5G Smartphone Offer: మీరు మంచి 5G ఫోన్ కోసం చూస్తున్నారా. అద్భుతమైన పెర్ఫార్మెన్స్, కీలక ఫీచర్లతో ప్రస్తుతం అనేక 5G స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే బడ్జెట్ ధరల్లో అందుబాటులో ఉన్న 5జీ స్మార్ట్‌ఫోన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే POCO C75 5G ఫోన్. ఇది మార్కెట్లో అదిరిపోయే తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 10 వేలకుపైగా ఉండగా, ప్రస్తుతం రూ. 4 వేలకే వస్తుండటం విశేషం. అది ఎలా అనే విషయాలతోపాటు దీని ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
డిస్‌ప్లే
POCO C75 5G స్మార్ట్‌ఫోన్ 6.58 ఇంచుల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీరు వీడియోలు, ఫోటోలు చూడటానికి, గేమ్‌లు ఆడటానికి చాలా అద్భుతమైన వ్యూయింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
కెమెరా
POCO C75 5G ఫోన్‌లో 50 MP ప్రధాన కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్, 2 MP మాక్రో లెన్స్ ఉన్నాయి. మీరు దీని ద్వారా అత్యుత్తమ ఫోటోలు తీసుకోవచ్చు. ముందు భాగం 8 MP కెమెరా ద్వారా మీరు మంచి సెల్ఫీలను క్లిక్ చేసుకోవచ్చు.
Read Also: Ugadi Special Offer: ఉగాది ప్రత్యేక ఆఫర్..రూ.4 వేలకే …
5G కనెక్టివిటీ
POCO C75 5G స్మార్ట్‌ఫోన్ తాజా 5G నెట్‌వర్క్‌తో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది మీకు తక్కువ లేటెన్సీ, అత్యంత వేగవంతమైన డౌన్లోడ్, అప్‌లోడ్ స్పీడ్, మెరుగైన వీడియో స్ట్రీమింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
4 GB RAM + 64 GB స్టోరేజ్
4 GB RAM, 64 GB స్టోరేజ్ తో POCO C75 5G ఫోన్ మీకు మంచి పనితీరును అందిస్తుంది. మీరు దీనిలో అనేక పనులను తేలికగా నిర్వహించుకోవచ్చు. 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ ద్వారా మీరు ఎక్కువ ఫైల్‌లు, ఫోటోలు, వీడియోలను స్టోర్ చేసుకోవచ్చు.
పవర్‌పుల్ బ్యాటరీ
ఈ ఫోన్‌లో 5000 mAh బ్యాటరీ ఉంది. ఇది పూర్తి రోజు యూజ్‌కు సరిపడేంత పవర్‌ను అందిస్తుంది. దీని ద్వారా మీరు డివైస్‌ను ఎక్కువసేపు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.
ధర & ఆఫర్:
POCO C75 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.7999కే అందుబాటులో ఉంది. దీని అసలు ధరతో రూ.10,999తో పోలిస్తే 30 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఫ్లిప్ కార్టులో ఉంది. దీంతోపాటు మీరు ఏదైనా ఫోన్ ఎక్స్ఛేంజ్ ఇవ్వడం ద్వారా ఈ ఫోన్ మీకు దాదాపు రూ. 4000కే లభించే అవకాశం ఉంటుంది. అంటే ఎక్స్ఛేంజ్ ఇచ్చే ఫోన్ మోడల్ ఆధారంగా ఈ ధర ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. ఇంత తక్కువ ధరల్లో ఏ 5జీ ఫోన్ కూడా లభించడం లేదని చెప్పవచ్చు.
POCO C75 5G ఎందుకు కొనుగోలు చేయాలి
స్మార్ట్ 5G టెక్నాలజీ: POCO C75 5G 5G నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది ప్రతి అప్లికేషన్, సర్వీస్‌ను వేగంగా నడపగలదు
ఆధునిక డిజైన్: POCO C75 5G ఫోన్ సిల్వర్ స్టార్‌డస్ట్ రంగుతో ప్రెమియం లుక్‌ను అందిస్తుంది.
మంచి కెమెరా: 50 MP రేర్ కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరా మీకు అత్యుత్తమ ఫోటోలు తీసుకునేందుకు సహాయపడుతుంది