Nyra Banerjee : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే ఈ విషయంపై టెలివిజన్ లేదా బిగ్ స్క్రీన్ నటులు ఎవరైనా సరే స్పందించే విధానం కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. తాజాగా నైరా బెనర్జీ (Nyra Banerjee) తాను కూడా ఒకప్పుడు క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అంటూ వాపోయింది. కానీ ఆ టైంలో చాకచక్యంగా తను ఎలా తప్పించుకుందో చెప్పి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది.
క్యాస్టింగ్ కౌచ్ తప్పించుకోవడానికే…
గతంలో సౌత్ లో సినిమాలు చేస్తున్నప్పుడు ఇలాంటి సందర్భాలు చాలానే ఎదురయ్యాయట ఈ బ్యూటీ (Nyra Banerjee)కి. తాజా ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నలు ఎదురు కాగా, నైరా బెనర్జీ స్పందిస్తూ… “మొదట్లో నేను అందరికీ లాయర్ని అని అబద్ధం చెప్పేదాన్ని. అలా చెప్పినప్పుడు ఎవరైనా సరే ఇలాంటి విషయాలు మాట్లాడాలి అంటే జంకేవారు. అలా చెప్పినా కూడా నమ్మవాళ్ళు కాదు కొంతమంది. అప్పుడు నేను లెస్బియన్ అంటూ అబద్ధం చెప్పేదాన్ని. ఇలా సందర్భానికి తగినట్టుగా అబద్ధాలు చెప్పి క్యాస్టింగ్ కౌచ్ నుంచి తప్పించుకునేదాన్ని. నిజానికి నేను టామ్ బాయ్ లాగా ఉంటాను. కాబట్టి అందరూ లెస్బియన్ అనగానే నమ్మేసేవారు. ఇక ఈ రూమర్ టాలీవుడ్ లో బాగా ప్రచారం జరిగింది. దీంతో జనాలు కూడా అదే నమ్మారు” అంటూ చెప్పుకొచ్చింది నైరా (Nyra Banerjee).
రామ్ చరణ్ (Ram Charan) ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా…
ఇక ఈ నైరా బెనర్జీ (Nyra Banerjee) ఎవరో కాదు తెలుగు సినిమాలలో హీరోయిన్ గా నటించిన మధురిమ. ఈ అమ్మడు టాలీవుడ్ లో ‘ఆ ఒక్కడు’ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో సరదాగా కాసేపు, వేట, షాడో, కొత్తజంట, టెంపర్, దోచేయ్ వంటి సినిమాల్లో నటించింది. ఆమె చివరగా నటించిన తెలుగు సినిమా ‘దోచెయ్’. హీరోయిన్ గానే కాకుండా తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మెప్పించింది ఈ అమ్మడు. అందులో ‘ఆరెంజ్’ మూవీ కూడా ఒకటి.
రామ్ చరణ్ ఫేవరెట్ సినిమా అయిన ఈ ‘ఆరెంజ్’ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా జెనీలియా నటించింది. అలాగే మరి కొంతమంది హీరోయిన్లు కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. అలా రామ్ చరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా ‘ఆరెంజ్’ మూవీలో మెరిసింది ఈ అమ్మడు. ఏకంగా జెనీలియా తన ప్రేయసి అని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధుకు పరిచయం చేస్తాడు చెర్రీ. ఆ సినిమాలో మధురిమ (Nyra Banerjee) కనిపించింది కాసేపే. ఇక ఇప్పుడు పేరు మార్చుకుని నైరా బెనర్జీ గా తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాలు సీరియల్స్ చేస్తూ గడిపేస్తోంది. అలాగే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బ్యూటిఫుల్ ఫోటోలతో అభిమానులను మత్తెక్కిస్తూ ఉంటుంది.