Asia Cup 2025 : ఆసియా కప్ 2025 లో భాగంగా సెప్టెంబర్ 28న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆసియా కప్ ప్రారంభమై 41 సంవత్సరాలు అయింది. అయితే ఈ 41 ఏళ్లలో 14 సార్లు వన్డే ఫార్మాట్, 2 సార్లు టీ -20 ఫార్మాట్ లో టోర్నీ జరిగింది. మొత్తానికి భారత్ 8 సార్లు విజేతగా నిలిచింది. కానీ ఒక్కసారి కూడా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ మాత్రం జరుగలేదు. తొలిసారిగా ఆసియా కప్ 2025 ఫైనల్ లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో చిలుక జోస్యం కూడా దాయాది పోరులో టీమిండియానే పై చేయి సాధిస్తుందని చెబుతోంది. ఇటీవల లీగ్ దశలో జరిగిన మ్యాచ్ కి కూడా ఈ చిలుక జోస్యం చెప్పినట్టే జరిగింది. ఇక ఫైనల్ కూడా అలాగే జరుగుతుందని టీమిండియా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : IND Vs PAK : ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్… బీసీసీఐ సంచలన నిర్ణయం.. బాయ్ కాట్ చేస్తూ
ఇక ఆసియా కప్ డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తమ టైటిల్ ను నిలబెట్టుకునేందుకు సన్నద్ధం కాగా.. సరిగ్గా రెండేళ్ల కిందట వన్డే ఫార్మాట్ లో ఈ టోర్నీలో విజేతగా నిలిచిన భారత్.. ఇప్పుడు టీ-20 ఫార్మాట్ లో కూడా టైటిల్ సాధించాలనే ధీమాతో ఉంది. ఇవాళ జరిగే ఫైనల్ లో టీమిండియా తో పాకిస్తాన్ తలపడనుంది. వరుసగా ఆరు విజయాలతో సత్తా చాటిన సూర్యకుమార్ యాదవ్ సేన .. ఫైనల్ పేవరేట్ గానే కనిపిస్తోంది. ఇక అదే జోరు ఈ ఒక్క మ్యాచ్ లో కనబరిస్తే.. ట్రోఫీ టీమిండియా చేతిలోకి వచ్చేస్తోంది. మరోవైపు పాకిస్తాన్ జట్టు కూడా అన్ని రంగాలలో బలహీనంగా కనిపిస్తోంది. అయితే ఈ మ్యాచ్ లో పుంజుకుంటే మాత్రం ఫలితం మరోలా ఉంటుంది. అందుకు టీమిండియా వారికి అస్సలు అవకాశం ఇవ్వకపోవడం మంచిది.
వాస్తవానికి లీగ్ దశలో మ్యాచ్ కి ముందు టీమిండియా అభిమానులు, పహల్గామ్ బాధితుల కుటుంబాలు పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడకూడదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ టీమిండియా మ్యాచ్ ఆడి రెండు సార్లు గెలిచింది. కానీ ఫైనల్ లో కూడా విజయం సాధించకుంటే మాత్రం ఇండియా పరువు పోతుందని ఇప్పటికీ కూడా పహల్గామ్ బాధితులు, టీమిండియా ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. మరోవైపు షేక్ హ్యాండ్ వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక బీసీసీఐ కూడా సంచలన నిర్నయం తీసుకుంది. ఫైనల్ మ్యాచ్ కి బీసీసీఐ అధికారి ఎవ్వరూ కూడా దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్ లో అందుబాటులో ఉండరని తేల్చి చెప్పింది. కేవలం టీమిండియా ఆటగాళ్లు, కోచ్ లు మాత్రమే స్టేడియంలో ఉంటారు. ఇక ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీమిండియా-పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ అంటే ఎంతటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు అంతగా ఫామ్ కనబరచలేదు. కానీ ఫైనల్ లో తప్పకుండా ఫామ్ లోకి రావాలని అభిమానులు కోరుతున్నారు. మరోవైపు బౌలింగ్ లో బుమ్రాతో పాటు స్పిన్నర్లు రాణిస్తున్నారు. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే ఫామ్ లో కనబరచలేదు.