OnePlus Nord 4 : ప్రీమియం ఫీచర్స్ తో అతి తక్కువ ధరలోనే బెస్ట్ మెుబైల్ కొనాలనుకునే యూజర్స్ కు వన్ ప్లస్ నార్డ్ సిరీస్ బెస్ట్ ఆఫ్షన్. ప్రస్తుతం ఈ మొబైల్ పై అమెజాన్ లో టాప్ డిస్కౌంట్ నడుస్తుంది. అదిరే ఆఫర్లో ఈ మొబైల్ ను సొంతం చేసుకోవాలనుకునే యూజర్స్ డీల్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్ వేసేయండి.
టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్ తీసుకువచ్చిన OnePlus Nord 4… క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 8/12 GB LPDDR5X RAM + 128/256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఇక ఆక్సీజన్ OS 14.1తో Android 14లో నడుస్తుంది. ఈ మెుబైల్ లో 100W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500 mAh బ్యాటరీ ఉంది. 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74 అంగుళాల AMOLED ProXDR డిస్‌ప్లే సైతం ఉంది. 2150 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ ను అందిస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరా ఉంది. 8MP అల్ట్రావైడ్ షూటర్, సెల్ఫీల కోసం, 16MP ఫ్రంట్ కెమెరా కూడా ఉన్నాయి.
ఇక ఇండియా ప్రారంభం ధర రూ. 29,999గా ఉంది. ప్రస్తుతం Amazonలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.25,999కే కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఇక అమెజాన్ ధర రూ.27999 ఉండగా.. సెలెక్టెడ్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై ఫ్లాట్ రూ. 2,000 తగ్గింపును పొందే అవకాశం ఉంది.
OnePlus Nord 4 Amazon –
Amazon ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 27,999కే కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై, RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై ఫ్లాట్ రూ. 2,000 తక్షణ తగ్గింపు పొందవచ్చు. ఇక పాత ఫోన్ అప్ గ్రేడ్ చేసి కొత్త మెుబైల్ కొనాలనుకునే యూజర్స్ కు ఇదే బెస్ట్ టైమ్. అమెజాన్ ఆఫర్ లో కొనుగోలు చేసే ఛాన్స్ ఉండటంతో పాటు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ పై భారీ తగ్గింపు సైతం పొందవచ్చు. ఇక దీనిపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా కలదు.
OnePlus Nord 4 Features –
8/12జీబీ ర్యామ్‌తో Snapdragon 7+ Gen 3 SoC ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 256GB ఇంటర్నల్ స్టోరేజ్ UFS4.0ని ఉపయోగిస్తుంది. అయితే 128GB UFS 3.1కి రెస్టిక్ట్ చేయబడింది. 120Hz రిఫ్రెష్ రేట్, 2150 nits పీక్ బ్రైట్నెస్‌తో 6.74-అంగుళాల OLED డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ 5G ఫోన్‌లో OIS మద్దతుతో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సోనీ LYT600 సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ ఉంది. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ 4 5G స్మార్ట్‌ఫోన్ 10W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని ప్యాక్ కలిగి ఉంది. ఇది ఆక్సిజన్ OS 14.1 తో Android 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది. వన్‌ప్లస్ లేటెస్ట్ వెర్షన్ OxygenOSలో AI ఫీచర్లను యాడ్ చేసింది. AI వినియోగాన్ని పెంచడానికి వినియోగదారులు AI సమ్మరైజర్, AI టెక్స్ట్ ట్రాన్స్‌లేటర్, AI ఆడియో సమ్మరైజర్, AI నోట్ సమ్మరైజర్ వంటి ఫీచర్‌లను ఉపయోగించవచ్చు. OnePlus 4 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్‌లను సెక్యూరిటీ ప్యాచ్‌లతో పాటు అందించనుంది.
ALSO READ : భూమ్మీద మానవులు అంతరిస్తే? మన స్థానంలోకి వచ్చే తెలివైన జంతువు ఏదో తెలుసా?