Big Stories

Mobiles Launching in April 2024: ఏప్రిల్ నెలలో లాంచ్ కానున్న స్మార్ట్‌ఫోన్ల లిస్ట్.. అదిరిన మోడల్స్ & ఫీచర్స్!

Up Coming Smartphones
Up Coming Smartphones

Smartphones Launching in April Month: 2024 జనవరిలో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు బోలెడు స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేశాయి. అవి కూడా మిడ్‌రేంజ్ ప్రైజ్ సెగ్మెంట్‌లో రావడంతో స్మార్ట్‌ఫోన్ కంపెనీల సేల్స్ భారీగా పెరిగాయి. ఈ క్రమంలో మరోసారి తమ సేల్స్ పెంచుకునేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయి. ఏప్రిల్ నెలలో న్యూ స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నాయి. ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీలైన Samsung, OnePlus, Realme, Motorola వంటి కంపెనీలు మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు వెల్లడించాయి. ఏయే బ్రాండ్ల నుంచి ఏ ఫోన్లు రానున్నాయో చూసేయండి.

- Advertisement -

Samsung: 

- Advertisement -

Samsung Galaxy M55 మోడల్ తీసుకురానుంది. ఇది శాంసంగ్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్. ఇందులో
Galaxy M55, Galaxy A35, Galaxy A55 వంటి వేరియంట్లు ఉన్నాయి. Galaxy M55 మొబైల్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్‌తో రానుంది. ఇందులో 8GB RAM – 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ లభిస్తుంది. దీని ధర రూ.30వేలు ఉండవచ్చు.

OnePlus: 

OnePlus Nord CE 4 మోడల్‌ను లాంచ్ చేయనుంది. ఇది ఏప్రిల్ 1, 2024న మార్కెట్‌లో ప్రవేశపెడుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇది 8GB RAM- 256GB ఇంటర్నల్‌ స్టోరేజీతో లభిస్తుంది. స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 SoC ప్రాసెసర్‌పై మొబైల్ పనిచేస్తుంది. అంతేకాకుండా ఇందులో 20Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లే ఉంటుంది.

Also Read: ఫ్లిప్‌కార్ట్‌ హోలీ సేల్.. 5జీ స్మార్ట్ ఫోన్ మరీ ఇంత చీపా!

Moto:

Moto Edge 50 Pro స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. ఇది తన తాజా ఫ్లాగ్‌షిప్ సగ్మెంట్ ‌ఫోన్. ఏప్రిల్ 3, 2024న ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌ను కలిగి ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 ఇంచెస్ డిస్‌ప్లే ఉంటుంది. 1.5K రిజల్యూషన్ కర్వ్డ్ OLED డిస్‌ప్లేను పొందుపరిచారు.

Realme:

Realme GT 5 Pro స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. GT 5 ప్రో మొబైల్‌లో
మెటల్ ఫ్రేమ్ మరియు వేగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ ఉంటాయి. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలానే 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇందులో 5,400 mAh బ్యాటరీని ఉంటుంది.

Also Read: వాట్సప్ నుంచి క్రేజీ ఫీచర్.. 30 సెకన్లు కాదు.. ఇక నుండి స్టేటస్ నిమిషం పెట్టొచ్చు!

Google Pixel:

Google Pixel 8a మోడల్ లాంచ్ చేయనుంది. ఇది పిక్సెల్ 8 యొక్క టోన్-డౌన్ వెర్షన్, టెన్సర్ G3 ద్వారా వేగంగా పనిచేస్తుంది. ఇందులో మరో అద్భతమైన గూగుల్ AI ఫీచర్ ఉండనుంది. Pixel 7Aతో పోలిస్తే ఈ ఫోన్‌లో సమర్థవంతంగా పనిచేస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News