E-Paper
Advertisement

కిచెన్‌లో ఇవి ఉంటే.. చిమ్నీల అవసరమే లేదు!

కిచెన్‌లో ఇవి ఉంటే.. చిమ్నీల అవసరమే లేదు!
Advertisement

Kitchen chimney alternatives:  ఈ రోజుల్లో అపార్ట్‌మెంట్లు, మోడ్రన్ ఇళ్లలో కిచెన్ సైజు చాలా చిన్నగా ఉంటోంది. అంత తక్కువ స్థలంలో.. పెద్ద పెద్ద కిచెన్ చిమ్నీలు పెడితే కిచెన్ అంతా గజిబిజిగా మారిపోతుంది. అలాగని చిమ్నీ పెట్టకపోతే వంటగది అంతా పొగ, జిడ్డు, వాసనలతో నిండిపోతుంది. అందుకే.. చిన్న కిచెన్‌లలో నీట్‌గా ఇమిడిపోయే 5 అద్భుతమైన స్మార్ట్ ప్రత్యామ్నాయాలు ఇప్పుడు మార్కెట్లోకి వచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

చిమ్నీలకు మించిన 5 స్మార్ట్ ఆప్షన్స్:

హోమ్ డెకర్, స్మార్ట్ అప్లయన్సెస్ కేటగిరీలో ‘మినిమలిజం’అంటే తక్కువ స్థలంలో ఎక్కువ లుక్ ఇచ్చే వస్తువులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. మీ వంటగది కూడా చిన్నగా ఉండి, చిమ్నీ పెట్టడం ఇష్టం లేకపోతే.. ఈ ఐదు ఆప్షన్స్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి.

1. డౌన్‌డ్రాఫ్ట్ వెంటిలేషన్ సిస్టమ్స్:

Advertisement

ఇది మోడ్రన్ కిచెన్స్ లో మోస్ట్ ట్రెండింగ్ ఆప్షన్. సాధారణ చిమ్నీలు తల పైన ఉంటే, ఈ డౌన్‌డ్రాఫ్ట్ సిస్టమ్ మీ స్టవ్ పక్కనే లేదా వెనక భాగంలో ఉంటుంది. మీరు వంట చేస్తున్నప్పుడు వచ్చే పొగ పైకి వెళ్లకుండా, ఇది కిందకే లాగేస్తుంది. వంట పూర్తవగానే ఇది ఆటోమేటిక్‌గా కిందకి వెళ్ళిపోతుంది. దీని వల్ల పైన స్థలం చాలా ఆదా అవుతుంది.

2. రీసర్క్యులేటింగ్ లేదా డక్ట్‌లెస్ హుడ్స్:

సాధారణ చిమ్నీలకు బయటకు పొగ పోవడానికి పెద్ద పైపులు పెట్టాలి. కానీ ఈ డక్ట్‌లెస్ హుడ్స్ కి ఎలాంటి పైపులు అక్కర్లేదు. వీటిలో ఉండే పవర్‌ఫుల్ చార్‌కోల్ ఫిల్టర్లు వంట గదిలోని పొగ, వాసన, జిడ్డును లోపలికి లాక్కుని, గాలిని క్లీన్ చేసి మళ్లీ బయటకు వదులుతాయి. స్థలం తక్కువ ఉన్న ఫ్లాట్లకు ఇది బెస్ట్ ఛాయిస్.

3. ఇంటిగ్రేటెడ్ హబ్ విత్ బిల్ట్-ఇన్ ఎక్స్‌ట్రాక్టర్:

Advertisement

ఇది టెక్నాలజీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ సిస్టమ్ లో స్టవ్ , చిమ్నీ రెండు కలిసే ఉంటాయి. స్టవ్ మధ్యలోనే పొగను పీల్చేసే వెంట్ ఉంటుంది. మీరు వంట వండుతుంటే.. ఆ పొగ పైకి లేవకముందే స్టవ్ లోపలికే వెళ్ళిపోతుంది. పైన అసలు చిమ్నీ అనేదే కనిపించదు కాబట్టి కిచెన్ సూపర్ స్టైలిష్ గా ఉంటుంది.

4. పవర్‌ఫుల్ కమర్షియల్-గ్రేడ్ వాల్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ :

పాత కాలపు ఎగ్జాస్ట్ ఫ్యాన్లు కాకుండా.. ఇప్పుడు మార్కెట్లో హై-సక్షన్ పవర్ ఉన్న స్మార్ట్ ఎగ్జాస్ట్ ఫ్యాన్లు దొరుకుతున్నాయి. ఇవి గోడకు చాలా తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. బడ్జెట్ లో అయిపోవాలి, అలాగే పొగ మొత్తం బయటకు పోవాలి అనుకునేవారికి ఇది చాలా సింపుల్ అండ్ బెస్ట్ ఆప్షన్.

Also Read: రూ.30,999 ధరలో.. లగ్జరీ టీవీ, Xiaomi X Pro లేటెస్ట్ మోడల్ పై ఓ లుక్కేయండి!

5. స్లిమ్-లైన్ లేదా టెలిస్కోపిక్ హుడ్స్: 

ఇవి మీ వంటగది క్యాబినెట్ కింద దాగి ఉంటాయి. మీరు వంట చేసేటప్పుడు మాత్రమే వీటిని ముందుకు లాగాలి. వంట అయిపోయాక వెనక్కి నెట్టేస్తే క్యాబినెట్ లో కలిసిపోతాయి. క్యాబినెట్ స్థలాన్ని వృథా చేయకుండా వాడుకోవడానికి ఇవి చక్కగా ఉపయోగ పడతాయి.

చిన్న కిచెన్ ఉన్నంత మాత్రాన పని తీరులో రాజీ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జనాలు ఇలాంటి స్మార్ట్ సొల్యూషన్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. మీ బడ్జెట్, కిచెన్ డిజైన్ బట్టి ఈ ఐదింటిలో ఒక దాన్ని ఎంచుకుని మీ ఇంటిని మోడ్రన్ గా మార్చేయండి.

Related News

బరువు సగం.. బలం డబుల్.. సౌర విద్యుత్ రంగంలో ‘తేనెపట్టు’ మ్యాజిక్!

Redmi Turbo 6 Series లీక్.. ఏకంగా 10,000mAh బ్యాటరీ, పవర్‌ఫుల్ చిప్‌సెట్‌తో రాబోతున్న కొత్త ఫోన్లు!

మీ బిజినెస్ సూపర్ సక్సెస్ కావాలా? ఈ కమర్షియల్ డీప్ ఫ్రీజర్స్‌పై ఓ లుక్కేయండి

ఆఫ్‌లైన్ AI అసిస్టెంట్‌తో ప్రపంచంలోనే తొలి ఏజెంటిక్ స్మార్ట్‌ఫోన్ ‘StepX Neo’ను లాంచ్ చేసిన స్టెప్‌ఫన్!

వన్‌ప్లస్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఆ పాపులర్ ట్యాబ్లెట్ల ధరలు భారీగా పెంపు.. కొత్త ధరలు ఇవే!

చెవులకు నొప్పి ఉండదు.. 37 గంటల బ్యాటరీతో అదరగొడుతున్న సోనీ కొత్త ఇయర్‌బడ్స్!

ఇస్త్రీ చేసే టైం లేదా? ఈ లేటెస్ట్ వాషింగ్ మెషీన్ ఫీచర్ మీ కోసమే!

Big Stories

Advertisement
×