Samyuktha Menon : సాధారణంగా హీరోలతో పోల్చుకుంటే.. హీరోయిన్లు అందంగా కనిపించాలని తెగ తాపత్రయపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఏ రంగంలో అయినా సరే హీరోయిన్ అందంగా ఉంటేనే ఆడియన్స్ కూడా ఆదరిస్తారు అన్న విషయం వాస్తవం. ఈ నేపథ్యంలోనే ఆడియన్స్ ని మెప్పించడం కోసం అనారోగ్య బారిన పడినా సరే తమ అందం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు హీరోయిన్స్. ముఖ్యంగా దివంగత నటీమణి శ్రీదేవి (Sridevi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం కోసం ఆమె ఏకంగా తన జీవితాన్ని పణంగా పెట్టింది. ఈ విషయాన్ని ఆమె భర్త, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోణీ కపూర్ (Boney Kapoor) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలా అందం కోసం ఎంతో మంది సర్జరీలు చేయించుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలోకి సంయుక్త మీనన్ (Samyuktha menon) కూడా చేరిపోయింది.
సర్జరీకి సిద్ధమైన సంయుక్త..
మలయాళీ సినీ ఇండస్ట్రీకి చెందిన సంయుక్త మీనన్ వాస్తవానికి చాలా అందంగా ఉంటుంది. కానీ ఆమెలో కూడా నెగిటివ్ గా ఉన్నది ఆమె పెదాలు మాత్రమే. ఆమె పెదాలు చాలా పెద్దవిగా ఉంటాయి. అందుకే ఈమెను చూసిన కొంతమంది రకరకాల ట్రోల్స్ చేసినట్లు సమాచారం. ఇలాంటి కామెంట్లు విని సంయుక్త బాగా హర్ట్ అయిందని, అందుకే ఇప్పుడు వాటికి సర్జరీ చేయించుకోబోతుందని సమాచారం. మొత్తానికి అయితే తన లిప్స్ కి సర్జరీ చేయించుకోవడానికి సిద్ధమయ్యిందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ఎంతో చక్కగా నేచురల్ గా నటించడానికి ఇష్టపడే ఈమె… ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి? అంటూ అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళనలో ఫ్యాన్స్…
ఇకపోతే సర్జరీలు తీసుకోవడం సహజమే కానీ ఆ సర్జరీలు ఫెయిల్యూర్ అయితే అసలు ఇక ఆ ముఖం మనం చూడగలమా? అంటూ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. మరి సంయుక్త మీనన్ నిజంగానే సర్జరీ చేయించుకోబోతోందా? లేక ఇది కేవలం సోషల్ మీడియాలో పుట్టిన గాసిప్ మాత్రమేనా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ విషయాలపై పూర్తి క్లారిటీ రావాలి అంటే సంయుక్త స్పందించక తప్పదు.
సంయుక్త కెరియర్..
సంయుక్త విషయానికి వస్తే..తెలుగులో రానా, పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇందులో రానా భార్యగా నటించి మొదటి పరిచయంతోనే భారీ పాపులారిటీ అందుకుంది.. ఆ తర్వాత ధనుష్ (Dhanush)నేరుగా తెలుగులో నటించిన ‘సార్’ సినిమాలో కూడా సంయుక్త నటించి ఆకట్టుకుంది. అంతేకాదు మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ (Sai Durga Tej) నటించిన ‘విరూపాక్ష’ సినిమాలో కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఒక్కసారిగా ఈవిల్ పవర్ వున్న క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను అబ్బురపరిచింది. పాత్ర ఏదైనా సరే తనను తాను ప్రూవ్ చేసుకోవడంలో ఎప్పుడు సిద్ధంగా ఉంటానని మరొకసారి నిరూపించింది సంయుక్త. ఏదేమైనా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే హ్యాట్రిక్ అందుకొని భారీ పాపులారిటీ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.