Karimnagar: జగిత్యాల జిల్లాలో నరబలి కలకలం రేపుతోంది. ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడంతో కుటుంబం సభ్యులంతా.. గుప్త నిధుల కోసమే నరబలి ఇచ్చినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కండ్లపల్లిలోని నవత అనే మహిళ ఇంట్లో గుప్త నిధుల కోసం వెళ్లిన ముగ్గురిలో, ఆనంతారం గ్రామానికి చెందిన నరవేని మోగిలి అనే వ్యక్తి మృతి చెందాడు. అనంతరం గ్రామానికి చెందిన మెుగిలిని కండ్లపల్లికి మేస్త్రీ పని కోసం తీసుకెళ్లారు సోమయ్య.అనంతరం కరెంట్ షాక్ తగలడంతో మెుగిలిని హాస్పిటల్‌కు తరలించినట్లు మెుగిలి కుటుంబ సభ్యులకు తెలిపాడు సోమయ్య. మహిళ ఇంట్లో గుంత తవ్వి క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు గ్రామస్తులు గుర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించి మిగిలిన ఇద్దరు వ్యక్తులను అదుపు లోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.