BigTV English

Oppo Reno 11A Launched: లెజెండ్.. ఒప్పో నుంచి బడ్జెట్ ఫోన్.. లుక్ అదిరింది!

Oppo Reno 11A Launched: లెజెండ్.. ఒప్పో నుంచి బడ్జెట్ ఫోన్.. లుక్ అదిరింది!

Oppo Reno 11A Launched: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. Oppo Reno 11A పేరుతో పరిచయం చేసింది. గత కొన్ని రోజులుగా ఈ ఫోన్ గురించి టెక్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంతో Reno 11A మార్కెట్‌‌లో సందడి చేస్తోంది. ఫోన్‌లో 120 Hz AMOLED డిస్‌ప్లే, 64-మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఫోన్ చాలా తేలికగా, స్లిమ్ బాడీతో వస్తుంది. ఒప్పో ఈ ఫోన్‌ను జపాన్‌ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇది భారతదేశంతో సహా ఇతర మార్కెట్లలో త్వరలో రానుంది. కొత్త ఫోన్ ధర ఎంత, దాని ప్రత్యేకత, తదితర వివరాలు తెలుసుకుందాం.


Oppo Reno 11A ఫీచర్ల గురించి చెప్పాలంటే ఇందులో పెద్ద AMOLED డిస్‌ప్లే,  64MP కెమెరా, 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది పూర్తి HD ప్లస్ రిజల్యూషన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌‌కు సపోర్ట్ ఇస్తుంది. ColorOS 14 ఆధారంగా ఆండ్రాయిడ్ 14తో ఫోన్ ప్రీలోడ్ చేయబడింది. సేఫ్టీ కోసం ఇందులో ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఉంది. ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 64-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు కోసం ఫోన్‌లో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.

ఫోన్  డైమెన్షన్ 7050 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇందులో 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. Wi-Fi 802.11ax, బ్లూటూత్ 5.2, GPS, NFC, USB టైప్-C పోర్ట్, IP65 రేటెడ్ ఛాసిస్ వంటి ఇతర ప్రత్యేక ఫీచర్లు ఫోన్‌లో ఉన్నాయి. ఫోన్ బరువు 177 గ్రాములు.


Also Read: పిచ్చెక్కించే ఆఫర్స్.. రూ.1300కే వన్ ప్లస్ 5G ఫోన్లు.. ఇదేందీ బ్రో!

Oppo Reno 11A Price
Oppo Reno 11A స్మార్ట్‌ఫోన్ ధర 48,800 జపనీస్ యెన్ (~$307 అంటే దాదాపు రూ. 25,600). దీని బుకింగ్ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. ఇది జూన్ 27న దేశంలో విక్రయానికి అందుబాటులోకి రానుంది. దీన్ని కోరల్ పర్పుల్, డార్క్ గ్రీన్ వంటి కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. Oppo Reno 11F పేరుతో ఈ ఫోన్ ఇప్పటికే ఇతర మార్కెట్‌లలో అందుబాటులో ఉంది. భారతదేశంలో ఈ ఫోన్ Oppo F25 Pro పేరుతో సేల్‌కు రానుంది.

Related News

Google App Changes: ఫోన్‌లో డయలర్‌ ఎందుకు మారింది? పాత పద్దతి కావాలంటే జస్ట్ ఇలా చేయండి

Pixel 10 vs Galaxy S25: రెండు టాప్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్ షిప్ ఫోన్ల మధ్య పోటీ.. విన్నర్ ఎవరంటే?

Realme 15 vs Redmi 15: ఏ 5G ఫోన్ కొనాలి?

Best Gaming Moblies: 2025లో బెస్ట్ గేమింగ్ మొబైల్స్.. రూ.65000 లోపు బడ్జెట్‌లో అదిరిపోయే ఫోన్లు

Google Veo 3 Free: ఏఐ వీడియోలు చేయడం పూర్తిగా ఫ్రీ.. గూగుల్ వియో 3 ఇప్పుడే ట్రై చేయండి!

Prostate Cancer: వైద్యరంగంలో ఏఐ విప్లవం.. క్యాన్సర్ నిర్థారణలో మరో ముందడుగు

Big Stories

×