E-Paper
Advertisement

బరువు సగం.. బలం డబుల్.. సౌర విద్యుత్ రంగంలో ‘తేనెపట్టు’ మ్యాజిక్!

బరువు సగం.. బలం డబుల్.. సౌర విద్యుత్ రంగంలో ‘తేనెపట్టు’ మ్యాజిక్!
Advertisement

Honeycomb Solar Panels: కోట్లాది సంవత్సరాల క్రితమే ప్రకృతి ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ అద్భుతాన్ని సృష్టించింది. అదే ‘తేనెపట్టు’. అతి తక్కువ మైనాన్ని ఉపయోగించి, గరిష్ట స్థలంలో అత్యంత పటిష్టంగా గూడును ఎలా నిర్మించాలో తేనెటీగలు ఎప్పుడో కనిపెట్టాయి. వాటి షడ్భుజి (హెక్సాగోనల్) ఆకృతికి ఉన్న పటిష్టత.. ఎప్పటినుంచో శాస్త్రవేత్తలను ఆకర్షిస్తూ వస్తోంది. ఇప్పుడు అదే ప్రాకృతిక సూత్రాన్ని (బయోమిమిక్రీ) ఆధారం చేసుకుని శాస్త్రవేత్తలు సౌర విద్యుత్ రంగంలో ఒక పెద్ద విప్లవానికి తెరతీశారు. సాంప్రదాయ సోలార్ ప్యానెళ్ల బరువును సగానికి సగం తగ్గించి వాటి బలాన్ని పెంచే సరికొత్త డిజైన్‌ను రూపొందించారు.

‘అల్యూమినియం శాండ్‌విచ్’

సాధారణంగా సోలార్ ప్యానెళ్లు అంటే భారీ గ్లాస్, వెనుక వైపు మందపాటి బ్యాక్‌షీట్‌తో ఉండి చాలా బరువుగా ఉంటాయి. కానీ ‘సోలార్ ఎనర్జీ మెటీరియల్స్ అండ్ సోలార్ సెల్స్’ జర్నల్‌లో ప్రచురితమైన తాజా పరిశోధన ప్రకారం.. శాస్త్రవేత్తలు భారీ గ్లాస్ స్థానంలో ‘అల్యూమినియం హనీకోంబ్ శాండ్‌విచ్’ నిర్మాణాన్ని ప్రవేశపెట్టారు. రెండు పల్చని పొరల మధ్య తేనెపట్టు లాంటి అల్యూమినియం గడులను అమర్చారు. ఇది ప్యానెల్‌కు అవసరమైన దృఢత్వాన్ని ఇస్తూనే నిర్మాణంలో వాడే పదార్థాల వినియోగాన్ని, బరువును భారీగా తగ్గించింది.

సగం తగ్గిన బరువు.. చెక్కుచెదరని మన్నిక

Advertisement

ఈ సరికొత్త సాంకేతికతతో తయారు చేసిన ప్యానెళ్లు చదరపు మీటరుకు కేవలం 6.2 కిలోల బరువు మాత్రమే ఉన్నాయి. అంటే సాంప్రదాయ ప్యానెళ్లతో పోలిస్తే ఇవి ఏకంగా 48 శాతం తేలికైనవి. అయితే బరువు తగ్గింది కదా అని వీటి నాణ్యత ఏమాత్రం తగ్గలేదు. విపరీతమైన వేడి, మంచు తుఫానులు, అతినీలలోహిత కిరణాల ప్రభావం, మెకానికల్ లోడ్ వంటి కఠినమైన అంతర్జాతీయ నాణ్యత పరీక్షలన్నింటిలోనూ ఈ హనీకోంబ్ ప్యానెళ్లు విజయవంతంగా పాసయ్యాయి.

రవాణా సులువు.. ఈజీ ఫిక్సింగ్

ఈ తేలికపాటి ప్యానెళ్ల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బరువు తక్కువగా ఉండటం వల్ల వీటిని ఒక చోటు నుండి మరోచోటికి రవాణా చేయడం, బిల్డింగులపై అమర్చడం చాలా సులభం కానుంది. ముఖ్యంగా పాతకాలపు భవనాలు, ఎక్కువ బరువు మోయలేని పారిశ్రామిక షెడ్ల పైకప్పులపై కూడా వీటిని ఎలాంటి ప్రమాదం లేకుండా అమర్చుకోవచ్చు. అలాగే తయారీలో తక్కువ ముడిసరుకు వాడటం వల్ల కంపెనీలకు ఉత్పత్తి వ్యయం కూడా తగ్గుతుంది.

Advertisement

Also Read: కరెంట్ ఉండదు.. బ్యాటరీతో పనిలేదు.. కానీ ఈ ‘మాయా దీపాలు’ ఎలా వెలుగుతాయి?

భవిష్యత్తు ఇంధనానికి సరికొత్త దిశ

ప్రపంచవ్యాప్తంగా హరిత ఇంధనానికి డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ఈ ఆవిష్కరణ ఒక మైలురాయి కానుంది. కేవలం ఇళ్లపైనే కాకుండా.. వాహనాలు, పోర్టబుల్ పవర్ సిస్టమ్స్, చివరికి అంతరిక్ష నౌకల్లో కూడా ఈ తేలికపాటి ప్యానెళ్లను వాడుకునే అవకాశం ఉంది. మెుత్తంగా కోట్ల సంవత్సరాల ప్రకృతి అనుభవం నేటి ఆధునిక సాంకేతిక సవాళ్లకు ఎలా పరిష్కారం చూపుతుందో చెప్పడానికి ఈ ‘తేనెపట్టు సోలార్ ప్యానెల్’ ఒక అద్భుతమైన ఉదాహరణగా చెప్పవచ్చు.

Also Read: ఇప్పుడంటే బిర్యానీ ఫేమస్.. పూర్వం హైదరాబాదీలు ఇష్టంగా తిన్న ఫుడ్ ఏది? మీ ఊహకు సైతం అందదు!

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×