Riyaz Encounter: నిజామాబాద్ జిల్లాలో జరిగిన ccs కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న రియాజ్‌ను శనివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడు అప్పటికే గాయాలతో ఉండటంతో అతడిని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రి నుంచి తప్పించుకునేందుకు రియాజ్ ప్రయత్నించాడు. పోలీసులు నుంచి ఆయుధం లాక్కునేందుకు ప్రయత్నించే క్రమంలో పోలీసులు రియాజ్ పై కాల్పులు జరిపారు. దీంతో రియాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు.