E-Paper
Advertisement

ఆఫ్‌లైన్ AI అసిస్టెంట్‌తో ప్రపంచంలోనే తొలి ఏజెంటిక్ స్మార్ట్‌ఫోన్ ‘StepX Neo’ను లాంచ్ చేసిన స్టెప్‌ఫన్!

ఆఫ్‌లైన్ AI అసిస్టెంట్‌తో ప్రపంచంలోనే తొలి ఏజెంటిక్ స్మార్ట్‌ఫోన్ ‘StepX Neo’ను లాంచ్ చేసిన స్టెప్‌ఫన్!
Advertisement

World First Agentic Smartphone: టెక్నాలజీ ప్రపంచంలో సరికొత్త విప్లవానికి తెరలేపుతూ చైనాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్ ‘స్టెప్‌ఫన్’ ఒక అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. మైక్రోసాఫ్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్‌లు 2023లో స్థాపించిన ఈ సంస్థ.. ప్రపంచంలోనే మొట్టమొదటి మాస్ మార్కెట్ ఏజెంటిక్ స్మార్ట్‌ఫోన్ StepX Neoను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కేవలం కొన్ని వాయిస్ కమాండ్స్‌తోనే యాప్స్, సిస్టమ్ ఫంక్షన్లు, వెబ్ సర్వీసులను ఇది సులభంగా ఆపరేట్ చేయగలదు.

స్మార్ట్‌గా పనిచేసే Step Amoo:

ఈ ఫోన్‌లో కేవలం మామూలు చాట్‌బాట్‌లా కాకుండా.. ఆపరేటింగ్ సిస్టమ్‌లోనే లీనమైపోయేలా ‘స్టెప్ అమూ’ అనే సరికొత్త AI అసిస్టెంట్‌ను అందించారు. ఉదా: మనం ఏదైనా ఊరు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, మన ఫోన్‌కు చెబితే చాలు. అది స్వయంగా ఫ్లైట్స్ వెతికి, హోటల్స్ బుక్ చేసి, ప్రయాణ వివరాలన్నింటినీ ఒక దగ్గర భద్రపరుస్తుంది. దీని కోసం మనం వేర్వేరు యాప్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు.

Advertisement

Also Read: బల్బు ఆన్ చేస్తే చాలు.. Wi-Fi కంటే 100 రెట్లు వేగంతో ఇంటర్నెట్ ఇచ్చే Li-Fi టెక్నాలజీ!

ట్రావెలర్స్ కోసం ప్రత్యేక ఫీచర్లు:

ప్రయాణాలు ఎక్కువగా చేసేవారికి ఈ ఫోన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఇంటర్నెట్ లేకపోయినా 32 భాషల్లో లైవ్ సంభాషణలు, ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, కెమెరా ముందున్న టెక్ట్స్‌లను అనువదించగలదు. అలాగే లోకల్ బస్సు, రైలు టైమింగ్స్ చెప్పడం, వీసా రూల్స్ గుర్తుచేయడం, కస్టమ్స్ డాక్యుమెంట్ల తయారీలో సాయం చేయడం వంటి పనులను కూడా చక్కబెడుతుంది.

కొత్త ఆపరేటింగ్ సిస్టమ్:

Advertisement

ఈ ఫోన్ Step AOS అనే సరికొత్త ఓఎస్‌తో పనిచేస్తుంది. ఇది మామూలు ఆండ్రాయిడ్‌లా కాకుండా.. AI అవసరాల కోసం లినక్స్, RTOS భాగాలతో ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. దీనిలోని ‘నేచురల్ యూజర్ ఇంటర్‌ఫేస్’ మన వాయిస్, చూసే విధానాన్ని బట్టి మన అలవాట్లను నేర్చుకుంటుంది. ఈ AI ప్రాసెసింగ్ అంతా ఫోన్ లోపలే జరగడం విశేషం.

ప్రముఖ యాప్స్‌తో భాగస్వామ్యం:

యూజర్లకు మరింత మెరుగైన సేవలు అందించడం కోసం స్టెప్‌ఫన్ సంస్థ అలీపే, దిది, మీటువాన్, సిట్రిప్, డబ్ల్యూపీఎస్ ఆఫీస్, క్యాప్‌కట్ వంటి ప్రముఖ చైనీస్ ప్లాట్‌ఫారమ్‌లతో చేతులు కలిపింది. దీనివల్ల ఫోన్ లోపల ఉండే పనులే కాకుండా.. బయటి సర్వీసులను కూడా ఈ AI ఏజెంట్ చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది.

Also Read: చెవులకు నొప్పి ఉండదు.. 37 గంటల బ్యాటరీతో అదరగొడుతున్న సోనీ కొత్త ఇయర్‌బడ్స్!

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×