E-Paper
Advertisement

వన్‌ప్లస్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఆ పాపులర్ ట్యాబ్లెట్ల ధరలు భారీగా పెంపు.. కొత్త ధరలు ఇవే!

వన్‌ప్లస్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఆ పాపులర్ ట్యాబ్లెట్ల ధరలు భారీగా పెంపు.. కొత్త ధరలు ఇవే!
Advertisement

OnePlus Pad Go 2: టెక్ ప్రియులకు వన్‌ప్లస్ షాకిచ్చింది. భారతదేశంలో తమ పాపులర్ ట్యాబ్లెట్లు అయిన ‘వన్‌ప్లస్ ప్యాడ్ గో 2, ‘వన్‌ప్లస్ ప్యాడ్ లైట్’ ధరలను కంపెనీ భారీగా పెంచింది. గతేడాది మార్కెట్లోకి వచ్చిన ఈ రెండు డివైజ్‌ల ధరలు ఇప్పుడు మునుపటి కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. పెరిగిన ఈ కొత్త ధరలు ఇప్పటికే వన్‌ప్లస్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో లైవ్‌లోకి వచ్చాయి.

ఎందుకీ ధరల పెంపు?

ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో RAM, స్టోరేజ్ విడిభాగాల కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా AI టెక్నాలజీ డిమాండ్ పెరగడంతో.. విడిభాగాల తయారీ కంపెనీలు తమ ఫోకస్‌ను డేటా సెంటర్ల వైపు మళ్లించాయి. దీనివల్ల సాధారణ మొబైల్స్, ట్యాబ్లెట్లకు వాడే విడిభాగాల ధరలు పెరిగిపోయాయి. ఈ ప్రభావం వన్‌ప్లస్ ట్యాబ్‌లపై పడింది. గతంలో కొన్ని స్మార్ట్‌ఫోన్ల ధరలను కూడా వన్‌ప్లస్ ఇలాగే పెంచింది.

Advertisement

Also Read: చెవులకు నొప్పి ఉండదు.. 37 గంటల బ్యాటరీతో అదరగొడుతున్న సోనీ కొత్త ఇయర్‌బడ్స్!

కొత్త ధరల వివరాలు:

తాజా మార్పుల ప్రకారం.. వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 బేస్ వేరియంట్ (8GB+128GB, వై-ఫై) ధర రూ.29,999కి చేరింది. అలాగే 256GB మోడల్ ధర రూ.32,999 కాగా.. 5G కనెక్టివిటీ ఉన్న టాప్ వేరియంట్ రూ.35,999కి పెరిగింది. మరోవైపు వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ (6GB+128GB, వై-ఫై) బేస్ మోడల్ ధర రూ.19,999కి పెరగ్గా.. 8GB ర్యామ్ కలిగిన సెల్యులార్ మోడల్ ధర రూ.22,999కి చేరుకుంది.

పెరిగిన భారం ఎంత?

Advertisement

లాంచ్ ధరలతో పోల్చి చూస్తే.. ఈ పెంపు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 ప్రారంభంలో రూ.26,999కి, వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ రూ.15,999కి విడుదలయ్యాయి. అంటే లాంచ్ ధరతో పోలిస్తే ఈ రెండు ట్యాబ్లెట్లపై ఇప్పుడు ఏకంగా రూ.3,000 వరకు అదనపు భారం పడుతోంది. ఇటీవల జరిగిన వరుస ధరల పెంపుతో కస్టమర్లపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది.

ప్యాడ్ గో 2 ఫీచర్లు:

ధరలు పెరిగినప్పటికీ.. వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 అద్భుతమైన ఫీచర్లను అందిస్తోంది. దీనిలో 12.1 ఇంచుల 2.8K ఎల్‌సీడీ డిస్‌ప్లే, 120Hz రీఫ్రెష్ రేట్ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7300-ఆల్ట్రా ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ట్యాబ్‌లో 10,050mAh భారీ బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. అలాగే ఇందులో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్, బ్యాక్ సైడ్ 8MP కెమెరాలను అందించారు.

Also Read: కష్టపడి రుద్దాల్సిన పనిలేదు.. ఈ 5 పదార్థాలతో వంటగది జిడ్డు చిటికెలో మాయం!

Related News

రూ.1037కే మిక్సీ గ్రైండరా? ఫ్లిప్‌కార్ట్ ఇస్తున్న ఈ క్రేజీ ఆఫర్ అసలు మిస్ కావద్దు!

క్షణాల్లోనే ఈజీగా కేకులు,పిజ్జాలు రెడీ.. పిజియన్ ఓటీజీ స్పెషల్స్ ఇవే!

రూ.7890కే 7 కేజీ వాషింగ్ మెషీన్..డోంట్ మిస్

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్..ఫాస్ట్‌ట్రాక్ ఆప్టిమస్ ప్రో స్పెషల్స్ ఇవే!

స్టైలిష్ లుక్,బిగ్ బ్యాటరీతో ఫైర్-బోల్ట్ హరికేన్ స్మార్ట్‌వాచ్ విడుదల!

ఫిలిప్స్ నుంచి అదిరిపోయే..బ్లూటూత్ స్పీకర్! ధర కూడా చాలా తక్కువ

పొరపాటున ఫోటోలు డిలీట్ అయ్యాయా? ఇలా రికవర్ చేసుకోండి!

ప్లే స్టోర్‌లో యాప్స్ డౌన్‌లోడ్ చేసే ముందు ఈ విషయాలు చెక్ చేయండి!

Big Stories

Advertisement
×