భూమి.. విశ్వంలో అద్భుతమైన గ్రహం. మరే ఇతర గ్రహాల మీద లేని అద్భుతమైన వనరులు ఉన్నాయి. వాతావరణం ఉంది. అన్నింటికి మించి అనంతకోటి జీవులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ధరిత్రి మీద ఉన్న అత్యంత తెలివైన జీవులలో మానవులు ప్రథమ స్థానంలో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే, ఈ విశ్వాన్ని మానవులే ఏలుతున్నారు. ఒకప్పుడు అనాగరికంగా జీవించిన మానవులు, ఇప్పుడు ఆధునిక మనుషులుగా మారిపోయారు. ఆకాశానికి నిచ్చెనలేస్తున్నారు. ఎన్నో అద్భుతాలను సృష్టిస్తున్నారు. కానీ, ఈ భూమ్మీద మానవులు అంతరించిపోతే ఏమవుతుంది? మనుషుల మాదిరిగా ఈ భూమిని ఏ జీవి ఏలే అవకాశం ఉంది? ఈ ప్రశ్నలకు సంబంధించి శాస్త్రవేత్తలు ఆశ్చరకర విషయాన్ని వెల్లడించారు.
మనుషులు అంతరించే అవకాశం ఉందా?
భూ పరిణామం, మనుషుల భవిష్యత్ మీద ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ టిమ్ కోల్సన్ కీలక పరిశోధనలు నిర్వహించారు. భూమ్మీద మనుషులు అంతరించినా, ప్రకృతి తనకు అనుగుణంగా కొత్త జీవ రూపాలను తయారు చేసుకునే అకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. “భూమి మరిన్ని పరిణామాలకు గురవుతుంది. పరిణామాలకు అనుగుణంగా జీవరాశులను తయారు చేసుకుంది. వాటిలో కొన్న భూమికి లాభాన్ని కలిగించేవి ఉండగా, మరికొన్నింటితో నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. అయితే, ఈ భూమ్మీద ఏ జీవి శాశ్వతంగా ఉండదని గుర్తించాలి. మనుషులు కూడా అంతం అవుతారు. కానీ, ఇందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది” అని కోల్సన్ అభిప్రాయపడ్డారు.
మనుషుల తర్వాత భూమిని ఏలేది ఎవరు?
ఒకవేళ భూమ్మీద మానవులు లేకపోతే ఏం జరుగుతుంది? మనం లేనప్పుడు ఈ భూమిని ఏలేది ఎవరు? అనే ప్రశ్నలు ఉత్పత్తి అవుతాయి. దానికి కూడా కోల్సన్ సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. మానవుల తర్వాత, ఈ భూమిని కొత్త జీవులు ఏలుతాయని చెప్పారు. ఈ జీవులలో ఆక్టోపస్ లు మరింత ఆధిపత్య పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. వాటి తెలివితేటలు, అనుకూలతలు, సమస్యల పరిష్కార నైపుణ్యాలు ఈ భూమ్మీద అగ్రస్థానంలో ఉండేలా చేస్తాయన్నారు.
నిజానికి ఆక్టోపస్ లకు ఇప్పటికే ఆయా వస్తువులను ఉపయోగించే తెలి తేటలు ఉన్నాయి. వాటర్ ట్యాంకుల నుంచి తప్పించుకునే టెక్నిక్స్ తెలుసు. ఈ తెలివితేటలే నాగరికతను నిర్మించే జాతిగా పరిణామం చెందే అవకాశం ఉందన్నారు కోల్సన్. అధునాతన నాడీ వ్యవస్థ ఈ ఆలోచనకు సపోర్టు చేసే అవకాశం ఉందన్నారు. అయితే, ఆక్టోపస్ లకు ఉన్న ప్రధాన సవాళ్లలో ఒకటి భూమ్మీద జీవించలేపోవడం అన్నారు. ఈ ఆలోచన ఇప్పట్లో మ్యెచూర్డ్ గా ఉండకపోయినా, మున్ముందు వాస్తవం అయ్యే అవకాశం ఉందన్నారు.
మానవుల అంతం తర్వాత ఏమవుతుంది?
కోల్సన్ ఆలోచనలు ప్రీ మ్యెచ్యూర్డ్ గా అనిపించినా, వాస్తవానికి దగ్గరగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మానవులు అంతం అయిన తర్వాత కూడా భూమి పరిణామం అనేది కొనసాగుతూనే ఉంటుందన్నారు. “భూమ్మీద మనుషులు అంతరించిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ, కచ్చితంగా భూ పరిణామం అనేది కచ్చింతగా కొనసాగుతుంది. ఇప్పుడు మన ఆధిపత్యంలో ఉన్న భూమి, ఒకప్పుడు ఆక్టోపస్ ల ఆధిపత్యంలోకి వెళ్లే అవకాశం ఉంది” అని కోల్సన్ అభిప్రాయపడ్డారు.
Read Also: గర్భవతి అని తెలిసిన 4 గంటల్లోనే బిడ్డకు జననం, అలా ఎలా?