Illu Illalu Pillalu Today Episode March 24th: నిన్నటి ఎపిసోడ్ లో.. వేదవతి ధీరజ్ని క్షమించి దగ్గరికి తీసుకోండి అని రామరాజుకి చెప్తుంది. తన చిన్న కొడుకు గురించి గొప్పగా చెబుతూ ఉంటుంది అంతలోకే తన తమ్ముడు వచ్చి చందు ని పోలీసులు అరెస్ట్ చేశారు అన్న విషయాన్ని బయట పెడతాడు. అసలు ఏం జరిగింది రా చందు ని పోలీసులు అరెస్ట్ చేయడమేంటి పెద్దోడు అంత పెద్ద తప్పు ఏం చేశాడు అని రామరాజు అడుగుతాడు. విశ్వం నిన్ను కొట్టడంతో ధీరజువాని కొట్టడానికి వెళ్ళాడు. అయితే నేను పెద్దోడికి ఫోన్ చేశాను ఇంటికి రమ్మని వాడి కంట్రోల్ చేయమని వాడు వచ్చి వాళ్ళు విశ్వం రెచ్చగొట్టడంతో వాని ఇద్దరు కలిసి కొట్టారు అయితే ధీరజ్ని కాకుండా చందు పై పోలీస్ కేసు పెట్టారు అని చెప్పగానే రామరాజు టెన్షన్ పడతాడు. చూసావా నీ చిన్న కొడుకు చాలా మంచోడు అన్నావు కదా ఇది నీ చిన్న కొడుకు ఎవరు వాడు చేసిన పనికి ఇప్పుడు నా పెద్దోడు బలయ్యాడు అనేసి బాధపడుతూ వెళ్ళిపోతాడు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి రామరాజు కన్నీళ్లు పెట్టుకుంటాడు అది పెద్దోడు ఎందుకురా నువ్వు ఇలా చేశావు నా పెద్దోడు ఏం తప్పు చేశాడు ఎస్ఐ గారు అని అనగానే బుజ్జమ్మ కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక భద్రావతి భాగ్యం కు ఫోన్ చేస్తుంది. భాగ్యం పోలీస్ స్టేషన్ కు వచ్చి పెళ్లి జరగదని చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రామరాజు ఇంటికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంటాడు. కొడుకు పెళ్లి ఇలా ఆగిపోతుంది అని అస్సలు అనుకోలేదంటూ బాధపడిపోతుంటాడు. ఇంట్లోని వాళ్ళందరూ చందున అరెస్ట్ చేయడంతో దిగులుగా కూర్చుని ఉంటారు. ధీరజ్ ఇంట్లోకి రావడం చూసి రామరాజు కోపం కట్టలు తెంచుకుంటుంది. నువ్వు ఎందుకు వచ్చావు మళ్ళీ ఇంట్లోకి అని అరుస్తాడు. ధీరజ్ నీకు కొడతాడు నీ వల్లే కదా ఇప్పుడు పెద్దోడు అలా జైల్లో ఉన్నాడు పెళ్లి కావలసిన వాడు ఇలా జైలు పాలు అవ్వడానికి కారణం నువ్వు కాదా అనేసి అరుస్తాడు.
నిన్ను కొడితే నేను ఎలా ఊరుకుంటాను నాన్న అని ధీరజ్ అంటాడు నన్ను వాడు కొట్టలేదు పొరపాటున చేయి తగిలిందని చెప్పానా అక్కడితో ఆ గొడవ ఆపేయమని చెప్పాను మళ్లీ నువ్వు వెళ్లి ఇలా చేస్తావని అనలేదు. దానికి ధీరజ్ బడువు మీ నాన్నను కొట్టాను చూడు అని నన్ను అన్నాడు అందుకే వెళ్లి కొట్టాను ఇంతలో తప్పేమీ అన్నయ్య తప్పేమీ లేదు. అసలు కొట్టింది నేనైతే అన్నయ్య మీద కేసు ఎందుకు పెట్టారు నాకు అర్థం కావట్లేదు ఇదంతా కావాలని కుట్ర చేస్తున్నారని ధీరజ్ అంటాడు.. అన్నయ్యని జైలు పలు చేశానని నన్ను దయచేసి అనకండి నాన్న నేను అంత దుర్మార్గుడిని కాదు అని ధీరజ్ అంటాడు.
