Vivo Y29 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో త్వరలోనే ఎంతో గ్రాండ్ గా లాంఛ్ చేయబోతున్న మెుబైల్ Vivo Y29. కాగా ఇప్పటికే ఈ ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ లీకై టెక్ ప్రియులను ఉర్రూతలూగించగా.. తాజాగా ఈ మెుబైల్ నాలుగు వేరియంట్స్ లో అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. దీంతో పాటు ఏ ఏ వేరియంట్స్ లో రాబోతుంది.. వాటి ధర సైతం లీక్ అయ్యాయి.
Vivo కంపెనీ ఇండియన్ మార్కెట్లో Y29 సిరీస్‌ను త్వరలో లాంఛ్ చేయబోతోంది. వివో తీసుకురాబోతున్న ఈ మెుబైల్ అదిరిపోయే ఫీచర్స్ తో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక MySmartPrice తాజాగా ప్రచురించిన నివేదిక ప్రకారం.. Vivo Y29 5Gకి సంబంధించిన ధర, ఆఫర్‌లు వెల్లడయ్యాయి. ఈ లీక్‌ల ప్రకారం, స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ ఆధారంగా నాలుగు వేరియంట్‌లలో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో స్టార్టింగ్ వేరియంట్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ + 4GB RAM వేరియంట్ ధర రూ.13,999.
128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో 6GB RAM వేరియంట్ రూ.15,499కి అందుబాటులో ఉంటుంది. 128GB స్టోరేజ్‌తో 8GB RAM వేరియంట్ ధర రూ.16,999గా ఉండగా… 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన టాప్ వేరియంట్ రూ.18,999కి అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా, Vivo 8GB వేరియంట్‌కు రూ. 1,500 క్యాష్‌బ్యాక్ సదుపాయం కూడా కలదు. ఇక EMI కొనుగోళ్లపై 4GB వేరియంట్‌లకు రూ. 1,000 తగ్గింపు కూడా లభిస్తుంది వివో తన కస్టమర్స్ కు ఆఫర్ ఇస్తుంది.
Vivo Y29 స్పెసిఫికేషన్స్ –
Vivo Y29 5G ఫీచర్స్ ఇప్పటికే చక్కర్లు కొడుతున్నాయి. బహుశా 6.68 అంగుళాల డిస్‌ప్లే, బేస్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌తో 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇది డైమండ్ బ్లాక్, టైటానియం గోల్డ్, గ్లేసియర్ బ్లూ లాంటి మూడు అదిరిపోయే కలర్స్ లో రాబోతుంది. ఇది మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, SGS సర్టిఫికేషన్, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 సర్టిఫికేషన్ తో వచ్చేస్తుంది.
Vivo Y29 లో కెమెరా క్వాలిటీ సైతం అదిరిపోయేలా ఉంది. 50MP ప్రైమరీ షూటర్, 0.08MP QVGA సెకండరీ షూటర్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కు 8MP ఫ్రంట్ స్నాపర్‌ని పొందుతుంది. ఇది 5500mAh బ్యాటరీతో పాటు 44W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో ఉంటుంది. ఇక 8.1mm మందంతో 198 గ్రాముల బరువు ఉంటుంది.
ఇప్పటికే లీకైన ఈ ఫీచర్స్ తో పాటు మరిన్ని ఫీచర్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండదు అన్నట్టు తెలుస్తోంది ఫీచర్స్ పూర్తిస్థాయిలో లీక్ అయితే కెమెరా క్వాలిటీ తో పాటు మిగిలిన ఫీచర్స్ పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ మొబైల్ వచ్చే ఏడాది ఎంతో గ్రాండ్ గా లాంఛ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇండియాలో ఈ మొబైల్ మోస్ట్ అవైటింగ్ లిస్టులో ఉన్న సంగతి కూడా తెలిసిందే.
ALSO READ : మిస్‌లీడింగ్ ధంబ్‌నెయిల్స్ పై యూట్యూబ్ కొరడా.. వీడియో తొలగింపు, ఫైన్ తప్పదు..