Crime News: నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చి నివాసం ఉంటుంది నాగలక్ష్మి కుటుంబం. వీరికి పిల్లలు అవంతిక(9), భువన్ సాయి(7). గత కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు ఏర్పడ్డాయి. అయితే నిన్న రాత్రి మద్య సేవించి ఇంటికి వచ్చి నాగలక్ష్మితో గొడవ పడ్డాడు భర్త. ఆ తర్వాత ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన నాగలక్ష్మి.. తన ఇద్దరు పిల్లల్ని చంపి తాను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కి తరలించారు. ఆపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.