొన్న ఈ చిన్నది తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేసుకుంది.
ఈ క్రమంలోని తనకు ధోని అంటే చాలా ఇష్టమని అతడే తన మొదటి క్రష్ అంటూ కీర్తి సురేష్ హాట్ కామెంట్స్ చేసింది. చిన్ననాటి నుంచి ధోని అంటే ఎంతగానో ఇష్టమని అలాంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలని చాలా కోరికగా ఉండేది అంటూ కీర్తి సురేష్ అన్నారు. ఈ విషయం కాస్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం పైన ధోని భార్య సాక్షి సింగ్ కాస్త సీరియస్ గా ఉందట. కీర్తి సురేష్ కు సాక్షి సింగ్ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ విషయంలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా, మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ టోర్నమెంట్ లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 16 ఏళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కొనసాగుతున్నారు ధోని. ఇప్పటకే 5 సార్లు టైటిల్ కూడా అందించాడు. ఇప్పటికీ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు ధోని. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ మహేంద్ర సింగ్ ధోనికి చివరి సీజన్ కానుంది.