BigTV English
Advertisement

OnePlus 13 vs Nothing Phone 3 vs Galaxy S25 5G: ఒకే రేంజ్‌లో పోటీపడుతున్న మూడు ఫోన్లు.. ఏది బెస్ట్?

OnePlus 13 vs Nothing Phone 3 vs Galaxy S25 5G: ఒకే రేంజ్‌లో పోటీపడుతున్న మూడు ఫోన్లు.. ఏది బెస్ట్?

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో మూడు టాప్ కంపెనీలు దాదాపు ఒకే సమయంలో తమ టాప్ ఫోన్లను విడుదల చేశాయి. నథింగ్ ఫోన్ 3 (Nothing Phone 3) , వన్‌ప్లస్ 13 (OnePlus 13) , సామ్‌సంగ్ గెలాక్సీ S25 5G (Samsung Galaxy S25 5G) . ఈ మూడు ఫోన్ల మధ్య ఫీచర్స్ పరంగా గట్టి పోటీ నెలకొంది. అందుకే మూడింటిలో ఏది మంచి ఫోన్ అనే విషయాన్ని మనం చూద్దాం.


ధర
నథింగ్ ఫోన్ 3 ధర ₹79,999 (12GB + 256GB) నుండి ప్రారంభమవుతుంది. 16GB + 512GB వేరియంట్ ధర ₹86,999. వన్‌ప్లస్ 13 మాత్రం ₹69,999 (12GB + 256GB), ₹76,999 (16GB + 512GB) తో మరింత చౌకగా లభిస్తుంది. గెలాక్సీ S25 5G మూడు వేరియంట్లలో వస్తుంది – ₹74,999 (128GB), ₹80,999 (256GB), ₹92,999 (512GB). ధరల పరంగా వన్‌ప్లస్ 13 స్పష్టంగా లాభదాయకం. గెలాక్సీ మాత్రం ధర చాలా ఎక్కువ.

డిస్‌ప్లే, బ్రైట్‌నెస్
నథింగ్ ఫోన్ 3 – 6.67 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్.
వన్‌ప్లస్ 13 – 6.82 అంగుళాల Quad HD+ LTPO డిస్‌ప్లే, 4500 nits బ్రైట్‌నెస్‌తో అత్యుత్తమ డిస్‌ప్లే.
గెలాక్సీ S25 5G – 6.2 అంగుళాల Full HD+ డైనామిక్ AMOLED డిస్‌ప్లే, 2600 nits బ్రైట్‌నెస్.
వన్‌ప్లస్ డిస్‌ప్లే పరంగా చాలా అద్భుతంగా ఉంది.


ప్రాసెసర్
నథింగ్ ఫోన్ 3 – Snapdragon 8s Gen 4
వన్‌ప్లస్ 13 & గెలాక్సీ S25 5G – Snapdragon 8 Gen 4 Elite
వన్‌ప్లస్, గెలాక్సీ మల్టీ టాస్కింగ్, గేమింగ్‌కు బెస్ట్.

ఆపరేటింగ్ సిస్టమ్
మూడు ఫోన్లు కూడా Android 15 మీద నడుస్తాయి.
నథింగ్ ఫోన్ – Nothing OS 3.5 (క్లీన్ UI),
వన్‌ప్లస్ – Oxygen OS (స్మూత్),
గెలాక్సీ – One UI 7 (ఫీచర్లతో నిండినది).

బ్యాటరీ
నథింగ్ ఫోన్ 3 – 5,500mAh, 65W ఫాస్ట్ ఛార్జింగ్
వన్‌ప్లస్ 13 – 6,000mAh, 100W వైర్డ్ + 50W వైర్‌లెస్ ఛార్జింగ్
గెలాక్సీ S25 5G – కేవలం 4,000mAh
వన్‌ప్లస్ 13 బ్యాటరీ పరంగా చాలా స్ట్రాంగ్.

కెమెరా
నథింగ్ ఫోన్ 3 – మూడు 50MP కెమెరాలు, 50MP సెల్ఫీ కెమెరా
వన్‌ప్లస్ 13 – మూడు 50MP కెమెరాలు, 32MP సెల్ఫీ
గెలాక్సీ – 50MP ప్రైమరీ, 10MP అల్ట్రా వైడ్, 12MP టెలిఫోటో, 12MP సెల్ఫీ
ఈ విషయంలో మాత్రం నథింగ్ ఫోన్ ముందంజలో ఉంది. సెల్ఫీ లవర్స్‌కి ఇదే బెస్ట్.

పరిమాణం, బరువు
నథింగ్ – 218g
వన్‌ప్లస్ – 213g
గెలాక్సీ – 162g (చిన్నదిగా, తక్కువ బరువుతో). లైట్ వెయిట్ కావడంతో గెలాక్సీ S25 5G కాస్త బెటర్.

Also Read: 12GB ర్యామ్‌తో టాప్ 5 హై స్పీడ్ స్మార్ట్‌ఫోన్లు.. 2025 మిడ్ రేంజ్‌‌లో సూపర్ ఫోన్స్ ఇవే..

ఒక్క మాటలో చెప్పాలంటే..
వన్‌ప్లస్ 13 – ధర తక్కువగా ఉంది. బ్యాటరీ ఎక్కువ కాలం వస్తుంది. డిస్‌ప్లే కూడా మూడింటిలో బెస్ట్ ఉండడంతో. ది బెస్ట్ ఛాయిస్ ఇదే.
మరోవైపు నథింగ్ ఫోన్ 3 – కెమెరా, యునిక్ డిజైన్‌తో ఆకట్టుకుంటుంది.
గెలాక్సీ S25 – కాంపాక్ట్, ఫీచర్ రిచ్, బరువు తక్కువ కానీ ధర మాత్రం చాలా ఎక్కువ.

Related News

Oppo Reno 13 Pro+: ఫ్లాగ్‌షిప్‌లను ఢీ కొట్టే రెనో 13 ప్రో ప్లస్.. ఆఫర్ ధర వింటే ఆశ్యర్యపోతారు..

Vivo V27 5G: స్మూత్‌ స్క్రీన్‌, టాప్‌ కెమెరా, సూపర్‌ బ్యాటరీ.. వివో వి27 5జి ఇండియాలో ధర ఎంతంటే?

EV charging Highway: ఈవీ కార్లను ఛార్జింగ్ చేసే రోడ్డు.. డ్రైవింగ్ చేసే సమయంలోనే వాహనాలు ఛార్జ్.. ఎలాగంటే

Google Maps Offline: ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్స్.. ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేయండి

Moto G Stylus 5G: స్టైలస్‌తో స్టైలిష్‌గా.. మోటరోలా మోటో జి స్టైలస్ 5జి స్పెషల్‌ ఫీచర్లు ఇవే

Nokia X 5G: మళ్లీ దుమ్మురేపేందుకు సిద్ధమైన నోకియా ఎక్స్ 5జి.. 6000mAh బ్యాటరీతో ఎంట్రీ..

Redmi K80 Pro 5G: అదిరిపోయే ఫీచర్లతో రాబోతున్న రెడ్మీ కె80 ప్రో అల్ట్రా 5జి.. ఇది నిజంగా గేమ్‌ ఛేంజర్‌ ఫోన్‌!

iQOO 13 Review: ఐక్యూ 13 టెక్ మార్కెట్‌లోకి ఎంట్రీ.. ఒక్క ఫోన్‌తో మొత్తం ట్రెండ్ మార్చేసింది

Big Stories

×