Oppo Reno 13 : టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో (OPPO) త్వరలోనే మరో కొత్త మెుబైల్ ను తీసుకురావటానికి సన్నాహాలు చేస్తుంది. ఈ మెుబైల్ లేటెస్ట్ ఫీచర్స్ తో రాబోతుంది. ఇక డైమెన్సిటీ 8350 SoCతో వచ్చేస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్.. 2025 జనవరిలో రాబోతుంది.
స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Oppo.. జనవరి 2025లో గ్లోబల్ మార్కెట్లోకి రెనో 13 సిరీస్ (Oppo Reno 13 Series) ను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇక ఈ మెుబైల్ లేటెస్ట్ పిక్స్ సైతం ఆన్లైన్ లో హల్చల్ చేస్తున్నాయి. ఇక పర్పుల్ కలర్ లో ఈ ఫోన్ రాబోతున్నట్లు తాజా లీక్స్ లో తెలుస్తుంది. అయితే ఇప్పటికే చైనాలో ఈ మెుబైల్ లాంఛ్ కాగా ఈ కలర్ వేరియంట్ అక్కడ అందుబాటులో లేనట్టే తెలుస్తుంది. కేవలం భారత్ లో మాత్రమే ఈ ఫోన్ అందుబాటులోకి రాబోతుందా అనే టాక్ సైతం వినిపిస్తుంది.
Oppo Reno 13లో ‘AI’ లేబుల్‌తో వచ్చేస్తుంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, సెన్సార్‌ల పక్కనే రింగ్ ఫ్లాష్‌లైట్ ఉంటాయి. స్మార్ట్‌ఫోన్ కెమెరా వెనుక ప్యానెల్‌తో పూర్తిగా కవర్ అయ్యి వస్తున్నట్లు తెలుస్తుంది. యాంటెన్నా బ్యాండ్‌లు తాజాగా లీక్ అయిన పిక్స్ లో కనిపిస్తున్నాయి కాబట్టి మెటల్ ఫ్రేమ్‌తో ఈ మెుబైల్ రాబోతున్నట్లు తెలుస్తుంది.
Oppo Reno 13 Expected Features –
ఒప్పో చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ కావడంతో ఇప్పటికే ఒప్పో రేనో 13 (Oppo Reno 13) చైనాలో లాంఛ్ అయింది. ఈ మొబైల్ కు అక్కడ డిమాండ్ సైతం ఎక్కువగానే కనిపిస్తుంది. అయితే అదే వేరియంట్ గ్లోబల్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం సైతం కనిపిస్తుంది . Oppo Reno 13 6.59 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌తో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌తో బెస్ట్ కెపాసిటీ ర్యామ్ తో రాబోతుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ColorOS 15 పై పనిచేస్తుంది.
Oppo Reno 13 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో రాబోతుంది. ఇందులో కెమెరా ఫీచర్స్ సైతం అదిరిపోయేలా ఉన్నాయి. 50MP ప్రైమరీ షూటర్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 50MP సెన్సార్‌ను కూడా కలిగి ఉంది. 5600mAh బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో పనిచేస్తుంది.
ఇక ప్రస్తుతానికి ఈ మొబైల్ ధరపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే రూ. 30 వేల నుంచి రూ. 35 వేల మధ్య ఉండే అవకాశం ఉన్నట్టు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మొబైల్ ఫీచర్స్ తో పాటు ధర, వివరాలు పూర్తిస్థాయిలో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఏది ఏమైనా వచ్చే నెలలో రాబోతున్న టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ తో ఈ మెుబైల్ కచ్చితంగా పోటీ పడే అవకాశం మాత్రం కనిపిస్తుంది.
ALSO READ : 4 వేరియంట్స్ లో వివో Y29! 8GB RAM + 256GB ధర కేవలం రూ.18,999