Jio Entertainment Plans : ప్రముఖ టెలికాం సంస్థలన్నీ ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఎప్పటికప్పుడు తమ కస్టమర్స్ ను ఆకట్టుకోవడానికి సరికొత్త ప్లాన్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అతి తక్కువ ధరకే ఎక్కువ రోజుల వ్యాలిడిటీని అందిస్తున్నాయి. ఇక వీటితో పాటు ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ ను సైతం సరికొత్తగా ప్లాన్ చేస్తున్నాయి. ఇక ఏ నేపథ్యంలో ప్రముఖ టెలికాం వ్యవస్థ రిలయన్స్ సైతం తన జియో సేవలను ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకుంటూ వస్తుంది. తాజాగా ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ ను సరికొత్తగా మార్చేసింది. ఇక ఏ ధరకు ఏ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్స్ అందుబాటులో ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం.
టెలికాం రంగంలో జియో తనదైన ముద్ర వేసిందని సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ టెలికాం సంస్థ ఎప్పటికప్పుడు తన కస్టమర్స్ కోసం కొత్త ప్లాన్స్ అందుబాటులోకి తీసుకొస్తుంది. ముఖ్యంగా సినీప్రియల కోసం ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ ను సైతం అతి తక్కువ ధరకే ఎక్కువ రోజులు ఇచ్చే విధంగా ప్లాన్ చేసింది. ఇక తాజాగా నెట్ ఫ్లిక్స్, సోనీ లివ్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ హాట్ స్టార్ వంటి ప్రముఖ ప్లాట్ఫామ్స్ ను అది తక్కువ ధరకే అందించేందుకు కొత్త ప్లాన్స్ ను తీసుకొచ్చింది. ఇక వాటి ఫుల్ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం.
జియో ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ –
రూ. 1799 ప్లాన్ – ఈ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ 84 రోజులు వ్యాలిడిటీతో అందుబాటులో ఉంది. ఇందులో నెట్ ఫ్లిక్స్ సబ్స్కిప్షన్ తో పాటు రోజుకు 3gb డేటా అదనంగా పొందే అవకాశం ఉంది.
రూ. 1299 ప్లాన్ – ఈ ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో అందుబాటులో ఉంది. రోజుకు 2GB డేటా పొందే అవకాశం ఉన్న ఈ ప్లాన్ లో నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ను జియో ఉచితంగా అందిస్తుంది.
రూ. 1049 ప్లాన్ – సోనీ లివ్, జియో ఫైబర్ సబ్స్కిప్షన్ అందుబాటులో ఉండే ఈ ప్లాన్ 84 రోజులు పాటు రోజుకు 2gb డేటాను ఉచితంగా అందిస్తుంది.
రూ. 1029 ప్లాన్ – ఈ ప్లాన్ ను కొనుగోలు చేసే కస్టమర్స్ కు అమెజాన్ ప్రైమ్ సబ్స్కిప్షన్ ఉంటుంది. రోజుకు 2gb డేటా 84 రోజుల పాటు పొందే అవకాశం ఉంది.
రూ. 949 ప్లాన్ – ఈ ప్లాన్ లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్స్కిప్షన్ 84 రోజులు పాటు ఉంటుంది. ఇందులో 2GB డేటా పొందే అవకాశం ఉంది.
రూ. 448 ప్లాన్ – జీ ఫైబర్, సోనీ లివ్ సబ్స్కిప్షన్, జియో సినిమా ప్రీమియం పొందే అవకాశం ఉన్న ఈ ప్లాన్ 28 రోజులపాటు ఉంటుంది ఇందులో కూడా 2gb డేటా ఉచితంగా పొందే అవకాశం ఉంది.
రూ. 175 ప్లాన్ – జీ5 సబ్స్కిప్షన్, జియో సినిమా, సోనీ లివ్ ఈ ప్లాన్ లో అందుబాటులో ఉన్నాయి. 28 రోజుల పాటు అందుబాటులో ఉండే ఈ ప్లాన్ లో 10GB ఉచితంగా లభిస్తుంది.
ఈ ప్లాన్స్ తో పాటు జియో మెుబైల్ ఆఫర్స్ ను సైతం మరింత మెరుగ్గా తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది.