Read Also: Ameenpur: అమీన్‌పూర్‌లో దారుణం.. భార్యను బ్యాట్‌తో కొట్టి కిరాతకంగా చంపిన భర్త..
ఈ సైబర్ మోసాలను అరికట్టడానికి ప్రజల అవగాహనే అత్యంత పెద్ద అడ్డంకి అని శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. “హైదరాబాద్‌లో సైబర్ అవేర్‌నెస్ ఉన్నప్పటికీ, ఇంకా బాధితులు ఉండటం ఆందోళనకరం. అందుకే యువకులు, రిటైర్డ్ వ్యక్తులు, ప్రముఖులు అందరూ ఈ అవగాహన ఉద్యమంలో భాగం కావాలి. ఒకరు పది మందికి, పది మంది ఇరవై మందికి చెబితే ఇది పెద్ద మాస్ మూవ్‌మెంట్ అవుతుంది” అని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో 24 గంటలు ‘సైబర్ పెట్రోలింగ్’ చేస్తోందని, మోసాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ తెలిపారు. “నేరస్థులు ఎప్పుడూ పోలీసుల కంటే ఒక అడుగు ముందుండేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ప్రజల్లో అవగాహన మరింత పెరగాలి. ప్రజలే సైబర్ నేరాలపై ప్రవక్తగా (అవగాహన దూతగా) ఉండాలి. నగరంలో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని త్వరలో తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తాం” అని ఆయన తెలిపారు.