BigTV English

Oppo A3x: మైండ్ బ్లాక్.. ఒప్పో నుంచి కొత్త ఫోన్.. అదరగొడుతున్న ఫీచర్లు!

Oppo A3x: మైండ్ బ్లాక్.. ఒప్పో నుంచి కొత్త ఫోన్.. అదరగొడుతున్న ఫీచర్లు!

Oppo A3x: దేశంలో ఒప్పో కొత్త A-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా Oppo A3xను తీసుకురానుంది. దీన్ని మిడ్ రేంజ్ ప్రైస్‌లో తీసుకురావచ్చు. అయితే కంపెనీ దీన్ని పరిచయం చేయకముందే ఇంటర్నెట్‌లో దీని స్పెసిఫికేషన్లు, డిజైన్ లీక్ అయ్యాయి. వీటి ప్రకారం ఈ ఫోన్ బలమైన బిల్డ్ వాటర్‌ప్రూఫ్ రేటింగ్‌తో వస్తుందని సమాచారం. ఇప్పటి వరకు వెల్లడైన వివరాలను ఒకసారి చూద్దాం.


Oppo A3x లిక్విడ్ రెసిస్టెంట్ రేటింగ్‌‌తో వస్తుంది. డిజైన్, స్పెక్స్ లీక్‌ TheTechOutlook వెల్లడించింది. ఒప్పో ఏ3ఎక్స్ డిజైన్‌ను చూపించే లీక్ అయిన ప్రోమో ఇమేజ్ పోస్టర్‌లను కూడా షేర్ చేసింది. ఫోటోలలో ఫోన్ వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్,  ఫ్లాట్ డిజైన్‌ను మనం చూడవచ్చు. పోస్టర్ ఆధారంగా మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్ డిజైన్, మల్టీ లిక్విడ్ రెసిస్టెంట్ (IP54 రేటింగ్)ని కూడా హైలైట్ చేస్తుంది. ముందు భాగంలో 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే (1000 నిట్స్ పీక్) ఉంటుంది. సెల్ఫీ కెమెరా కోసం డిస్‌ప్లే పంచ్ హోల్ కటౌట్ అందుబాటులో ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్ మూడు అందమైన కలర్ వేరియంట్‌లలో వస్తుంది. ఫోన్‌లో ఫ్లాట్ ప్యానెల్ ఉంటుంది. ఇది రౌండ్ ఎడ్జెస్ కలిగి ఉంటుంది. అలానే తేలికపాటి బెజెల్స్‌తో వస్తుంది. కుడి వైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్, ఎడమ వైపున SIM ట్రే కనిపిస్తాయి. రాబోయే Oppo A3x కలర్ వేరియంట్ లీక్ అయ్యాయి. ఇది పర్పుల్, స్పార్కిల్ బ్లాక్, స్టార్‌లైట్ వైట్ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ అవుతుంది. ఫ్లికర్ బ్రైట్‌నెస్ డిటెక్షన్ సెన్సార్‌తో వెనుకవైపు 8-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంది.


Also Read: CMF Phone 1 Sales Record: CMF రికార్డ్ సేల్స్.. క్షణాల్లో అవుట్ ఆఫ్ ది స్టాక్.. మళ్లీ సేల్ ఎప్పుడంటే?

ఇది ఆండ్రాయిడ్ 14 OS ఆధారంగా ColorOS 14 కస్టమ్ స్కిన్‌పై రన్ అవుతుందని ఓ లీక్ హల్‌చల్ చేస్తుంది. ఫోన్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ అమర్చబడి ఉంటుంది. ఇది 4GB + 64GB, 4GB + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. ఫోన్ 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పెద్ద 5100mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఫోన్ 7.68mm సన్నగా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయిన తర్వాత Oppo A59ను కంపెనీ నిలిపివేసే ఛాన్స్ ఉంది.

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×