Supreme Court Refuses to Stay NEET UG 2024 Counselling: నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్ ప్రక్రియపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం మరోసారి నిరాకరించింది. పేపర్ లీకేజీ అంశంపై అత్యున్నత న్యాయస్థానం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి నోటీసు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌లతో పాటు తాజా పిటిషన్‌లను ట్యాగ్ చేసిన అత్యున్నత న్యాయస్థానం, ఈ అంశంపై తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది.
జులై మొదటి వారంలో నీట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. నీట్ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని పిటిషనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ భట్టీలతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్లను విచారించింది.
గత వారం సుప్రీం కోర్టు కౌన్సిలింగ్ ప్రక్రియను నిలిపివేయాలన్న వాదనను తిరస్కరించింది. మే 5న ఎన్టీయే నీట్ పరీక్షను నిర్వహించింది. కాగా జూన్ మొదటి వారంలో ఫలితాలు వచ్చాయి. దాదాపు 60 మంది విద్యార్థులు పూర్తి స్థాయి మార్కులు సాధించడంతో అనుమానాలు వెల్లువెత్తాయి. గ్రేస్ మార్కులు కలపడాన్ని కూడా తీవ్రంగా తప్పుబట్టారు అభ్యర్థులు. అసలు నీట్ పరీక్ష నిర్వహణే నీట్‌గా లేదని.. పరీక్షను రద్దు చేయాలని పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Also Read: అవును.. NEET క్వశ్చన్ పేపర్ ను అమ్మేశా : అంగీకరించిన నిందితుడు
ఇదిలా ఉండగా నీట్ యూజీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వ్యక్తిగత పీఏ ప్రీతమ్ కుమార్‌ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. నీట్ పేపర్ లీకేజీలో పాలు పంచుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సికిందర్ ప్రసాద్‌కు ప్రీతమ్ కుమార్ మధ్య సత్సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.