నువ్వు ఇన్ని గొడవలు జరగడానికి కారణం ఆ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోవడమన్న సంగతి. నువ్వు మర్చిపోతున్నావేమో.. నాపై పగ తీర్చుకోవాలని ఆ కుటుంబం ఎంతగానో ప్రయత్నిస్తుంది అన్న విషయం నీకు తెలిసే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అని రామరాజు అంటాడు. ధీరజ్ లోపలికి వెళ్లి బాధపడుతూ ఉంటాడు ప్రేమ లోపలికి రాగానే నువ్వు మీ అమ్మ కోసం అటు లోపలికి వెళ్ళకుండా అంటే వాడు కొట్టేవాడే కాదు కదా ఎందుకు నువ్వు వెళ్ళావని ప్రేమని నిలదీస్తాడు తల్లి కళ అయితే ఎలా వెళ్లకుండా ఉంటాం అనుకున్నాం అని ప్రేమ ఫీల్ అవుతుంది.
చందు జైల్లో ఉన్నాడని అందరూ ఫీల్ అవుతుంటారు.. ఈ గొడవ జరగడానికి కారణం నేనే బావగారు అరెస్ట్ చేయడానికి కారణం నేనే కాబట్టి బావగారిని బయటకు తీసుకొచ్చే ప్రణాళిక కూడా నేనే వేయాలని ప్రేమ షాకింగ్ డెసిషన్ తీసుకుంటుంది. ఉదయం లేవగానే రామరాజు మొఖం మాడిపోయింది కొడుకు జైలు పాలు అయ్యాడని కుమిలిపోతున్నాడు అని సేన భద్ర ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ ఫోన్ చేసి అర్జెంటుగా పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్తారు..
అటు రామరాజు ఫ్యామిలీ ఇటు భద్ర వల్ల ఫ్యామిలీ ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు అక్కడ ప్రేమను చూసి షాక్ అవుతారు నువ్వేంటి ప్రేమ ఎక్కడున్నావంటే.. ఈ అమ్మాయిని వాళ్ళ అన్నయ్య కొట్టాడని కేసు పెట్టింది ఇంట్లోంచి మెడ పట్టు గెంటేసాడు అంటూ క్రిమినల్ కేసు పెట్టడంతో ఈ కేసు స్ట్రాంగ్ ఏంది విశ్వం ఆ కేసును వెనక్కి తీసుకుంటే ఈ అమ్మాయి ఆ కేసును వెనక్కి తీసుకుంటానని అంటుంది ఇది చాలా క్రిటికల్ కేసు. ఈ కేసులో బెయిల్ కూడా రాదు ఆ అబ్బాయి చందుకు నాలుగు రోజులు అయిన తర్వాత బెయిల్ రావచ్చు.
ఎస్ఐ అనగానే భద్ర టెన్షన్ పడుతుంది వెంటనే మేము కేసు వెనక్కి తీసుకుంటామని అంటుంది. విశ్వం చేత కేసు వెనక్కి తీసుకునేలా చేస్తుంది. ఇక ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది. అక్కడికి వచ్చి నువ్వు బాగా చేశావు పుట్టింటికి నువ్వు మంచి పని చేశావు ఆ దుర్మార్గున్ని పెళ్లి చేసుకొని నువ్వు చాలా మారిపోయావు అనేసి అంటుంది. ఎంత చెప్పాలని చూసినా కూడా భద్ర వినకపోగా ప్రేమనే తిడుతుంది. రామరాజు ఫ్యామిలీ మాత్రం చందు రిలీజ్ అయినందుకు సంతోషంగా ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇప్పటి ఎపిసోడ్లో భాగ్యం తన కూతురితో రామరాజు ఇంటికి వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు చూడాల్సిందే..