Bigg Boss 9 day 39 Highlight: బిగ్ బాస్ హౌజ్ లో ఇప్పుడు అసలైన ఆట మొదలైంది. వైల్డ్ కార్డ్స్ రాకతో హౌజ్ వాతావరణమే మారిపోయింది. ఫ్యామిలీ షోలా ఉన్న బిగ్ బాస్ ఇప్పుడు రణరంగంగా మారింది. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ముందు వరకు హౌజ్ లో బాండింగ్స్, లవ్ ట్రాక్ తప్ప ఏమి కనించలేదు. కానీ, ఇప్పుడు ఫైట్స్, వార్స్, టాస్క్, లవ్ ట్రాక్స్, ఎమోషన్స్ అన్ని కలగలిపి రణరంగంగా మారింది. ముఖ్యంగా మాధురి డామినేషన్, కండిషన్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి. ఓల్ట్ కంటెస్టెంట్స్ ముందు ఫైర్ స్ట్రోమ్స్ తగ్గేదే లే అంటున్నారు. ఇన్ని డ్రామాల మధ్య.. వైల్డ్ కార్డ్ గా వచ్చిన పిక్కిల్స్ పాప రమ్య మోక్ష కొత్త లవ్ ట్రాక్ మొదలుపెట్టింది.
ఎంట్రీతోనే డిమోన్ ని టార్గెట్ చేసింది. నీకు బుర్ర లేదని, అసలు గేమ్ మీద ఫోకస్ పెట్టకుండ ఎక్కడెక్కడో పెడుతున్నావంటూ మొఖం మీద చెప్పింది. ఇక హౌజ్ లోక రాగానే అలా ఎందుకు అన్నానో నువ్వు నువ్వే అనలైజ్ చేసుకో అంటూ సలహా ఇచ్చింది. ఇదే పాయింట్ తో అతడిని నామినేట్ కూడా చేసింది. అలా హౌజ్ లోకి వచ్చినప్పటి నుంచి డిమోన్ పైనే దృష్టి పెడుతోంది. ఇదంత అతడి ఆట తీరు మార్చడానికి అని నిన్నటి వరకు అనుకున్నారంత. కానీ, నేటి ఎపిసోడ అసలు విషయం బట్టబయలైంది. డిమోన్ పై ఇష్టంతోనే రీతూ ట్రాక్ తప్పించాలని చూస్తున్నట్టు అనిపిస్తోంది ఇవాళ ఆమె మాటలు చూస్తుంటే. రమ్య, డిమోన్ లు ఇద్దరు మాత్రమే సైలెంట్ పక్కకు వెళ్లి మాట్లాడుకుంటున్నారు. అటుసైడ్ (రీతూ) నుంచి ఏమైనా జన్యున్ అనిపించలేదా నీకు అని దీనంగా అడుగుతాడు. చాలా బ్యాడ్ ఉంది.. అంతకు మించి చెప్పలేను అంటుంది రమ్య.
నువ్వు ఇక్కడికి లవ్వులు ఆడ్డానికి రాలేదు ఒకే.. నువ్వు తన విషయంలో ఎమోషనల్ అవుతున్నావు.. నేను చూస్తున్నా. తను ఎంత జన్యున్ అని ఆమెకే తెలియాలి, నాకు సంబంధం లేదు. కానీ, బయట టాక్ ఎలా ఉందో అదే చెబుతున్నా. నువ్వు ఆ అమ్మాయని లవ్ చేస్తున్నావు నీ ఏడుపు చూస్తూనే అర్థం అవుతుంది పవన్ తో అంటుంది రమ్య. అయితే ఆ వ్యక్తిపై తనకు ఎలాంటి ఉద్దేశం లేదని, వందశాతం నేను లవ్ చేయడం లేదని అంటాడు. కానీ, నాకు తను జన్యున్ అనిపిస్తుందంటూ పవన్.. రమ్యతో బయట ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలని ప్రయత్నించాడు. ఆ తర్వాత రీతూ నువ్వు టీజ్ చేస్తున్నావా? అని అడుగుతాడు. ఏంటీ ఆమెతో డీప్ లవ్ లో ఉన్నావ్ అంటూ రమ్య పవన్ ని ఆడుకుంది.
వీరి మధ్యలోకి మాధురి ఎంట్రీ ఇచ్చింది. ఏంటీ ఇద్దరు పక్కకు వెళ్లి గుసగుసలాడుకుంటున్నారు ఏం నడుస్తుందంటూ కూపీ లాగింది.
హౌజ్ లో అందరి కన్న నీకు ఎవరూ నచ్చారు? అని మాధురి అడగ్గా.. ఏమో ఎవరైనా నచ్చొచ్చేమో అంటూ పవన్ చూస్తూ అంటుంది. ఎవరూ ఇష్టమని అడగ్గా.. నాకు ఎక్కడో సుడింది నీకు అంటూ పవన్ రాక్ చేస్తుంది. ఏముంది ఇద్దరు జిమ్ లు, టెస్టులు కలిశాయి అంటూ ఇద్దరి మధ్య ఏదో ఉంది అన్నట్టుగా మాట్లాడింది. ఆ తర్వాత ఈ హౌజ్ లో ఎవరూ నచ్చారు నీకు అని అడగ్గా..నాకా ఇంకేవరూ నాకు పవన్.. తను చాలా ఇన్నోసెంట్.. పవనే ఇష్టం అంటూ మనసులో మాట చెప్పింది. ఇదంత ప్రాంక్ అంటూ అసలేం లేదన్నట్టు మాధురితో కవరింగ్ ఇస్తాడు. వెంటనే మాధురి ఇలాంటి విషయాల్లో ఎవరైనా ప్రాంక్ చేస్తారా? అసలు విషయం తెలుసుకో అన్నట్టు డిమోన్ కి చీవాట్లు పెట్టింది మాధురి. మరోవైపు హౌజ్ సాయి కూడా రమ్యకు డిమోన్ పై క్రష్ ఉందని తనూజతో అంటాడు. ఫస్ట్ నుంచి చూస్తున్న ఆమె పవన్ పై ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంది.. ఇప్పడు వారు అదే మాట్లాడుకుంటున్నారు అంటుంది. దీంతో తనూజ అవునా.. అయితే రేపు అబ్జర్వరు చేద్దాం అంటుంది. హా చూడు నీకే అర్థమవుతుంది అంటాడు సాయి.
Also Read: Bigg Boss 9 Day 39 Highlights: కంటెండర్ కోసం అడుక్కున్న రీతూ.. ఛీ పో అన్న ఆయెషా, పవన్ కి రీతూ హగ్