BigTV English

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (సెప్టెంబర్‌ 28 – అక్టోబర్‌ 04)

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (సెప్టెంబర్‌ 28 – అక్టోబర్‌ 04)

Weekly Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఈ వారం (సెప్టెంబర్‌ 28 – అక్టోబర్‌ 04) రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి:

ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుం. విద్యార్థులు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వివాదానికి సంబంధించి దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. ఆరోగ్య విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు మరింత అనుకూలంగా సాగుతాయి.   

వృషభ రాశి: 

అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచన చేయడం మంచిది. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. శుభకార్య విషయమై ఆత్మీయులతో చర్చలు చేస్తారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల అండదండలతో పదోన్నతులు పెరుగుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. శత్రు సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. వాహన వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు అందుతాయి. హయగ్రీవ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.


మిథున రాశి: 

ముఖ్యమైన విషయాలలో ఆత్మీయుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు కొంత జాప్యం జరిగినా ప్రధానంగా పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక రుణాలు కొంత తీరతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు.  

కర్కాటక రాశి:

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యవహారాలు చేపట్టిన సమయానికి పూర్తి చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. మీ నిర్ణయాలు కుటుంబంలో అందరికి ఆమోదయోగ్యంగా ఉంటాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో దీర్ఘకాలిక సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.  

సింహారాశి:

వారం ప్రారంభంలో రుణ వత్తిడి అధికమవుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు గతం కంటే కాస్త మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. కొన్ని రంగాల వారికి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఒక విషయంలో ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు.  

కన్యా రాశి:

ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అవసరానికి ధన సహాయం అందుతుంది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో వ్యవహారాల గురించి చర్చలు చేస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలలో ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది. ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. చిన్న తరహా పరిశ్రమలు అనుకూల వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో బంధు వర్గం వారితో వివాదాలు కలుగుతాయి.  వారం మధ్యలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.  

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

 తులా రాశి:

ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. శత్రు పరమైన సమస్యలను ఓర్పుగా పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూల స్థానచలన సూచనలు ఉన్నవి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు అధికారుల అండదండలు లభిస్తాయి. వారం మధ్యలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించటం మంచిది.  

వృశ్చిక రాశి: 

నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. విద్యార్థులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో మీ పనితీరు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వారం చివరిలో పనులలో జాప్యం కలుగుతుంది.  సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది.  

ధనస్సు రాశి:

ఆత్మీయుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగు పడతాయి. వారం ప్రారంభంలో కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు కుటుంబ సభ్యుల సహాయంతో సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుని కష్ట సుఖాలు విచారిస్తారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు నుండి బయటపడతారు. కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి.  

మకర రాశి:

దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వారం ప్రారంభంలో ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు ఉంటాయి. దాయాదులతో భూవివాదాలు కొలిక్కి వస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. అన్ని రంగాల వారికి మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి.  

కుంభ రాశి: 

ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి. మిత్రులతో కలహాల సూచనలు ఉన్నవి. భూవివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. చాలాకాలంగా పూర్తి కాని పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. గృహ నిర్మాణ యత్నాలు కలసి వస్తాయి. ఉద్యోగాలలో ఇతరులతో ఉన్న సమస్యలను పరిష్కరించుకొని ఊరట చెందుతారు. చిన్నతరహా పరిశ్రమలకు కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.  

మీన రాశి:

కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో అకారణంగా తగాదాలు నెలకొంటాయి. వాహన యోగం ఉన్నది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. నూతన రుణాలు చేస్తారు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యటం మంచిది. బంధు మిత్రుల నుండి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు చికాకులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వారం మధ్యలో సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి.  

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (28/09/2025)               

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (27/09/2025)               

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (26/09/2025)               

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (25/09/2025)               

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (24/09/2025)               

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు. (23/09/2025)               

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలం (సెప్టెంబర్‌ 22 – సెప్టెంబర్‌ 28)

Big Stories

×