BigTV English

Oppo K13 5G: బాహుబలి బ్యాటరీతో సరికొత్త స్మార్ట్‌ఫోన్.. ఏకంగా 7000mAh, ఎన్ని రోజులు వస్తుందంటే?

Oppo K13 5G: బాహుబలి బ్యాటరీతో సరికొత్త స్మార్ట్‌ఫోన్.. ఏకంగా 7000mAh, ఎన్ని రోజులు వస్తుందంటే?

Oppo K13 5G: స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ఓ శుభవార్త వచ్చేసింది. టెక్ ప్రపంచంలో మళ్లీ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఒప్పో సిద్ధమైంది. ఇప్పుడు భారత మార్కెట్‌లోకి ఇది ఓ బాహుబలి మోడల్ తో ఎంట్రీ ఇచ్చింది. పవర్ బ్యాంక్‌లా ఉండే 7,000mAh భారీ బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ Qualcomm Snapdragon 6 Gen 4 చిప్‌సెట్, 8GB RAM, 256GB స్టోరేజ్ వంటి అద్భుతమైన ఫీచర్లతో లాంచ్ అయిన ఈ ఫోన్ ఇప్పుడు టెక్ ప్రియుల మనసులను దోచుకుంటోంది. బడ్జెట్‌ ఫోన్‌ అయి ఉండి, పనితీరు మాత్రం ప్రీమియంగా ఉండాలనుకునే వారికోసం ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.


ధర విషయంలో కూడా
ఇదే నెలలో మరో K సిరీస్ మొబైల్‌తో ఒప్పో మళ్లీ అడుగుపెట్టబోతోంది. ఏప్రిల్ 24న Oppo K13 5G అనే కొత్త డివైస్‌ను విడుదల చేయనున్న ఈ చైనీస్ బ్రాండ్, ఈసారి ధర విషయంలో కూడా యూజర్లకు శుభవార్త అందించింది. అందుబాటులో ఉండే ధరలో, హై ఎండ్ ఫీచర్లతో వచ్చే ఈ ఫోన్ మార్కెట్‌ను షేక్ చేయడం ఖాయమని టెక్ వర్గాలు అంటున్నాయి. మరి ఈ శక్తివంతమైన మొబైల్ ఫోన్ స్పెసిఫికేషన్లు, ధర, ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఒప్పో K13 5G ధర
Oppo K13 5Gని రెండు స్టోరేజ్ వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు – 8GB RAM + 128GB, 8GB RAM + 256GB. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.17,999. అదే సమయంలో, దాని టాప్ వేరియంట్ రూ. 19,999 కి వస్తుంది. ఈ ఫోన్‌ను పర్పుల్, ప్రిజం బ్లాక్ అనే రెండు రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఏప్రిల్ 25 నుంచి భారతదేశంలో అమ్మకానికి అందుబాటులోకి వస్తుంది. మొదటి సేల్‌లో ఫోన్ కొనుగోలుపై రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీనిని ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంచనున్నారు.


Read Also: Poxiao: బియ్యపు గింజత హార్డ్ డ్రైవ్‌..రెప్పపాటులో డేటా ట్రాన్స్ …

Oppo K13 5G ఫీచర్లు
ఈ స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz హై రిఫ్రెష్ రేట్ ఫీచర్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ డిస్ప్లే గరిష్ట ప్రకాశం 1200 నిట్స్ వరకు ఉంటుంది. ఈ ఫోన్‌లో వెట్ హ్యాండ్ టచ్, గ్లోవ్ మోడ్ ఫీచర్లు కూడా అందించబడ్డాయి.

మైక్రో SD కార్డ్
ఒప్పో K13 5Gలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ ఇవ్వబడింది. దీనికి 8GB RAM, 256GB వరకు సపోర్ట్ చేస్తుంది. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా విస్తరించుకోవచ్చు. గేమింగ్ పనితీరును మెరుగుపరచడానికి ఈ ఫోన్‌లో వేపర్ కూలింగ్ (VC) చాంబర్ ఉంది. ఇది కాకుండా, ఈ బడ్జెట్ ఫోన్ AI ఫీచర్లతో లభిస్తుంది.

ఇక కెమెరా విషయానికి వస్తే
ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంటుంది. దీనికి 50MP ప్రధాన, 2MP ద్వితీయ కెమెరా ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 16MP కెమెరా ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15పై పనిచేస్తుంది. ఇందులో 80W SuperVOOC USB టైప్ Cఛార్జింగ్ ఫీచర్‌తో పాటు శక్తివంతమైన 7,000mAh బ్యాటరీ ఉంటుంది.

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×